ఉర్ఫి జావేద్... ఈ పేరు మన తెలుగు వారికి తెలియకపోవచ్చు. హిందీ సీరియళ్లు చూసేవారు ఈ అమ్మాయిని పోల్చగలరు. ‘బాదే బయ్యా కీ దుల్హనియా’, ‘మేరీ దుర్గా’ వంటి సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కూడా పాల్గింది. కానీ త్వరగానే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది. బయటికి వచ్చాక కంటెస్టెంట్ లు ఇంటర్య్వూలు ఇవ్వడం సహజమే. ఉర్ఫి తన జీవితంలో జరిగిన ఘటనలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో పంచుకుంది. అందులో ఆమె పడిన కష్టాలు, ఎదురైన సవాళ్లు సినిమా ఇండస్ట్రీలో పడిన బాధలను ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
ఉర్ఫి జావేద్ చాలా సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది. కానీ ఆ కుటుంబంలో ఆడపిల్లలు సినిమాలో చేయడం వంటివి ఇష్టపడరు. నటిగా మారాలన్న కోరికతో టీనేజీ వయసులోనే ఇల్లు వదిలి పారిపోయింది. తెలియని ప్రపంచంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బతకడం ఎంత కష్టమో అనుభవమైంది. రూ.3000తో బతికిన రోజులు ఉన్నాయి. కొన్ని సార్లు తినడానికి ఏమీలేక పస్తులు కూడా ఉంది. వీటన్నింటికి కన్నా ఆమెను కుంగదీసిన సంఘటన ఒక నిర్మాత ఆమెతో ప్రవర్తించిన తీరు. దాని గురించి ఉర్ఫి మాట్లాడుతూ ‘అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగాను. కొన్ని ఆఫర్ వచ్చినట్టే కనిపించేది. చివరి నిమిషంలో క్యాన్సల్ చేసేవారు. ఒకసారి ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. దానికి ఓ మహిళ నిర్మాతగా పనిచేస్తోంది. నాచేత ముందే కాంట్రక్ట్ పేపర్లపై సంతకాలు కూడా చేయించుకున్నారు. మొదటి రోజు షూట్ కి వెళ్లా. ఆటోకి, ట్యాక్సీకి నా దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో బస్సు మీదే వెళ్లా. తీరా అక్కడికి వెళ్లాక ఆ మహిళా నిర్మాత నాతో కొన్ని అసభ్యకర సీన్లు చిత్రీకరించడానికి సిద్ధమైంది. నన్ను దుస్తులు తొలగించమని ఆర్డర్ వేసింది. నేను ఒప్పుకోలేదు. కాంట్రాక్టు పేపర్లపై చేస్తానని సంతకం పెట్టావుగా, చేయకపోతే జైలుకు పంపిస్తా అని బెదిరించింది. వద్దన్న వినిపించుకోలేదు. నా దుస్తులు చించేసింది. ఆ క్షణం నాకు నరకంలా తోచింది. ఆత్మహత్యా చేసుకోవాలనిపించింది. ఆ రోజు షూటింగ్ అయిపోగానే వెళ్లిపోయా. తిరిగి మరి ఆ షూటింగ్ వెళ్లలేదు’ అంటూ తన జీవితంలో జరిగిన భయంకర ఘటనను పంచుకుంది.
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
Also read: అక్టోబర్ 25 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి