Karthika Deepam 2 Serial Today June 20th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య శోభ కూతురిగా పెరుగుతుందా, అనసూయ ప్లాన్ అదుర్స్.. తండ్రిని చూసేసిన స్వప్న! 

Karthika Deepam 2 Serial Today Episode శోభకి ఇక పిల్లలు పుట్టకపోవడంతో దీప, నర్శింహల కూతురిని తెచ్చుకొని తమ కూతురుగా పెంచుకోవాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప దగ్గరకు కార్తీక్ వచ్చి నర్శింహ ఏమైనా అన్నాడా అని అడుగుతాడు. నర్శింహ పోలీస్‌తో మాట్లాడటం చూశాను అని నువ్వేమైనా కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతాడు. దానికి దీప కంప్లైంట్ ఇస్తే మీకేంటి.. నర్శింహ ఇక్కడికి వస్తే మీకేంటి అని అడుగుతుంది. 

Continues below advertisement

దీప: నేను మీకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను రండి అన్నానా. లేదా శౌర్య కాల్ చేసి మా అమ్మ కష్టాల్లో ఉంది వచ్చి కాపాడండి అని అడిగిందా. ఎందుకు వచ్చారు బాబు. ఎవరు చెప్పారని వచ్చారు. 
కార్తీక్: అయిపోయిందా. మీ ఆవేశం చల్లారిపోయిందా. అరే ఒక మనిషి వచ్చి ఏదో అడుగుతున్నాడు అంటే అది ఏంటో అర్థం చేసుకొని సమాధానం ఇవ్వాలి కదా. కస్లమర్లతో కూడా ఇలాగే మాట్లాడుతున్నారా. ఇలా మాట్లాడితే ఒకసారి వచ్చిన వాడు ఈ చుట్టు పక్కలకు కూడా రాడు. అయినా నాలోంటి వాడి గుండె రాయి చేసుకొని చెవిలో దూది పెట్టుకొని తిడితే తిట్టండని వస్తాడు. 
దీప: అతను రోడ్డు మీద కానిస్టేబుల్‌తో మాట్లాడితే మీరు ఎందుకు బాబు నా దగ్గరకు రావడం. 
కార్తీక్: వాడు మిమల్ని అంత ఈజీగా వదలడు. మళ్లీ మీమల్ని ఏమైనా అంటే రోడ్లమీద పడి ఏడుస్తారు. అందుకే నేను వచ్చాను.
దీప: ఎవరు ఎలా ఉన్నా నేను ఏమైపోయినా మీరు మాత్రం పట్టించుకోవద్దు బాబు.
కార్తీక్: కుదరదు దీప. నేను ఇప్పటి నుంచి రౌడీ శ్రేయాభిలాషిని కూడా. మీ గురించి మీరు చూసుకోండి కానీ వాడు రౌడీ జోలికి వస్తే నేను వదలను.
దీప: వద్దు బాబు మీరు మా జోలికి రావొద్దు. మా తండ్రి చావుకి కారణం మీరే మిమల్ని నేను జన్మలో క్షమించలేను. నా మంచితనంలో నర్శింహ ఆడుకుంటుంటే నా బలహీనతలో మీరు ఆడుకుంటున్నారు. నాకు మీ సాయం వద్దు. నా కూతురికి మీ స్నేహం వద్దు. ఇప్పటి వరకు మీరు చేసిన సాయాలకు శతకోటి వందనాలు. నిజంగా నర్శింహ వచ్చి నన్ను ఏమైనా చేసినా కూడా మీరు కలుగజేసుకోకండి. ఇది నా జీవితం.
కార్తీక్: నీ జీవితం దారిలో పడేంట వరకు నేను సాయంగానే ఉంటాను దీప. ఏదో ఒక రోజు నాకు నిజం చెప్పే అవకాశం వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత పశ్చాత్తప పడతావో నాకు తెలుసు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. 

జ్యోత్స్న పారిజాతంతో దీపకు అడిగిన ప్రశ్నల గురించి చెప్తుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. జ్యోత్స్న పారిజాతంతో మనకు తెలియనిది కార్తీక్, దీపల మధ్య ఏదో ఉంది అని ఆ స్ట్రాంగ్ ఎమోషనే వాళ్లని కనెక్ట్ చేస్తుందని అనిపిస్తుందని జ్యోత్స్న అంటుంది. దీంతో పారిజాతం నువ్వు ఇచ్చిన వార్నింగ్‌కి దీప కార్తీక్‌ని కలవదు అని కలనివ్వదని అంటుంది. దాంతో జ్యోత్స్న వాళ్లు కొత్త మీటింగ్ పాయింట్ వెతుక్కుంటే అని అడుగుతుంది. దానికి పారిజాతం తన దగ్గర కొత్త ఐడియా ఉందని అంటుంది.

మరోవైపు శౌర్య కర్ర తీసుకొని వచ్చి తప్పులు చేశానని కొట్టమని అంటుంది. ఒక తప్పు చేశాను అని శౌర్య అంటుంది. ఏంటదని దీప అడిగితే రెండు రోజుల్లో ఫాదర్శ్‌డే ఫంక్షన్ ఉందని దానికి తన ఫ్రెండ్స్ నీకు తండ్రి లేడా అంటున్నారు అని వాళ్లకి తండ్రి ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పడం ఇష్టం లేక టీచర్ దగ్గర ఫోన్ తీసుకొని కార్తీక్‌కి కాల్ చేశాను అని చెప్తుంది. దీంతో దీప షాక్ అయిపోతుంది. అతనికి ఎందుకు కాల్ చేశావ్ అని దీప అడిగితే ఫాదర్శ్‌డే రోజు ఏం చేయాలని అడుగుతుంది. దాంతో కార్తీక్ స్కూల్‌కి వచ్చాడని చెప్తుంది.  ఇక కార్తీక్ శౌర్యకి ఎమోషనల్‌గా చెప్తాడు. శౌర్య ఆ మాటలు దీపతో చెప్తే దీప ఏడుస్తుంది. త్వరలో నాన్న వస్తాడు అని అమ్మ నీకు సర్‌ఫ్రైజ్ ఇస్తుందని దీప శౌర్యతో చెప్తుంది. శౌర్య చాలా సంతోషపడుతుంది. 

మరోవైపు శోభ ఏడుస్తుంటుంది. అనసూయ కోపంతో నువ్వెందుకే ఏడుస్తున్నావో ఏడ్వాల్సింది నేను నా కొడుకు అంటుంది. అది విన్నా నర్శింహ ఆపుతావా ఇలాగే మాటలతో చంపేస్తావా అని అడుగుతాడు. శోభకి పిల్లలు పుట్టకపోయినా పర్లేదు అని తనకు శోభ ఉంటే చాలు అని అంటాడు. దానికి అనసూయ పిల్లలు పుట్టనిది శోభకి నీకు కాదు అని అంటాడు. దానికి శోభ నర్శింహకు మరో పెళ్లి చేయాలని లేదంటే ఉన్న దాని దగ్గరకు పోమన్ని మీ అమ్మ అంటుందని చెప్తుంది. దానికి అనసూయ ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని నువ్వు కనకుండానే నీకు పిల్లులు వస్తారు అని అంటుంది. దీప దగ్గర ఉంది నీ కూతురని దాన్ని తెచ్చుకోమని అనసూయ అంటుంది. దానికి శోభ దీప ఆ పిల్ల జోలికి వెళ్తే ఒప్పుకోదని అంటుంది. దానికి అనసూయ నీ మొగుడి కూతురిని నీ కూతురిగా పెంచగలవా లేదా అని అడుగుతుంది దానికి శోభ పెంచగలను అని చెప్తుంది. మరోవైపు శ్రీధర్ ఓ చోట కొబ్బరి బొండాం తాగుతుంటే స్వప్న చూసి ఆగి డాడీ డాడీ అని అటుగా వస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.     

Also Read: రష్మీ డబుల్ మీనింగ్ జోక్స్... రోహిణీ కూడా తక్కువేం తినలేదు, హేమ రేవ్ పార్టీనీ వదల్లేదు!

Continues below advertisement
Sponsored Links by Taboola