మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టింది. ఇవాళ తెల్లవారుజామున ఉపాసన పండంటి పాపకు జన్మినిచ్చింది. అమ్మాయి రాకతో మెగా స్టార్ ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మనవరాలి రాకతో తాత మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడుతున్నారు. తాజాగా హాస్పిటల్ కు వెళ్లి ముద్దుల మనువరాలిన చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. చెర్రీ దంపతులకు పాప పుట్టడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తమ ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన రోజే మనవరాలు జన్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
చిరు మనువరాలిది అద్భుతమైన జాతకం- జగన్నాథ శాస్త్రి
చిరంజీవి మనువరాలి జాతకంపై పలువురు పండితులు స్పందించారు. ఆమె జాతకం అద్భుతంగా ఉందని జంధ్యాల జగన్నాథ శాస్త్రి వెల్లడించారు. మేష లగ్నంతో పాప భూమ్మీదకు వచ్చిందన్నారు. ఆ చిన్నారి పునర్వసు నక్షత్రంలో పుట్టిందన్నారు. ఈ నక్షత్రం సాక్షాత్తు శ్రీ రాముడి నక్షత్రమన్నారు. విష్ణు అంశంతో ఉన్న నక్షత్రంగా ఆయన వివరించారు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి ముగ్గురమ్మల మూలపుటమ్మల అంశతో చిన్నారి పుట్టిందని చెప్పారు. చిరంజీవి మనువరాలు సాక్షాత్తూ శ్రీజగన్మాతే అన్నారు. వాస్తవానికి ఇవాళ పూరి జగన్నాథుడుడి రథయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజుగా జగన్నాథశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇంతటి గొప్ప రోజున సాక్షాత్తు మహలక్ష్మిదేవిగా మెగా ఫ్యామిలీలోకి అమ్మాయి వచ్చిందన్నారు. ఈ చిన్నారి రామ్ చరణ్, ఉపాసన కుటుంబాల పేరు ప్రతిష్టతను పెంచుతుందన్నారు. ఇరు కుటుంబాలకు ఎనలేని కీర్తి తీసుకువస్తుందన్నారు.
చిరు ఫ్యామిలీకి సెంటిమెంట్ నెంబర్ 2
మరోవైపు మెగా ఫ్యామిలీకి ఎంతో నమ్మకమైన న్యూమరాలజీ ప్రకారం పాప పుట్టడం చిరు ఫ్యామిలీలో ఆనందాన్ని నింపింది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఆయన రెండో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే ఆయన స్టార్ గా ఎదిగారు. 2012లో ఉపాసనను చెర్రీ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు రీసెంట్ గానే తమ 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 12వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు జూన్ 20న ఉపాసన పాపకు జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సైతం ఆగస్టు 22. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కూడా సెప్టెంబర్ 2. ఇలా 2వ నెంబర్ మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారింది. న్యూమరాలజీ ప్రకారం పాపకు 2 నెంబర్ వస్తోంది. మెగా ఫ్యామిలీకి ఈమె ద్వారా మరింత గొప్పతనం వస్తుందని పండితులు చెప్తున్నారు. అటు ఉపాసన డాటర్ ఉన్నత స్థాయికి ఎదగడం గ్యారంటీ అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: మంగళవారం రోజు పాప పుట్టడం సంతోషం - జాతకం కూడా చాలా బాగుందంటున్నారు: చిరంజీవి