chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మీ దీక్షితులు గారిని వెతుక్కుంటూ చెక్ పోస్ట్ దగ్గరకు వస్తుంది. దీక్షితులు గారి వెంట ఇద్దరు పోలీసులు అడవికి వెళ్తారు. లక్ష్మీని మరో అధికారి అడవిలోకి వెళ్లనివ్వకుండా ఆపుతారు. దీక్షితులు వెళ్లగా అడవిలో పులి గాండ్రింపు వినిపిస్తుంది. దీంతో వేరే దారి గుండా వెళ్తారు. ఇక మిత్ర, అరవింద కూడా దీక్షితులు గారు ఉంటే చోటుకి వస్తారు. లక్ష్మీకి చెప్పిన వ్యక్తి మిత్ర వాళ్లకి కూడా చెక్ పోస్ట్ వరకు నడిచి వెళ్లమని అంటాడు. మిత్ర, అరవిందలు కూడా చెక్ పోస్ట్ దగ్గరకు వస్తారు. ఈలోపు లక్ష్మీ పోలీసు అధికారి వేరే పనిలో ఉండగా అడవిలోకి పారిపోతుంది. పోలీస్ అధికారి ఎంత చెప్పినా వినకుండా పరుగెడుతుంది. లక్ష్మీ వెంటే పోలీస్ అధికారి వెళ్తారు. 


దీక్షితులు గారి దగ్గర ఉన్న పోలీసులకు అధికారి దీక్షితులు గారిని కలవడానికి ఓ అమ్మాయి వచ్చిందని చెప్తారు. దీక్షితులు గారు వెనక్కి వెళ్దామంటే కొంత మంది పోలీసులు వచ్చి వెతుకుతారు అని చెప్పి దీక్షితులు గారిని ముందుకు తీసుకెళ్తారు. ఇంతలో మిత్ర, అరవింద అక్కడికి వస్తారు. 


పోలీస్: ఏంటి మీరు కూడా దీక్షితులు గారి కోసం వచ్చారా. ఏంటయ్యా మీరు ఆయన ఊరిలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా. అడవిలో ఉన్నప్పుడే వెంటపడుతున్నారు. ఇందాక ఓ అమ్మాయి వచ్చింది. దీక్షితులు గారిని కలవాలి అని మనసులో గోడు చెప్పుకోవాలి అని చెప్పినా వినకుండా అడవిలోకి పరుగులు తీసింది. అసలే పులులు తిరిగే ప్రదేశం ఇది చంపేస్తాయ్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నది ఎందుకు ఖాకీలు వేసుకొని కాపలా కాస్తున్నది ఎందుకు.
మిత్ర: ఒక్కోసారి మనుషుల్లోని నిస్సహాయత ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని కూడా పట్టించుకోదు. ఆపదను ఆలోచించలేదు.
పోలీస్: లోపల ఉన్న అమ్మాయికి ఏమైనా అయితే మా ఉద్యోగాలు పోతాయి. 
మిత్ర: మీరు ఏమీ అనుకోక పోతే ఆ అమ్మాయిని కాపాడటానికి నేను వస్తాను.
పోలీస్: ఆ అమ్మాయి ప్రాణానికే గ్యారెంటీ లేదు అంటే ఇప్పుడు మీ లైఫ్ కూడా రిస్క్‌లో పెట్టాలా.
అరవింద: మిత్ర ఏం మాట్లాడుతున్నావ్‌రా. ఎవరి కోసమో నీ ప్రాణాలు అపాయంలో పెడతావా. 
మిత్ర: అర్థం చేసుకో అమ్మ. ఓ అమ్మాయి ప్రాణాలు. పదండి సార్.


దీక్షితులు గారు అడవిలోకి వెళ్లి అమ్మవారికి నైవేధ్యం పెడతారు. మిత్ర, పోలీస్‌ అధికారి అడవిలోకి వెళ్తారు. ఇక పోలీస్ అధికారికి దీక్షితులు దగ్గర ఉన్న వ్యక్తి అమ్మవారి ఆలయానికి వచ్చేశాం అని చెప్తారు. ఇంతలో అరవింద దీక్షితులు గారితో మాట్లాడుతాను అంటుంది. మిత్ర అడవిలోకి వచ్చిన అమ్మాయిని వెతకడానిఇ అడవికి వచ్చాడని చెప్తుంది. దీక్షితులు గారు షాక్ అవుతారు.


దీక్షితులు: ఏం మాట్లాడుతున్నావ్ అరవింద. మిత్రని అడవిలోకి ఎందుకు పంపించావ్. మిత్ర చుట్టూ గండాల వలయం ఉందని చెప్పానా లేదా. ఏ క్షణం ఏ ప్రమాదం వస్తుందో అని హెచ్చరించానా లేదా.
అరవింద: ఎంత చెప్పినా వినలేదు దీక్షితులు గారు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడాలి అని వెళ్లిపోయాడు.
దీక్షితులు: తప్పు చేశావ్ అరవింద. చాలా పెద్ద తప్పు చేశావ్. మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావ్. ఆపద వలయంలో చిక్కుకోవడానికి నువ్వే పంపావ్. మిత్ర ఓ భయంకర గండం వలయంలో చిక్కుకున్నాడు అని మర్చిపోయావ్. 


దీక్షితులు గారి మాటలకు అరవిందకు కళ్లు తిరుగుతాయి. ఇంతలో మిత్ర, పోలీస్ అధికారి వేరు వేరు దారుల్లో వెళ్తారు. అరవింద కూడా మిత్ర కోసం అడవిలోకి పరుగులు తీస్తుంది. మిత్ర, అరవింద, లక్ష్మీ ముగ్గురు అడవిలో తిరుగుతుంటారు. దీక్షితులు గారు హోమం చేస్తుంటారు. ఆ పొగ చూసి లక్ష్మీ అటుగా పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య శోభ కూతురిగా పెరుగుతుందా, అనసూయ ప్లాన్ అదుర్స్.. తండ్రిని చూసేసిన స్వప్న!