Hanuman movie distribution rights area wise: సంక్రాంతి 2024 బరిలో విడుదలకు సిద్ధమైన చిన్న సినిమా 'హనుమాన్'. సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' సినిమాలతో పాటు తేజా సజ్జా తన సినిమాను తీసుకు వస్తున్నారు. అయితే... ఆయా సినిమాలకు తన సినిమాను పోటీగా చూడవద్దని తెలిజయేశారు కూడా! 


మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసిన తేజా సజ్జా... ఇవాళ సూపర్ స్టార్ సినిమాకు పోటీగా తన సినిమాను విడుదల చేస్తున్నారని కొందరు ట్వీట్లు చేశారు. సూపర్ స్టార్ సినిమాకు పోటీ కాదని, సూపర్ స్టార్ సినిమాతో పాటు తన సినిమా విడుదల చేస్తున్నామని తేజా సజ్జా తెలిపారు. థియేటర్స్ సమస్య వచ్చినప్పుడు సైతం తెలుగు కంటే నార్త్ ఇండియా రిలీజ్ తమకు ముఖ్యమని 'హనుమాన్' దర్శక నిర్మాతలు చెప్పినట్లు దిల్ రాజు తెలిపారు. ఉత్తరాదిలో 'హనుమాన్' సినిమా మీద విరీతమైన క్రేజ్ నెలకొంది. అయితే... ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో లేదు. తక్కువ రేట్లకు సినిమాను ఇచ్చారు. 


'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... నార్త్ ఇండియా కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తేజా సజ్జా 'హనుమాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ బావుంది. యంగ్ హీరోలలో తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో తేజ సక్సెస్ అయ్యారు. 'హనుమాన్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏరియాల వారీగా చూస్తే... 



  • నైజాం (తెలంగాణ) - రూ. 7.50 కోట్లు

  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 4 కోట్లు

  • ఆంధ్ర (అన్ని జిల్లాలు కలిపి) - రూ. 10 కోట్లు

  • ఏపీ, టీజీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 21.50 కోట్లు

  • కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు

  • ఓవర్సీస్ (విదేశాలు) - రూ. 4 కోట్లు

  • టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 27.50 కోట్లు


Also Read: 'గుంటూరు కారం'తో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్స్ దుమ్ము దులిపిన మహేష్... ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? మహేష్ లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగింది?


'హనుమాన్' సినిమాకు 27.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మంచి అమౌంట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే స్టార్ హీరోల భారీ సినిమాల మధ్య అన్ని కోట్లు రావడం పెద్ద కష్టం ఏమీ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


'హనుమాన్' సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సిస్టర్ రోల్ చేశారు. తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రిలీజ్ అన్నమాట.


Also Read'గుంటూరు కారం'కు 'దిల్' రాజు రివ్యూ - పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా, స్క్రీన్లు చిరుగుతాయ్



ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి,  ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అస్రిన్ రెడ్డి, ఎడిటర్: సాయిబాబు తలారి,  సంగీత దర్శకులు: గౌర హరి - అనుదీప్ దేవ్ - కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌ విల్లే, సమర్పణ: శ్రీమతి చైతన్య, నిర్మాణ సంస్థ: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: కె నిరంజన్ రెడ్డి, రచన & దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.