Naga Panchami November 13th Episode : సుబ్బు: ఆగు పంచమి.. ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండా వెళ్లిపోతున్నావ్ ఎందుకు. ఏంటి పంచమి ఆలోచిస్తున్నావ్. నీ వాలకం చూస్తుంటేనే తెలిసిపోతుంది. నీ బాధ ఎవరికో చెప్పుకోవాలని తెగ ఆరాటపడుతున్నావని. అదేంటో చెప్పు పంచమి. నీ మనసులో బాధ కొంచెం అయినా తీరుతుంది. 


పంచమి: ఏం లేదులే సుబ్బూ నా బాధ ఆ భగవంతుడు తలచుకుంటే తప్ప తీరేది కాదు. అయినా ఆ స్వామికి నా మొర ఆలకించే తీరిక ఎక్కడుంది. నాలాగ ఎంత మంది భక్తులో లెక్కలేదు కదా


సుబ్బు: అందరి లెక్కలు స్వామి దగ్గర ఉంటాయి. రా పంచమి కూర్చొ. నన్నే సుబ్రమణ్యస్వామిగా భావించి నీ కష్టం ఏంటో చెప్పు. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. 


పంచమి: ఒకసారి నీకో కథ చెప్పా కదా సుబ్బు. పాము, అమ్మాయి అని అది కథ కాదు సుబ్బూ నా జీవితం. ఆశ్చర్యంగా ఉంది కదా సుబ్బూ. జన్మరీత్య నేను పాము అని నా భర్తకు తెలిసిపోయింది. పాముగా నేనే నా భర్తను కాటేసి చంపాలి. భార్యగా నేనే నా మాంగల్యాన్ని కాపాడుకోవాలి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. మోక్ష బాబు నా ప్రాణం సుబ్బు తనని కాపాడుకోవడానికి నేను ఏం చేయడానికి అయినా సిద్ధం. 


సుబ్బు: ఒక భార్యగా నీ కర్తవ్యంలో లోపం లేదు. కానీ పాముకి తన కర్తవ్యం నెరవేర్చుకోవడంలో తప్పులేదు కదా పంచమి. నువ్విప్పుడు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీ భర్తను కాపాడుకోవడానికి ఏఏ దారులు ఉన్నాయో చూసుకుంటున్నావు. అలాగే పాము కూడా తన పగను తీర్చుకోవడానికి తన మార్గాలు వెతుక్కుంటోంది. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి కదా పంచమి. 


పంచమి: ఇప్పుడు నా బాధ అదే సుబ్బు. నేను పాముగా మారి నా భర్తను కాటేసినా కాటేయక పోయినా వేరే నాగులు కాటేస్తాయి. అది నాగ దేవత ఆజ్ఞ. 


సుబ్బు: నీ భర్త చావు ఖాయమని నీకు తెలుసు ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం. పుట్టడం చావడం ఎవరి చేతిలో ఉండవు కదా పంచమి. కానీ నీ భర్త చావు నీ చేతిలో రాసి పెట్టి ఉంది. నువ్వు నీ భర్త మరణాన్ని తెలిసి తట్టుకోలేవు. అవి రెండు నీకు తెలిసిన నిజాలు. అవి కాకుండా ఇంకా ఏమున్నాయో తెలిసేది. నువ్వు పంచమిగానే ఆలోచిస్తున్నావు. పాముగా ఆలోచించడం లేదు. నీది విచిత్రమైన పుట్టుక పంచమి ముందు అది ఆలోచించుకో. నువ్వు పూర్తిగా మనిషివి కాదు. అలా అని పూర్తిగా పామువి కాదు. పంచమి ఆలోచనలు పక్కన పెట్టి పాములా ఆలోచించు. పాము ఎవరు. ఎందుకు కాటేస్తుంది. కాటేసి ఎక్కడికి వెళ్తుంది. ఏం సాధిస్తుంది. ఇలా ఆలోచిస్తే.. నీ భర్తను బతికించుకోవడానికి ఏదో ఒక ఉపాయం తెలుస్తుంది. 


పంచమి: ఒక్కసారి పాము కాటేస్తే తిరిగి ప్రాణాలు దక్కించుకోవడం సాధ్యమా సుబ్బు


సుబ్బు: ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. యమలోకం వెళ్లిన వారిని కూడా తిరిగి తీసుకువచ్చిన ఎన్నో ఘటనలను నేను విన్నాను. నాగ పంచమి. నువ్వు నాగువి పంచమివి. ఈ విశ్వంలో ఏమైనా జరగొచ్చు అనటానికి నీ పుట్టుకే ఓ ఉదాహరణ. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు. ఆ మార్గం వెతుక్కుంటూ వెళ్లడమే కష్టం. దిగులు పడకుండా ఆలోచించు పంచమి. 


మోక్ష: (మనసులో ఆలోచనలు)పంచమి పాము అన్న విషయం నేనే జీర్ణించుకోలేకపోతున్నా. ఇక ఇంట్లో ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. పంచమిని కొట్టి చంపేసినా ఆశ్చర్చం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి. పంచమి ఇక్కడున్నా ఎక్కడున్నా పాములా మారినప్పుడు నన్ను కాటేసి చంపేయడం ఖాయం. అదే పంచమి నా ప్రాణాలు కాపాడటం కోసం తహతహలాడిపోతుంది. పాము మనిషి కలిసి బతకడం అసాధ్యం. జీవించడానికి రోజులే లేనప్పుడు అలా ఆలోచించడం  అర్థం లేదు. అలా అని ప్రాణం ఇచ్చిన భార్యను వదులు కోలేను. ప్రాణం ఇచ్చే భార్య, ప్రాణం తీసే పాము. ప్రేమ, పగ.. రెండు కత్తులు ఒకే చోట ఆసాధ్యం. కానీ సాధ్యం కావాలి ఎలా ఎలా? మరోవైపు సుబ్బు గోడపైన పాము పడగలా చేయి ఊపుతాడు. దీంతో మోక్షకు చెమటలు పట్టేస్తాయి. ఇంతలో నవ్వుకుంటూ సుబ్బు అక్కడికి వచ్చి.. 


సుబ్బు: నీడకే అంతలా బయపడ్డావు. నిజంగానే నీ పక్కన పాము ఉంటే ఇంకెంత భయపడతావో.. పాపం పాములు ఏం చేశాయ్ మోక్ష నీకు వాటిపై అంత కోపం ఎందుకు మనుషుల కన్నా పాములు చెడ్డవి కాదు మోక్ష. వాటి జోలికి వెళ్లి, వాటిని చంపేస్తేనే అవి పగ పడతాయి. మనుషులే నమ్మిన వారిని వెనకేసుకు వచ్చిన వారినే ముంచేస్తారు. అన్నింటికీ కారణం మనం పెంచుకున్న భయమే కారణం మోక్ష. నీకు పాములు మీద భయం కావాలంటే వాటి మీద కోపం వదిలేయ్. మనల్ని ఇష్టపడ్డవారిని ఎప్పటికీ వదులుకోకూడదు.


మోక్ష: మనసులో.. సుబ్బు చిన్న పిల్లవాడైనా తన మాటలు నాకు భగవద్గీతలా అనిపించాయ్. థ్యాంక్యూ సుబ్బూ అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక తమ గదిలో పంచమి పడుకొని ఉంటుంది. మోక్షని చూసి లేస్తుంది. మోక్ష తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. 


మోక్ష: పంచమి ఎప్పటికీ నువ్వు ఇలా నాతోనే ఉండిపోవాలి. నా గుండె ఆగిపోయేంత వరకు నా ప్రయాణం నీతోనే పంచమి. నీ మెడలో నా తాళి విలువ చెప్పమంటే నేను చెప్పలేను కానీ నా మనసు నిండా నువ్వే ఉంటావ్. ఇక నా ప్రాణం గురించి నేను పట్టించుకోను పంచమి. అది పోయే వరకు నువ్వు నా పక్కనుంటే చాలు. పంచమి నేను చూడాలి అనుకుంటుంది నీ కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.