Trinayani Today Episode ఉలూచి పాప పాదాల గురించి తిలోత్తమతో గొడవ పడితే ఆవిడ ఇస్తానన్న ఆస్తి ఇవ్వదని సుమన అంటుంది. దాంతో విక్రాంత్ తన తల్లి ఆ నిమిషానికి అలా మాట్లాడుతుందని జాగ్రత్తని చెప్తాడు. సుమన మాటలకు చిరాకు పడిన విక్రాంత్ పాప పాదాలకు రాయమని మందు ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు నయని, విశాల్ బాల్కానీలో మాట్లాడుకుంటారు.  


విశాల్: అమ్మ వల్ల పాప పాదాలు ఇలా అయ్యాయి అని తెలిశాక అమ్మ మీద ఉలూచి మీద జాలి కలుగుతుంది నయని. 
నయని: స్వార్థంతోనే ఇలా చేసింది బాబుగారు. అదేంటి అక్క మెడలో హారం లేకుండా వచ్చావ్. ఎందుకు తీశావ్ అక్క నీకు బాగా నప్పింది కదా.
హాసిని: అది మెడలో వేసుకొని తిరుగుతూ రూమ్‌లోకి వెళ్లి ఎలా ఉంది అని అద్దంలో చూసుకుంటే తల నొప్పిగా అనిపించింది. ఆ బాధని భరించ లేక పెన్ను పేపర్ తీసుకొని రాసేయాలి అనిపించింది. 
నయని: ఏం రాయాలి అనిపించింది.
హాసిని: ఏదైనా.. నా మనసులో ఉన్నది రాసేయాలి అనిపించింది. 
విశాల్: సీక్రెట్ర్స్ పేపర్ మీద రాస్తే అవి అందరికీ తెలిసిపోతాయి కదా వదిన.
నయని: నీలో కూడా రహస్యాలు ఉన్నాయా అక్క. అయితే నా దగ్గర కూడా నువ్వు చెప్పని రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి అన్నమాట.
హాసిని: ఇప్పుడు బాగానే ఉంది కానీ మళ్లీ ఆ హారం వేసుకుంటే ఏమవుతుందో చూడాలి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో నీ పెంపుడు తల్లి.
నయని: అత్తయ్య ఇచ్చిన హారం వల్లే నీకు తలనొప్పిగా అనిపించడం నీ మనసులో మాటలు రాయాలి అనిపించడం ఇలాంటి భావనలు కలుగుతున్నాయి కదా అక్క. 
హాసిని: అనుమానమే లేదు చెల్లి రేపు ఆ హారం ఆవిడ మెడలో వేసి సీక్రెట్స్ అన్నీ రాయించాలి అనుకుంటున్నాను. 
విశాల్: వదినా అంత ఈజీగా ఒప్పుకోదు.
నయని: అక్క ఆ హారాన్ని నువ్వు రేపు పొద్దున్న మళ్లీ వేసుకోవాలి. తల నొప్పిగా అనిపించినా కాసేపు భరించు.
హాసిని: సరే.. నీ కోసం చేస్తా. ఇంతకీ చిట్టీ ఎలా ఉందో. 
నయని: రేపు చూడాలి అసలు కథ.


ఉదయం పావనామూర్తి పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటాడు. పెద్దబొట్టమ్మ దాక్కోవడం చూసి ఏంటి ఇలా వచ్చావ్ అని అడుగుతాడు. ఉలూచి పాదాలు మామూలుగా అయ్యే మార్గం చూడాలి కదా అంటుంది. దానికి పావనా నేను చూశాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఉలూచిని ఎత్తుకెళ్లిపోయేదానివి కదా అని అంటాడు. దాంతో పెద్దబొట్టమ్మ అలా ఏం చేయను అని పాప పాదాలకు ఏం అయిందో చూడటానికే వచ్చాను అని ఇంకోసారి పరీక్షించి చూస్తాను అని అంటుంది. 


