Mahesh Babu: 'గుంటూరు కారం' ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది. గుంటూరు మిర్చి ఘాటు, హుషారు, జోరు హీరో క్యారెక్టరైజేషన్‌లో తమకు కనిపించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం... ఘట్టమనేని అభిమానులు, ప్రేక్షకులు మహేష్ బాబును ఇంత మాస్ ఎనర్జిటిక్ క్యారెక్టర్‌లో అయితే చూడలేదు. సినిమా ఫస్ట్ రివ్యూ కూడా మహేష్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది.


'గుంటూరు కారం' సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఓవర్సీస్ ఏరియాలకు సైతం ప్రింట్స్ డెలివరీ అయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... దుబాయ్‌లోనూ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. అక్కడ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకొనే ఉమైర్ సందు సినిమా షార్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. 


'గుంటూరు కారం' సూపర్ హిట్... 3.5 స్టార్ రేటింగ్
Guntur Kaaram Movie First Review In Telugu: 'గుంటూరు కారం' సూపర్ హిట్ సినిమా అని ఉమైర్ సందు X (ట్విట్టర్)లో పేర్కొన్నారు. మహేష్ బాబుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్లుగా ఉందని చెప్పారు. మాస్ ప్రేక్షకులు మెచ్చే, వాళ్లకు కావాల్సిన మసాలా అంశాలు 'గుంటూరు కారం'లో పుష్కలంగా ఉన్నాయని, రూల్స్ తిరగరాసే సినిమా అవుతుందని, పండగ సీజన్ కలిసి వస్తుందని ఉమైర్ సందు తెలిపారు. ఆయన రివ్యూ మహేష్ బాబు అభిమానులు సంతోషాన్ని ఇచ్చింది.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?






మహేష్ బాబు అప్పటి వరకు చేసిన క్యారెక్టర్లతో కంపేర్ చేస్తే... 'అతడు', 'ఖలేజా' సినిమాలలో హీరోను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత కొత్తగా అయితే చూపించారో... ఈ సినిమాలోనూ అంతే కొత్తగా చూపించారని అర్థం అవుతోంది. సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ సినిమా అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ శుక్రవారం (జనవరి 12న) సినిమా విడుదల కానుంది.


Also Readకాంజూరింగ్ కన్నప్పన్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో రెజీనా, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ సినిమా



మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మలయాళ హీరో జయరామ్, రావు రమేష్, 'వెన్నెల' కిషోర్, 'రంగస్థలం' మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మాస్ జనాలకు బాగా నచ్చింది. అదే సమయంలో ఆ సాంగ్ మీద కొన్ని విమర్శలు సైతం వచ్చాయి. వాటిని పక్కన పెడితే... సినిమాకు అవసరమైన ప్రచారాన్ని ఆ పాట తెచ్చింది. 


'గుంటూరు కారం' సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. 'జులాయి' నుంచి త్రివిక్రమ్ సినిమాలను ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు.