Trinayani Serial November 13th Episode


నయని: తిలోత్తమ అత్తయ్య పరిస్థితి కళ్లారా చూశారు కదా బాబు గారు. అంత తేలికగా తీసేస్తారు ఎందుకు జరగరానిది ఏదైనా జరిగి అత్తయ్య ప్రాణాలు పోతే
విశాల్: పోనీ
నయని: బాబు గారు మీరేనా ఈ మాట అన్నది
విశాల్: నోనో.. నా ఉద్దేశం అది కాదు నయని. పోనీ అంటే విషయాన్ని వదిలేయమని. పిల్లలు అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 
నయని: మిగతా పిల్లలు అలా చేస్తారని చెప్తారా చెప్పరు ఎందుకంటే గాయత్రీ పాప తప్ప ఇంకెవ్వరూ ఎవరికీ హాని కలిగించరు. నేను చెప్పేది వినండి బాబు గారు. మీ అమ్మ గారికి అలా అవ్వడంలో ఆశ్చర్యం ఉంది కాని జరిగే ప్రమాదాల్లో గాయత్రీ పాప ప్రమేయం ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నాను. మీరేమో ఆ ఫైల్ కావాలి ఈ ఫైల్ కావాలి అని అటు తిరిగి వెతుక్కుంటున్నారు. ఆ పిల్ల ఎందుకు తిలోత్తమ అత్తయ్య విషయంలో జోక్యం చేసుకుంటుంది. తనేం మిమ్మల్ని కన్న గాయత్రి దేవి అయితే కాదు కదా. కదా అవునా కాదా. తను పెద్దయ్య గారి మనవరాలు. అమ్మగారి పేరు పెట్టుకుంది. తల్లిలేని పిల్ల అని నేను పాలిచ్చి బిడ్డలా చూసుకున్నందుకు దత్తత తీసుకోమని ఇచ్చారు. గయత్రీ అమ్మగారు నా కడుపున పుట్టి తప్పిపోతే ఏదో ఒక రోజు ఇంటికి వస్తారు అనుకున్నాను. అలాగే ఎదురు చూస్తున్నాను. కానీ ఈ గాయత్రీ అమ్మగారిలా చేస్తే ఎలా. 


విశాల్: నయని కూల్. అలా చేయడం వల్ల గాయత్రీ పాపకు ఏదైనా ఇబ్బందని నా ఫీలింగ్ అంతే. 
నయని: ఇబ్బంది అనే కాదు ఇంకా చాలా ఉంది. 
విశాల్: నయని ఇంకోసారి ఇలాంటివి జరగ కుండా చూసుకుంటా నువ్ టెన్షన్ పడకు ప్లీజ్. 


మరోవైపు సుమన తన బిడ్డకు దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక విక్రాంత్ అక్కడికి వస్తే సుమన సెటైర్లు వేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతాయి. అందరూ తన వైభవం చూసి ఈర్ష్య పడతారని.. తనని మహాలక్ష్మి అంటారని చెప్తుంది. ఇక లక్ష్మిదేవి పూజలో ఈ ఇబ్బంది వచ్చినా బాగోదు అని విక్రాంత్ సుమనకు హెచ్చరిస్తాడు. ఇక హాల్‌లో అంతా ధన త్రయోదశి రోజున లక్ష్మీ పూజకు ఏర్పాట్లు చేస్తారు. నయని, హాసిని దగ్గరుండి అన్ని పనులు కలిసి చేస్తారు. పావనా మూర్తి వారిని గొప్పకోడళ్లు అని పొగుడుతాడు. చిన్న కోడలు సుమన ఒళ్లు తోముకునే పనిలో పడిందని అంటారు. ఇంతలో పూజకు గురువుగారు వస్తారని నయని చెప్తుంది. ఇక సుమన ఓ ఇనప పెట్టె పట్టుకొని అక్కడకు వస్తుంది. 


హాసిని: చిట్టీ చెల్లి నాగులా పురం వెళ్లి చెక్క పెట్టె పట్టుకొని వచ్చిందని నువ్వు ఇనపపెట్టె పట్టుకొని వచ్చావా. 
సుమన: ఇందులో ఏముందో చూపిస్తా కాస్త ఆగండి 
తిలోత్తమ: గురువుగారు లక్ష్మీ దేవి ఇంటిలోకి రావాలని అడుగులు వేస్తే బూడిద వేసుకొని మీరు అడుగు పెట్టారేంటి
సుమన: ఇద్దరి ఆస్తులు బూడిద అవుతాయని వచ్చారేమో
గురువుగారు: సుమన ఎంత ఆస్తి సంపాదించిన మానవులు చివరికి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తారు. అప్పుడు ఎంత ధనం ఉన్నా ప్రయోజనం ఉండదు. 
నయని: ఆస్థితికి స్వామి గారు ఎప్పుడో వచ్చేశారు. మనమే ఆశతో ఇంకో వెయ్యేళ్లు బతుకుతామన్న భ్రమలో ఉంటాం. 
 
ఇక సుమన ఎదో అనబోతే గురువుగారు సుమన తొందర పడి నోరు జారకు లలితా దేవి ఈ ఇంట అడుగు పెడుతుంది చూడు అని అంటారు. అప్పుడు విశాల్ పెద్దమ్మ చేతిలో చీపురు, ఉప్పు ప్యాకెట్ తీసుకొని లోపలికి వస్తుంది. ఇంతలో తిలోత్తమ పెద్దక్కయ్య విలువైనవి ఏవో తీసుకొచ్చావ్ అనుకుంటా అంటుంది వెటకారంగా. దానికి ఆవిడ వల్లభను పిలిచి అవి ఏంటో చెప్పు అంటారు. వల్లభ చెప్తాడు. 


సుమన: మహాలక్ష్మిలా వచ్చిన ఈ పెద్దత్తయ్య గారు పరువు తీస్తున్నారు.
నయని: చెల్లి మతి పోయిందా. అయినా నీకు ఏం చెప్పాను. అమ్మగారు అని పిలవమన్నానా
సుమన:  విశాల్ బావగారి పెద్దమ్మను పెద్దత్తయ్య అని పిలవకూడదా. అమ్మగారు అని పిలవడానికి నేను ఏం పనిమనిషినా
గురువుగారు: సుమన లలితా దేవి ఈ ఇంటి పరువు తీస్తుందని ఎలా అనగలిగావు
సుమన: లేకపోతే ఏంటి స్వామి ధన త్రయోదశి రోజు ఇంటికి ధనం తీసుకొస్తారు కాని చీపురు, ఉప్పు ఏంటి
డమ్మక్క: లలిత మాత తెచ్చింది సాక్ష్యాత్తు లక్ష్మిదేవినే
నయని: డమ్మక్క చెప్పింది సత్యం చీపురును లక్ష్మీ దేవిగా కొలుస్తారు. పేద, ధనిక అందరింట్లో తప్పక ఉండాల్సింది ఉప్పు. ఉప్పు లేని ఇళ్లు ఉండదు. 
లలితా దేవి: ఇవి ఇంట్లో ఉంటే మంచిది. పెద్ద కోడలిగా హాసిని నువ్వు చీపురు తీసుకో. నయని నువ్వు ఉప్పు తీసుకో
 
ఇక గురువు గారు అందరికీ నగలు, డబ్బు లక్ష్మీ దేవికి పెట్టమంటారు. ఇక చిట్టీ ఏం తెచ్చిందో అని ఎద్దులయ్య అంటారు. దానికి సుమన అందరూ షాక్ అవుతారంటుంది. ఇక ఆ ఇనపపెట్టెను ఓపెన్ చేస్తే దాని నింపుగా డబ్బు ఉంటుంది. అందరూ షాక్ అవుతారు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.