Brahmamudi Serial Raj: తండ్రి కాబోతున్న 'బ్రహ్మముడి' హీరో రాజ్‌ - త్వరలో బేబీ నాగులపల్లి రాబోతుందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పిన మానస్‌ 

Brahmamudi Serial Fame Manas Nagulapalli:'బ్రహ్మముడి' సీరియల్‌ రాజ్‌ అకా మానస్‌ నాగులపల్లి గుడ్‌న్యూస్‌ చెప్పాడు. త్వరలో తండ్రి కాబోతున్నానంటూ తన భార్య శ్రీజ బేబి బంప్‌ ఫోటోలు షేర్‌ చేశాడు.

Continues below advertisement

Brahmamudi Serial Fame Manas Nagulapalli Shared Good News: 'బ్రహ్మముడి' సీరియల్‌ (Brahmamudi Serial Raj) రాజ్‌, బుల్లితెర హీరో, బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ నాగులపల్లి  గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన మానస్‌ అప్పుడే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మానసే ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. తన భార్య శ్రీజ బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ శుభవార్త పంచుకున్నాడు.

Continues below advertisement

"అరెంజ్డ్‌ లవ్‌. మాది పెద్దలు కుదిర్చిన వివాహమైన మా మనసులు కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతుంది. మా జీవితాల్లో త్వరలో బేబీ నాగులపల్లి రాబోతోంది" అంటూ మానస్‌ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. ప్రస్తుతం మానస్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. దీంతో ఈ బుల్లితెర హీరోకు సహానటీనటులు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు తన భార్య శ్రీజకు సీమంతం జరిగినట్టు కూడా వెల్లడించాడు. వారం కిందటే తన శ్రీజకు ఘనంగా సీమంతం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

ఇదిలా ఉంటే గతేడాది నవంబర్‌లో శ్రీజ, మానస్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. చెన్నై చెందిన శ్రీజను మానస్‌ పెళ్లి చేసుకున్నాడు. నెల తిరిగేలోపు కొత్త కారు కూడా కొన్నాడు. ఇప్పుడు ఏడాది కూడా తిరక్కుండానే శ్రీజ గర్భవతి కావడం, ఆమెకు సీమంతం కూడా జరగడం విశేషం.  కోయిలమ్మ అనే సీరియల్‌తో మానస్‌ బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అలరించాడు. హౌజ్‌లో ప్రియాంకతో లవ్‌ ట్రాక్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే మానస్‌ హీరోగానూ పలు చిత్రాల్లో నటించాడు. 'కాయ్‌ రాజా కాయ్‌', 'ప్రేమికుడు' వంటి సినిమాల్లో హీరోగ నటించి మంచి గుర్తింపు పొందాడు.

అయితే ఇవి బాక్సాఫీసు వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో మళ్లీ బుల్లితెర హీరోగా అలరిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ సీరియల్‌ టీఆర్‌పీలో టాప్‌ రేటింగ్‌తో కొనసాగుతుంది. ఇందులో దుగ్గిరాల స్వరాజ్‌ ఆలియాస్‌ రాజ్‌గా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు. ముఖ్యంగా తన భార్య పాత్ర అకా దీపికా రంగరాజన్‌తో ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అలా టాప్‌ వన్‌ సీరియల్లో హీరోగా నటిస్తున్న రాజ్‌ తాజాగా తండ్రి కాబోతున్న గుడ్‌న్యూస్‌ అభిమానులో షేర్‌ చేసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. 

Also Read: పెళ్లిపై హింట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ! - త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా? వధువు ఆమెనా..

Continues below advertisement