పావనా: మా ఆవిడ హాసినమ్మ వస్తున్నారు వాళ్లు వెళ్లిపోయాక చెప్తానులే. 
విశాల్: మమ్మీ నువ్వంటే లెక్క లేదు చూశావా నువ్వు ఇచ్చిన హారం అప్పుడే తీసేసింది. 
హాసిని: నిన్న సాయంత్రమే తీసేశాను రాజా.
తిలోత్తమ: ఎందుకు హాసిని గిఫ్ట్‌గా ఇచ్చింది నచ్చలేదా.
నయని: బాగుంది కానీ ఇబ్బందిగా అనిపించింది అంట అత్తయ్య.
సుమన: మా అందరి ముందు వేసుకొని తిరగడం ఇబ్బందిగా ఉందేమో.
విక్రాంత్: అది కాదు ఆ హారం వేసుకుంటే వదినకు తల తిరుగుతుంది అంట. 
విశాల్: ఏం లేదు అమ్మ హారం వేసుకుంటే బాగానే ఉంది కానీ అద్దంలో చూసుకుంటే తల నొప్పి వచ్చి మనసులోని మాటలు పెన్ను పేపర్‌ మీద రాసేస్తుందంట.
పెద్దబొట్టమ్మ: విశాల్ బాబు అసలు విషయం మర్చిపోయాడు అనుకుంటా. హారం వేసుకొని అద్దం చూస్తే ఇన్నాళ్లు గాయత్రీ పాపే గాయత్రీదేవి అని దాచిపెట్టిన రహస్యాన్ని హాసినమ్మ రాసేస్తుంది. ఆ నిజం తిలోత్తమమ్మకు కూడా తెలిసిపోతుంది.
వల్లభ: మమ్మీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ తీసుకోవడమే కాక నిన్ను అవమానించాలి అని ఇలా చేస్తున్నారు. 


నయని హాసినికి హారం వేస్తుంది. ఇక హాసినికి విశాల్ అద్దం చూపిస్తాడు. పావనామూర్తి హాసినితో జన్మ రహస్యం రాయొద్దని అంటే అప్పుడు విశాల్‌కి తన కన్న తల్లి జాడ తెలుసుకోవడానికి పెంచిన తల్లి ఇలాంటి పని చేసుంటుందని అనుకొని చాలా కంగారు పడతాడు. హాసిని పెన్ను పేపర్ అడుగుతుంది. ఇవ్వగానే పేపర్ మీద రాస్తుంది. 


" ప్రియాతి ప్రియమైన చెల్లి నయనికి మీ అక్క హాసిని ఇన్నాళ్లు నీతో చెప్పకుండా దాచిన రహస్యం ఇక్కడ రాసేస్తున్నాను. మీరు దత్తత తీసుకున్న గాయత్రీ పాప ఎవరో కాదు. నువ్వు కన్న తొలి బిడ్డ. మన గాయత్రీ అత్తయ్య తను. ఇనాళ్లు నీతో ఈ విషయం చెప్పకుండా దాచినందుకు నీ తోటికోడలిని క్షమిస్తావని కోరుతున్నాను." అని హాసిని పేపర్ మీద రాస్తుంది. ఇక హాసిని మనసులో మాట రాశాను అని చదవండి అని పడిపోబోతుంది. ఇక నయని హాసిని మెడలో హారం తీస్తుంది.  


పెద్దబొట్టమ్మ: అయ్యయ్యో విషయం నయని, తిలోత్తమలకు తెలీకూడదు అనుకుంటే పేపర్‌ని హాసినమ్మ నయని చేతిలోనే పెట్టిందే. 
విశాల్: పేపర్‌లో హాసిని రాసింది చదివి.. చంపేశావ్ కదా వదినా అనుకున్నట్లే మా అమ్మ గురించే రాశావ్. 


ఇక తిలోత్తమ ఆ పేపర్‌ని లాక్కుంటుంది. ఇక చదివే టైంలో పెద్దబొట్టమ్మ పాముగా మారి తిలోత్తమను కాటేస్తుంది. పేపర్ కింద పడిపోతుంది. తిలోత్తమ పాము కాటుతో విలవిల్లాడిపోతుంది. అందరూ కంగారు పడతారు. తర్వాత గట్టిగా నవ్వుతుంది. ఇక గాయత్రీ పాప పేపర్ తీసుకొని తిలోత్తమ అందరితో సర్పదీవికి వెళ్లి తిరిగి వచ్చిన నాకు ఏ పాము కాటేసిన ఏం కాదు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇక వల్లభ హాసిని రాసింది ఏంటో నువ్వు చదవకూడదు అని అలా కాటేసింది అని అంటాడు. దానికి సుమన పెద్దబొట్టమ్మ అయితే తనని చంపేయండి అని అంటుంది.  నయని అది నాగయ్య అని అంటుంది. ఇక గాయత్రీ పాప పేపర్ చింపేస్తుంది. దీంతో తిలోత్తమ విశాల్‌తో రాసిందని అడుగుతుంది. దీంతో విశాల్ పెళ్లి పట్టుచీర కొట్టేసినట్లు రాసిందని చెప్తాడు. దాంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మితో కలిసి పూజ చేసిన మిత్ర.. జున్ను తల్లే తన అక్క అని తెలుసుకున్న జాను!