తన తల్లిని ఎదిరించి మాట్లాడి అవమానించినందుకు గాను రాజ్ కావ్యని నానా మాటలు అనేసి ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాడు. ఇంట్లో వాళ్ళు చెప్పేందుకు ప్రయత్నించినా కూడా వినిపించుకోకుండా భార్య మొహాన తలుపులు వేస్తాడు. కానీ కావ్య మాత్రం ఇదే తన ఇల్లు అని ఇంట్లోకి రానిచ్చే వరకు అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని గుమ్మం ముందు నిలబడి ఉంటుంది. అర్థరాత్రి వర్షం పడుతున్నా కూడా కావ్య వానలో తడుస్తూ అలాగే నిలబడుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రోమోలో కూడా ఇదే చూపించారు.


ప్రోమోలో ఏముందంటే..


కావ్య వర్షంలో గుమ్మం ముందు అలాగే నిలబడి ఉంటుంది. ఇంట్లో అందరూ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని కూర్చుంటారు. అప్పుడే కనకం, కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి వచ్చి వర్షంలో నిలబడి ఉన్న కావ్యని చూస్తారు. కనకం ఆవేశంగా తలుపులు తోసి ఇంట్లోకి కావ్యని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని నిలదీస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. భర్త నీడలో ఉండాలని మీలో మార్పు కోసం ఎదురుచూస్తున్న మీ ఇంటి కోడలికి చివరికి ఈ గతి పట్టించారా? అని కనకం ఇంట్లో వాళ్ళని ప్రశ్నిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దని అపర్ణ చెప్తుంది.


సీతారామయ్య: కౌరవ సభలో నిండు స్త్రీ మూర్తికి పరాభవం జరుగుతుంటే కళ్ళు లేని దృతరాష్ట్రుడిగా నేను.. కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారిలా నా భార్య మిగిలిపోయాము


కృష్ణమూర్తి: నువ్వు కట్టుకున్న భార్యని మందలించి లోపలికి రానీయలేవా?


రాజ్: రానివ్వలేను అని తెగసి చెప్తాడు


దీంతో కూతురి జీవితం ఏమవుతుందోనని ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతారు.


Also Read: షాకింగ్ నిర్ణయం తీసుకున్న భవానీ- ముకుందకి నిజం చెప్పిన మురారీ, రేవతి భయమే నిజమవుతుందా?


శనివారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


కావ్య ఇంటి దగ్గర రాజ్ బొమ్మలకి మట్టి తొక్కుతున్న ఫోటోను రుద్రాణి అపర్ణకి చూపించి ఇంట్లో చిచ్చు రాజేస్తుంది. కావ్య ఇంటికి రాగానే ఈ విషయం గురించి అపర్ణ నిలదీస్తుంది. కానీ కావ్య అసలు కొడుకు, కోడలు కలిసి సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదు అందుకే తనని ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారని ఎదురుతిరుగుతుంది. ఈ క్రమంలోనే అసలు మీరు ఆయనకి నిజంగా కన్న తల్లి ఏనా అని ప్రశ్నిస్తుంది. దీంతో రాజ్ కోపంగా కావ్య మీదకి చేయి ఎత్తుతాడు. అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత? నా తల్లిని నోటికొచ్చినట్టు తిడతావా? ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఇంట్లో ఉండటం మా అమ్మకి కాదు నాకు ఇష్టం లేదు. వెంటనే వెళ్లిపో అనేసి తనని స్వయంగా మెడ పట్టుకుని గెంటేస్తాడు. ఇంద్రాదేవి ఆగమని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఈ విషయంలో ఎవరు కల్పించుకోవద్దని, తను ఎవరి మాట వినదలుచుకోలేదని చెప్పి కావ్య మొహం మీద గుమ్మం తలుపులు వేస్తాడు. వదిన ఏ తప్పు చేయలేదని లోపలికి పిలవమని కళ్యాణ్ అడిగేందుకు వెళతాడు. కానీ రాజ్ మాత్రం ఆవేశంగా అంత జాలిగా ఉంటే తీసుకెళ్ళి పుట్టింటి దగ్గర వదిలేసి రమ్మని చెప్తాడు. తను మాత్రం ఆ పని చేయలేనని నిస్సహాయంగా కళ్యాణ్ వెళ్ళిపోతాడు. దీనికి కొనసాగింపే తాజా ప్రోమో.


Also Read: రెండు హృదయాలు భారమైన వేళ- వసు నుంచి ఊహించని ప్రశ్న, అయోమయంలో రిషి