Trinayani Serial Today June 21st Episode: తిలోత్తమ, వల్లభలు గాయత్రీ దేవి ఫొటో కోసం దండ, పిండం ముద్దలు తీసుకొని వస్తారు. అందరూ షాక్ అవుతారు. విశాల్ ఇదేం పని అని తిడతాడు. దుస్సాహం చేస్తున్నారు అని నయని తిడుతుంది. హాసిని కూడా వల్లభని తిడుతుంది. 


విక్రాంత్: అమ్మ మీరు ఏదో ప్రయోగం చేయాలి అనుకుంటున్నారు అని అర్థమైంది. ఇంతకు ముందు సుమన కూడా ఇలాగే చేయబోయి నయని వదిన చేతిలో చచ్చే టైంలో బతికిపోయింది. 
సుమన: నేను అప్పుడు మా అక్క కన్న తొలి బిడ్డ ప్రాణాలతో ఉంది అన్న గ్యారెంటీ ఏంటి అంటే రివాల్వర్ గురి పెట్టింది మా అక్క అలాంటిది ఇప్పుడు అత్తయ్య చేసిన పనికి ఏం చేస్తారో. 
నయని: అమ్మగారు గత జన్మ తాలూకు దేహాన్ని విడిచిపెట్టి 24 సంవత్సరాలు అయింది. రెండు పుష్కరాలు సమస్యలు పూర్తయిన సందర్భంగా దీపాలు వెలిగించి మళ్లీ మా జీవితాల్లో వెలుగులు నింపడానికి మా బిడ్డగా వచ్చారు అని కృతజ్ఞతలు చెప్పడానికే కానీ ఇలా పిండం పెట్టడానికి కాదు.
విశాల్: నేను అదే చెప్పాలి అనుకున్నా అమ్మ.
తిలోత్తమ: నేను వినాలి అనుకోలేదు నాన్న. సారీ ఏం అనుకోకు. ఎందుకు అంటే ఆ జన్మ వేరు ఈ జన్మ వేరు. నేనేమీ సమయం సందర్భం లేకుండా ఈ పని చేయడం లేదు కదా.
హాసిని: పెట్టండి ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి పిచ్చి పని చేస్తే గాయత్రీ అత్తయ్యే వచ్చి వీళ్ల అంతు చూస్తుంది.
తిలోత్తమ: చూడాలి అనే కదా మేం చేసేది. 
సుమన: అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లున్నారు కానివ్వండి.
విశాల్: అమ్మా నా మాట వినండి వద్దు.
తిలోత్తమ: విశాల్ ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. వల్లభ దండ వేయ్. 


వల్లభ దండ వేయగానే గాలి వీస్తుంది. గాయత్రీ పాప పడుకోగానే గాయత్రీ దేవి ఆత్మ బయటకు వస్తుంది. వల్లభకు బొట్టు పని తిలోత్తమ చెప్తుంది. వల్లభ భయపడతాడు. దీంతో తిలోత్తమనే కుంకుమ బొట్టు పెడుతుంది. అందరూ ఎంత వద్దని చెప్పినా వినకుండా తిలోత్తమ గాయత్రీ దేవి ఫొటో దగ్గర పిండం ముద్దులు పెడుతుంది. నయని తిలోత్తమ చేతికి గాయం తగ్గిందా అని అడుతుంది. ఇంకా తగ్గలేదు అని తిలోత్తమ అంటుంది. 


నయని: ఇంతకీ ఆ చేతికి గాయం ఎలా అయిందో చెప్పనే లేదు.
గాయత్రీదేవి: ఆత్మగా అప్పుడే వచ్చి.. చెప్పదు నయని. నయనిని గాయత్రీ దేవి మాట్లాడొద్దని సైగ చేస్తుంది. నేను వచ్చినట్లు తిలోత్తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. నేను రావాలి అనే తను ఇదంతా చేస్తుంది. రూపం మార్చుకున్న తిలోత్తమకు నా నుంచి మరణ గండం అని తెలుసు. పునర్జన్మలో నా రూపం గుర్తుపట్టలేక నా ఆత్మ ప్రత్యక్షమైతే కుడి చేతితో దాడికి పాల్పడాలి అని తన కుట్ర. 
తిలోత్తమ: గంటలమ్మ చెప్పినట్లే దండవేసి పిండం పెట్టాను. గాయత్రీ అక్క ప్రత్యక్షం అవ్వాలి కదా. 
గాయత్రీదేవి: నయని గాయత్రీ దేవికి సైగ చేయడంతో.. అర్థమైంది నయని తిలోత్తమ కుడి చేతికి ఎందుకు అలా గ్లౌజ్ వేసుకుంది అనే కదా. అది చెప్తే అర్థమయ్యేది కాదు చూడాలి. నువ్వు వెళ్లి అద్దం తీసుకొచ్చి దాని మీద ఓం అని రాసి నా ఫొటో ప్రతి బింబం దాని మీద పడేలా చేయు. అందరూ నా ఫొటో ప్రతి బింబం చూస్తారు కానీ తిలోత్తమ మాత్రం నా ఆత్మని చూడగలుగుతుంది. అప్రయత్నంగా తన కుడి చేయి లేచి అద్దంలో కనిపించేది ఆత్మనా లేదంటే ఫొటో ప్రతి బింబమా అని ఆ చేతితో అద్దాన్ని తాకినప్పుడు ఆ చేతిలో ఏముందే చూసే అవకాశం ఉంది. అర్థమైంది కదా నయని వెళ్లి అద్దం తీసుకొనిరా.


నయని గాయత్రీ దేవి చెప్పినట్లు చేస్తుంది. అందరూ అడిగితే గాయత్రీ అమ్మగారి క్షేమం కోసం అద్దం మీద ఓం అని రాశాను అని నయని చెప్తుంది. నయని ఫొటో ఎదురుగా అద్దం పెట్టి అందర్ని చూడమని అంటుంది. గాయత్రీ దేవి తిలోత్తమ వచ్చినప్పుడు అద్దం కొంచెం తిప్పమని అప్పుడు తాను వస్తాను అని తనని తిలోత్తమ చూడాలని గాయత్రీ దేవి అంటుంది. ఇక నయని తిలోత్తమను పిలుస్తుంది. తిలోత్తమ వస్తుంది. అప్పుడు వెనకాలే గాయత్రీ దేవి కూడా వస్తుంది. నయని అద్దంలో గాయత్రీ దేవి ఆత్మ కనిపించేలా చేస్తుంది. అది చూసి తిలోత్తమ షాక్ అయిపోతుంది. గాయత్రీ అక్క అని అరుస్తుంది. వణికిపోతుంది. అక్క వచ్చిందని పెద్ద కేకలు పెడుతుంది. ఇక గాయత్రీ దేవి చెప్పినట్లే తిలోత్తమ తెలీకుండా కుడి చేయి లేస్తుంది. ఇక తిలోత్తమ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక గాయత్రీ దేవి తిలోత్తమ చెవి దగ్గరకు వచ్చి నువ్వు చూస్తున్నది నన్ను కాదు తిలోత్తమ నీ చావుని అని అంటుంది. దానికి తిలోత్తమ లేదు నేను చావను అని  పెద్దగా అరుస్తుంది. అందరూ తెగ భయపడిపోతారు. గాయత్రీ దేవిని నేను చూడాలి అని మొత్తం వెతుకుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని వెతుక్కుంటూ వెళ్లిన మిత్ర, పెద్ద పులికి బలి అయిపోతాడా.. అడవిలోకి అరవింద పరుగులు!