Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు - మ మ మహేష్ మాస్

Mahesh Babu's Guntur Kaaram records: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. దీని దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'సలార్' ట్రైలర్ రికార్డు గల్లంతు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'సలార్' రికార్డు బ్రేక్ చేసిన 'గుంటూరు కారం'
Guntur Kaaram trailer records: 'గుంటూరు కారం' సినిమా ట్రైలర్ ఆదివారం రాత్రి విడుదల చేశారు. సోమవారం రాత్రికి... అంటే 24 గంటల్లో మహేష్ మాస్, ఎనర్జీతో కూడిన ట్రైలర్ 39 మిలియన్ వ్యూస్ సంపాదించింది. 24 గంటల్లో 'సలార్' ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో హయ్యస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్ కింద 'గుంటూరు కారం' సరికొత్త రికార్డు నమోదు చేసింది. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఖుషీగా ఉన్నారు.

Also Read: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్

గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్
Guntur Kaaram pre release event venue time: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు గుంటూరులో జరగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్ అందుకు ముస్తాబు అవుతోంది. మొదట ఈ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో చేయాలని ప్లాన్ చేశారు. అయితే... లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా చిత్ర బృందం ఎంపిక చేసుకున్న చోట పోలీసులు అనుమతి నిరాకరించారు.  దాంతో గుంటూరుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ షిఫ్ట్ అయ్యింది.

Also Read: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే

Guntur Kaaram Release Review In Telugu: సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ అవుతోంది. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో మహేష్ సరసన యంగ్ హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, 'రంగస్థలం' మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ప్రొడ్యూస్ చేశారు.

Continues below advertisement
Sponsored Links by Taboola