హైద‌రాబాద్‌లో దుర్గం చెరువు ఫేమ‌స్‌ అని చెప్పాలి. ఇప్పుడు దానిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కూడా ఫేమ‌స్సే. చాలామందికి అదొక టూరిస్ట్ స్పాట్. దానిని చూడటం కోసం కొందరు వస్తున్నారంటే... అతిశయోక్తి కాదు. సామాన్యులను మాత్రమే కాదు... సినిమా దర్శక, నిర్మాతలను కూడా కేబుల్ బ్రిడ్జ్ అట్ట్రాక్ట్ చేస్తోంది. కేబుల్ బ్రిడ్జ్ మీద షూటింగ్స్ చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. లేటెస్టుగా 'ఎఫ్ 3' షూటింగ్ కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద జరిగింది.


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న సినిమా 'ఎఫ్ 3'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైద‌రాబాద్‌లో జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి కేబుల్ బ్రిడ్జ్ మీద వెంకటేశ్, వరుణ్ తేజ్ పాల్గొనగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ హడావిడితో కేబుల్ బ్రిడ్జ్ మీద సందడి నెలకొంది.


Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


'ఎఫ్ 2' తర్వాత  వెంకటేశ్‌, వ‌రుణ్‌తేజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు సీక్వెల్ అని చెప్పలేం. కానీ, 'ఎఫ్ 3'లో 'ఎఫ్ 2'లో క్యారెక్టరైజేషన్లు ఉంటాయి. అందులో హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహరీన్ ఇందులోనూ నటిస్తున్నారు. కొత్తగా సోనాల్ చౌహన్ యాడ్ అయ్యారు. 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎఫ్ 2' సంక్రాంతికి విడుదలైంది. ఈసారి పండక్కి కొంచెం వెనక్కి వెళ్లారు. 'బొమ్మ ఎప్పుడు పడితే... అప్పుడే నవ్వుల పండగ' అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. 


Also Read: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?



దీపావళి కానుకగా విడుదల కానున్న 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలో ఓ పాటను కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద తెరకెక్కించారు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలో కొన్ని సన్నివేశాలను దుర్గం చెరువులో తెరకెక్కించారు. వాటిలో కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జ్ కొత్త షూటింగ్ స్పాట్ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 


Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...


Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?


Also Read: పునీత్ నా బాడీగార్డ్.. జిమ్ చేయడం వల్ల చనిపోలేదు, రాత్రి నుంచే..: హీరో శ్రీకాంత్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి