Brahmamudi Serial Today Episode: హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కళ్యాణ్, అప్పు లు ఇంటికి వస్తారు. అనామిక వాళ్ల మీద కోప్పడుతుంది. ఇంట్లో వాళ్లను నిలదీస్తుంది. వీళ్లిద్దరిది ప్రేమ అనుకోవాలా? వ్యామోహం అనుకోవాలా? ఇప్పుడు నేనేం చేయాలి. నా కాపురం నిలబెట్టమని ఈ ఇంటి పెద్దరికాన్ని ప్రాధేయపడాలా? నాకు అన్యాయం చేయోద్దని నా భర్త కాళ్లు పట్టుకుని వేడుకోవాలా? నా కాపురంలో చిచ్చు పెట్టొద్దని ఈ అప్పు చేతులు పట్టుకుని వేడుకోవాలా? అంటూ నిలదీస్తుంది.
ధాన్యలక్ష్మీ: ఎందుకురా ఇలాంటి పని చేశావు. ఎన్నాళ్ల నుంచి ఇలా కలుసుకుంటున్నారు. ఇంతకు బరితెగించి ఎందుకు ప్రవర్తిస్తున్నారురా?
అపర్ణ: ధాన్యలక్ష్మీ తొందరపడకు..మన పెంపకాన్ని మనమే నమ్మకపోతే బిడ్డలు ఎలా నలిగిపోతారో నీకు తెలియదు. నాకు తెలుసు? అసలేం జరిగిందో ఆ పిలల్నే అడిగి తెలుసుకుందాం.
ప్రకాష్: అవును ధాన్యం. మన కళ్యాణ్ గురించి మనమే తప్పుగా అనుకోకూడదు. వాడి మనస్తత్వం వేరు ఇలాంటి ఆలోచనలు వాడికి రావు.
స్వప్న: మా అప్పు కూడా అలాంటిది కాదు. ఏదైనా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతుంది. స్నేహం చేస్తే ప్రాణమైన ఇస్తుంది. కాబట్టి ఏం జరిగిందో వాళ్లను అడిగే తెలుసుకుందాం.
అనామిక: నువ్వు మధ్యలో రాకు నువ్వు రాహుల్ ను ఏ విధంగా పెళ్లి చేసుకున్నావో.. మీ అక్క ఎలా పెళ్లి చేసుకుందో మీ అమ్మ అప్పును కళ్యాణ్ కు ఇచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుందో నాకు తెలుసు.
కావ్య: నువ్వు మాట్లాడకు. నీకన్నా పెద్దవాళ్ల ముందు నీ భాషని సంస్కారంగా చేసుకుని మాట్లాడు.
అనగానే అనామిక కోపంగా ఇది నా జీవితం, నా కాపురం నన్ను నా భర్త మోసం చేసినందుకు ఆయన్ని ప్రశ్నించే అధికారం నాకు లేదా అంటుంది అనామిక. వెంటనే నీకు ఆ అధికారం ఉంది. అనగానే అనామిక షాక్ అవుతుంది. కానీ అడ్డమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్తాడు కళ్యాణ్. అప్పు కూడా నేనేంటో నాకు తెలుసు అంటుంది అప్పు. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. కనకం అనామికకు వార్నింగ్ ఇస్తుంది. ఎన్నిసార్లు దాన్ని దోషిగా నిలబెడతారు. ఎన్నిసార్లు దాని శీలాన్ని శంకిస్తారు అంటూ కనకం ప్రశ్నిస్తుంది.
అనామిక: ఏయ్ నోరుంది కదా అని ఇంతెత్తున అరిచి మా నోళ్లు మూయించాలని చూస్తున్నావా? టీవీల్లో ఏం చూపిస్తున్నారో చూడు. నీ కూతురు నా భర్తతో హోటల్ గదిలో దొరికింది. అది తెలుసుకుని వచ్చావా నువ్వు. వాళ్లిద్దరూ ఆ గదిలో రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటో తెలుసుకున్నావా?
కనకం: తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోవాలి. నీ మొగుడు అలాంటి వాడు కాదు. నా కూతురు అలాంటిది కాదు. నమ్మకం నా కూతురు మీదే కాదు నీ భర్త మీద కూడా నమ్మకం. స్నేహం కోసం నా బిడ్డ మీద ఈగ కూడా వాలనివ్వని మనిషి. ఇలాంటి వ్యవహారాలు నడుపుతాడంటే నేను చచ్చినా నమ్మను.
అని కనకం చెప్పగానే రాజ్ కూడా కళ్యాణ్, అప్పులను వెనకేసుకొస్తాడు. అయితే అక్కడకు ఎందుకు వెళ్లారని అడుగుతాడు. అందరూ కూడా ఎందుకు వెళ్లారని అదే అడుగుతారు. వాళ్లు ఎందుకు వెళ్లారో నాకు తెలుసని కావ్య చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కావ్య అసలు మాయ గురించి జరిగింది మొత్తం చెప్తుంది.
అనామిక: శబాష్ మీ కుటుంబానికి నాటకాలు రాయడం మాత్రమే వచ్చు అనుకున్నాను ఇలాంటి దిక్కుమాలిన కథలు అల్లడం కూడా వచ్చన్నమాట. నీ చెల్లెలు మీద పడ్డ మచ్చ తుడిచేయడానికి బాగానే కథలు అల్లుతున్నావు.
కావ్య: అనామిక నీ కళ్లకు బాగానే అనుమానపు పొరలు కమ్మాయి. ఇక నిన్ను ఆ భగవంతుడు కూడా మార్చలేడు.
అనగానే మారని మనిషి గురించి మనకెందుకు వదిన అంటాడు కళ్యాణ్. మీరెన్నైనా చెప్పండి ఇక నుంచి కళ్యాణ్, అప్పు కలవడానికి నేను ఒప్పుకోను అంటుంది అనామిక. నువ్వేంటే చెప్పేది నేనే కలవనివ్వను అంటూ కనకం అప్పును తీసుకుని వెళ్లిపోతుంది. అనామిక కోపంగా నీకు ఎవరి బుద్దులు వచ్చాయోనని కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రభాస్ వల్లే నేను ఇలా అయ్యాను - బేబీ బంప్ చూపిస్తూ దీపికా ఆసక్తికర కామెంట్స్