Ravi Teja Eagle movie Vs Rajinikanth Lal Salaam, Yatra 2 and Ooru Peru Bhairavakona: సంక్రాంతి బరిలో మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమా విడుదల కావాలి. అయితే, తెలుగు చిత్ర పరిశ్రమ బాగు కోసం విడుదల వాయిదా వేశారు. అందుకు ప్రతిఫలంగా ఆ సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా చూస్తామని ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు చెప్పారు. పరిస్థితి చూస్తుంటే... ఫిబ్రవరి 9న రవితేజకు సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ఆ రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.


కొత్తగా బరిలోకి వచ్చిన 'లాల్ సలాం'
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'లాల్ సలాం'. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. నిజానికి, ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమైంది. అయితే... తమిళంలో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'తో పాటు తెలుగులో నాలుగు సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు లేటెస్టుగా అనౌన్స్ చేశారు.


Also Read: 'గుంటూరు కారం'కు 'దిల్' రాజు రివ్యూ - పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా, స్క్రీన్లు చిరుగుతాయ్


రజనీకాంత్ సినిమా కనుక తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అవుతుంది. తమిళంలో విడుదల చేసిన వారం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు లేవు. సో... రవితేజ 'ఈగల్'తో పాటు 'లాల్ సలాం' కూడా రిలీజ్ అవుతుంది. అంటే... ఆ రోజు సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు మరొక ఆప్షన్ ఉంటుంది. రవితేజ సినిమాకు అడ్వాంటేజ్ లేనట్టే.


డీజే టిల్లు వెనక్కి వెళ్లినా బరిలో మరో రెండు
'ఈగల్' సంక్రాంతి బరి నుంచి వాయిదా పడకముందు ఫిబ్రవరి 9న 'డీజే టిల్లు' సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రవితేజ మంచి మనసుతో తన సినిమా విడుదల వాయిదా వేయడంతో 'గుంటూరు కారం నిర్మాతలు 'టిల్లు స్క్వేర్'ను ఫిబ్రవరి 9న విడుదల చేయకూడదని నిర్ణయించారు. అయితే... ఆ వారం మరో రెండు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.


Also Readశ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కీలక మలుపుల ఆధారంగా రూపొందిన 'యాత్ర 2' ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఆ సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేవు. ఏపీలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కావడం, ఫిబ్రవరి 8న 'యాత్ర' విడుదల కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ రిలీజ్ డేట్ అని ఫిక్స్ చేశారు. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాను కూడా ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి నిర్మాత అనిల్ సుంకర రెడీగా ఉన్నారు.


'ఈగల్' సినిమాను వాయిదా వేయడం కోసం జరిగిన చర్చల్లో 'ఊరు పేరు భైరవకోన' ఫిబ్రవరి 9న విడుదలకు ఉందనే ప్రస్తావన రాలేదట. పైగా, నిర్మాత అనిల్ సుంకరను ఎవరూ సంప్రదించలేదట. అందుకని, తన సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారట. ఒకవేళ ఛాంబర్ పెద్దలు ఆయనతో మాట్లాడితే ఆ సినిమా విడుదల వాయిదా పడుతుందేమో!? 'యాత్ర 2', 'లాల్ సలాం' వాయిదా పడటం కష్టమే. పరిస్థితులు చూస్తుంటే... రవితేజ చేసిన త్యాగం వృథా అవుతున్నట్లు ఉంది. ఆయన 'ఈగల్' సినిమాకు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు.


Also Readతెలంగాణలో 4 గంటల నుంచి గుంటూరు కారం షోస్ - టికెట్ రేట్ ఎంత పెంచారంటే?


సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్', తేజా సజ్జా 'హనుమాన్' సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. 'గుంటూరు కారం'ను నైజాం, విశాఖలో 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబుకు బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. దిల్ రాజుతో పాటు ఆయన తలుచుకుంటే 'ఈగల్'కు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు లభించడం కష్టం ఏమీ కాదు. రవితేజ అభిమానులకు సంతోషం కలిగించే అంశం ఇది.