Bandla Ganesh Driver wife Suicide: సినిమా నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla Ganesh) కారు డ్రైవర్‌ (Car driver) భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భర్తకు ఫోన్‌ చేసి... ఉరివేసుకుందని సమాచారం. ఈ సంఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది.


ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన రమణ (Ramana)... సినిమా నిర్మాత బండ్ల దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య చందన(Chandana) ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తోంది. వీరు.. హైదరాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్ (Banjarahills) రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్‌(Indiranagar)లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జనవరి 7వ తేదీ) రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో... చట్నీ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. చట్నీ ఎక్కువ వేశావంటూ భార్య చందనతో రమణ గొడవపడినట్టు సమాచారం. ఈ విషయంలో మాటమాట పెరిగి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో చందన తీవ్ర మనస్తాపం చెందింది. 


ఎప్పటిలాగే... సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం భర్త గణేష్‌ డ్యూటీ నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. చందన ఇంట్లో ఒక్కటే ఉంది. భర్తతో గొడవ జరిగినప్పటి నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న ఆమె... ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుందో ఏమో. ఇంటి నుంచి భర్తకు ఫోన్‌ చేసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పి... ఫోన్‌ పెట్టేసింది. రమణ వెంటనే ఇంటి ఓనర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చి... డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటి యజమాని వెంటనే పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో కిటికీలోంచి చూడగా చందన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే చందన చనిపోయి కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.


చందన తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే... చందన ఆత్మహత్యకు చట్నీ విషయంలో జరిగిన గొడవే కారణమన్నది నమ్మశక్యంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా... చిన్నవిషయాలు.. క్షణికావేశంతో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. ఇది సరికాదు. చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు... కష్టాన్ని ఎదుర్కోగల ధైర్యం కూడా ఉండాలి. సమస్యలు దాటుకుంటూ... జీవితంలో ముందుకు సాగాలి. అంతేగానీ... ఇలా.. చిన్నచిన్న విషయాలకు ప్రాణాలు తీసుకోవడం సరికాదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. సమస్యలు ఆత్మహత్యలను పరిష్కారంగా ఎంచుకోకూడదు. సమస్యలను ఎదుర్కోగల ధైర్యాన్ని పెంచుకోవాలి. చిన్న కష్టం వచ్చిందని.. ప్రాణం తీసుకుంటే.. అర్థమేముంటుంది. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం రావాలని... ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు... ఒక్కసారి ఆలోచించాలని సూచిస్తున్నారు. 


చందన తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు ఆత్మహత్యపై ఇప్పటికే ఆమె భర్త రమణ స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.