Vijayasai Reddy met the Election Commission :  ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు పెట్టాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారి అభ్యంతరాలను , ఫిర్యాదులను సీఈసీ స్వీకరించింది. ఈ క్రమంలో వైసీపీ నుండి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సమావేశానికి హాజర్యయారు. ఈ సందర్బంగా టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. జనసన గుర్తింపులేని పార్టీ అని, దానిని ఎలా అనుమతించారని ఎన్నికల కమిషన్ ను తాము ప్రశ్నించామని విజయసాయి రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదయిన వారంతా ఇక్కడ కూడా నమోదు చేసుకున్నారని, రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని తెలిపారు.


ఆరు అంశాలపై ఈసీకి ఫిర్యాదు 


ఎక్కడా బోగస్ ఓట్లు లేవని జిల్లా కలెక్టర్లు నివేదిక ఇచ్చారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆరు అంశాాలపై తాము సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.టీడీపీ మ్యానిఫేస్టో పేరుతో ఒక వెబ్‌సైట్ పెట్టి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకే ఫేజ్ లో పెట్టాలని సీఈసీని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు.
 
జనసేన ఎవరి అలయెన్స్ లో ఉంది ?


జనసేన గుర్తింపులేని పార్టీ అని, దానిని ఎలా అనుమతించారని ఎన్నికల కమిషన్ ను తాము ప్రశ్నించామని విజయసాయి రెడ్డి తెలిపారు.   అలయన్స్‌ పార్టీగా అనుమతించాలన్న టీడీపీ కోరినట్టు ఈసీ అధికారులు తెలిపారన్నారు. జనసేన పార్టీ ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్‌‌గా ఉందని, నిన్న ఈసీకి ఇచ్చిన వినతిలో టీడీపీతో అలయన్స్‌ పార్టనర్‌గా పేర్కొన్నారని సాయిరెడ్డి చెప్పారు. జనసేన బీజేపీ అలయన్స్‌ పార్టనర్‌ లేదా టీడీపీ అలయన్స్‌ పార్టీనా అనేది స్పష్టం చేయాలన్నారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అని, గ్లాస్‌ గుర్తు సాధారణ చిహ్నమని, కామన్‌ సింబల్‌ను కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన పార్టీకి కేటాయించడాన్ని తాము తప్పు పట్టినట్టు చెప్పారు.


తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారు ఏపీలోనూ ఓటర్లు 


తెలంగాణలో ఓటర్లుగా నమోదయిన వారంతా ఇక్కడ కూడా నమోదు చేసుకున్నారని, రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని తెలిపారు. ఎ  తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకే ఫేజ్ లో పెట్టాలని సీఈసీని కోరామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తికి బోగస్‌ ఓట్లు ఉన్నాయనే సంగతి ఎలా తెలుస్తుందని సాయిరెడ్డి ప్రశ్నించారు. 175 నియోజక వర్గాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. 26జిల్లాల కలెక్టర్లకు పంపిన ఫిర్యాదును ఈర్వోలు విచారించి, బోగస్ ఓట్ల వ్యవహారంపై నివేదిక ఇచ్చారని, 26జిల్లాల్లో ఫిర్యాదులపై నివేదికల్లో బోగస్‌ ఓట్లు లేవని కలెక్టర్లు తేల్చారని చెప్పారు.