ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ‘గాండీవధారి అర్జున’, ‘బెదురులంక 2012’, ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమాలు థియేటర్లలో అలరించబోతున్నాయి. గత వారం ఎన్నో అంచనాల నడుమ విడుదలై మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్‘ మూవీ డిజాస్టర్ గా మిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త చిత్రాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.   బ్లాక్ బస్టర్ ‘బేబీ’, ‘బ్రో’ సహా 21 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

    


ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు


1. గాండీవధారి అర్జున: ఆగస్టు 25న విడుదల


ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలవుతుంది.



2. బెదురులంక 2012: ఆగస్టు 25న విడుదల


యుగాంతం భయంతో ఒక ఊరిలో జరిగే సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు మేకర్స్. కార్తికేయ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్లాక్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తుంది.



3. కింగ్ ఆఫ్ కోథా: ఆగస్టు 24న విడుదల


దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించింది.  అభిలాష్ జోషిలీ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ పూర్తి స్థాయిలో ఊర మాస్ లుక్ లో కనిపించే ఈ మూవీ ఆగస్టు 24న రిలీజ్ అవుతుంది.



ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు


నెట్‌ఫ్లిక్స్


1. బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25న విడుదల


2. లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22న విడుదల


3. బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల


4. రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల


5. కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 న విడుదల


6. యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25న విడుదల



డిస్నీ ప్లస్ హాట్‌స్టార్


1. అశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల


2. ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల


3. ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25న విడుదల


ఆహా


1. బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25న విడుదల



బుక్ మై షో


1. సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇం‍గ్లీష్ సినిమా - ఆగస్టు 21న విడుదల


ఆపిల్ ప్లస్ టీవీ


1. ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల


2. వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల


మనోరమ మ్యాక్స్


1. కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25న విడుదల


Read Also: నా మోకాళ్లు చూసి అక్షయ్ అవమానించాడు - భానుప్రియ సోదరి శాంతి ప్రియా షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial