Telangana CM Revanth Reddy Review On Schemes: తెలంగాణ (Telangana)లో అర్హులైన పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా మరో చర్య తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు తెలియజేశారు. గ్రామకమిటీల ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందేలా చేస్తామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy )బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలతో ఫలు బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ (Congress)పెద్దలతో పాటు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అదే సమయంలో ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నారు. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీ(Indiramma Comittee)లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు
ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నేతలకు సూచించారు. మంత్రులు,  ఎమ్మెల్యేలు నిజాయితీ ఉన్న అధికారులను నియమించుకొని మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావులేదన్న సీఎం, అవినీతి అధికారుల్ని ప్రోత్సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకోచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయిస్తామని, ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులదే నిధులకు బాధ్యత వహించాల్సిన ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 


అర్హులందరికీ పథకాల ఫలితాలు
ఆరు గ్యారంటీలకు వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందించాల్సిన బాద్యత ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 100 రోజుల్లోగా హామీల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన
మరోవైపు ఈ నెల 26 తరువాత జిల్లాల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని, ఎవరైనా వచ్చి ప్రత్యక్షంగా కలవొచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Also Read:సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు మరోసారి కలిసి వస్తుందా? ఈసారి బరిలోకి ఎవరంటే! 


Also Read: