Guntur Kaaram tickets price hike in Telangana state: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సినిమా రానుంది. గురువారం (ఈ నెల 11వ తేదీ) మిడ్ నైట్ 1 గంట నుంచి ఎంపిక చేసిన 23 థియేటర్లలో బెనిఫిట్ షోల ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదలైన రోజు నుంచి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఉదయం నాలుగు గంటల షో ప్రదర్శనకు సైతం అనుమతులు లభించాయి.


తెలంగాణలో టికెట్ రేటు ఎంత పెంచారంటే?
'గుంటూరు కారం' 12వ తేదీన విడుదల అవుతుంటే... ఆ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వారం పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100 టికెట్ పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఐదు షోలు వేస్తున్నారు. కొన్ని థియేటర్లలో నాలుగు షోలు మాత్రమే వేస్తున్నారనుకోండి. అయితే... రోజుకు  ఆరు షోలు ప్రదర్శించవచ్చని, ఉదయం నాలుగు గంటలకు ఒక షో ప్రదర్శనకు సైతం అనుమతి లభించింది.


Also Read'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు... మమ మహేష్ మాస్






టాలీవుడ్ ఫ్రెండ్లీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి నెల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ముందు సుమారు పదేళ్ల పాటు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) అధికారంలో ఉంది. కెసిఆర్ తనయుడు, మంత్రిగా పని చేసిన కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ టాలీవుడ్ ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.


Also Readశ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్


రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే ప్రశ్న తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరిలో వచ్చింది. ఇప్పుడు 'గుంటూరు కారం', దీనికి ముందు 'సలార్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా తమది సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపినట్లు అయ్యింది. 


Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్... అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?



రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కొంత మంది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో పాటు కొందరు నిర్మాతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు నూతన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఉగాదికి నంది అవార్డులు సైతం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.