Trinayani Serial Today Episode నయని అద్దంలో చూస్తే త్రినేత్రి ముఖం కనిపిస్తుంది. అఖండ స్వామిని కలిశామని తిలోత్తమ, వల్లభలు కలిసి ఇంట్లో విషయం చెప్తే అఖండ స్వామి మ్యాజిక్ అద్దం ఇచ్చారని ఇందులో ఎవరి ముఖం వేరేగా కనిపిస్తే వాళ్లలోకి ఆత్మ చేరినట్లని చెప్పారని వల్లభ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. కోమాలో ఉన్న నయని ఎక్కడుందో తెలుసుకోవాలని అఖండ చెప్తారు. నయని చనిపోయి తన ఆత్మ త్రినేత్రి శరీరంలో కలిసిపోయిందేమో అని అది తెలుసుకోవడానికి ఈ అద్దం ప్రయోగం చేయిస్తారు అఖండ స్వామి. విషయం మొత్తం వల్లభ, తిలోత్తమలు చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు.
హాసిని: చెల్లి లోకి ఆత్మ ప్రవేశించడం ఏంటి.
సుమన: ఎవరిది.
తిలోత్తమ: నయనిది. నమ్మాల్సిందే. దేవీపురం వెళ్లినప్పుడు నయని కట్టుకున్న చీరనే అద్దంలో కనిపించింది. దాని అర్ధం నడిపి కోడలు నయని చచ్చిపోయిందని.
నయని: అత్తయ్య నా కూతురు ముందు ఇలా మాట్లాడితే మీ మర్యాద పోగొట్టుకుంటారు జాగ్రత్త.
తిలోత్తమ, వల్లభ, సుమన మాట్లాడుతూ ఉంటారు. నయని చనిపోయిందని వాళ్లు మాట్లాడుకుంటుంటే హాసిని వచ్చి నయని చెల్లి చనిపోయి స్వర్గానికి వెళ్లింది అక్కడే తిలోత్తమ, వల్లభల్ని చూసిందని చెప్తుంది. దాంతో తిలోత్తమ తాము కూడా చనిపోయామని సెటైర్లు వేస్తుందని తిలోత్తమ అంటుంది. ఆత్మలు కేవలం కొంత మందికే కనిపిస్తాయి కదా మరి మన ఇంట్లో అందరికీ నయని చెల్లి ఆత్మ ఎలా కనిపిస్తుందని హాసిని అంటుంది. ఇదంతా తిలోత్తమ వాళ్ల నాటకం అని వాళ్లకి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు నయని, దురంధర, విక్రాంత్ మాట్లాడుకుంటారు. తిలోత్తమ వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని అనుకుంటారు.
దురంధర: నువ్వు ప్రమాదానికి గురైనప్పుడు ఆ చీరలోనే ఉన్నావ్ కదా నయని అందుకే నీ ఆత్మ ఆ చీరలోనే కనిపించింది.
విక్రాంత్: కొంత మంది నమ్మడం కొంతమంది నమ్మకపోవడం వల్ల ఇది వెంటనే సమస్య కాలేదు కానీ మనం దీన్ని వెంటనే పరిష్కరించాలి.
దురంధర: మనం కష్టపడి నయని శరీరాన్ని తీసుకొచ్చాం కానీ కొత్త కష్టాలు పడాల్సి వస్తుంది.
నయని: వాళ్లకి ఇంకా నా దేహం ఇంట్లో ఉంది అన్న అనుమానం రాలేదు. నేను నయని కాదని త్రినేత్రి అని వాళ్లు రుజువు చేసిన పనిలో ఉన్నారు.
విక్రాంత్: వాళ్లు అలా డైవర్ట్ అవ్వడం బాగానే ఉంది వదిన కానీ ఇప్పుడు అద్దంలో ఆత్మ కనిపించిందని వేరేలా ఆలోచిస్తే మనకు ప్రాబ్లమ్ అవుతుంది.
దురంధర: నువ్వు కోమాలోనుంచి బయటకు వస్తే కానీ ప్రాబ్లమ్ పరిష్కారం అయ్యేలా లేదు.
విక్రాంత్: అసలు అమ్మా వాళ్ల ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ సారి తెలివిగా పావులు కదుపుతారు.
నయని: నాకు ఎందుకో కుడి కన్ను అదురు తుంది.
దురంధర: అయ్య బాబోయ్.
నయని: మన బలం గాయత్రీ అమ్మగారే తనే మనకు అడ్డుగా నిలబడాలి.
ఉదయం బామ్మ, దురంధర హాల్‌లో కూర్చొని ఉంటారు. సుమన, విక్రాంత్ వస్తారు. బామ్మ వాళ్లతో చిన్న పిల్లల్లా ఈ వేషాలు ఏంటి అని అంటుంది. ఎవరి గురించి అంటున్నారు అని విక్రాంత్ అంటే ఆవిడ పేరు పెట్టడం కూడా ఇష్టం లేదని బామ్మ అంటుంది. నయని కూడా అక్కడికి వస్తుంది. ఇక బామ్మ తిలోత్తమని తిడుతున్నాను అని కళ్లెదుట నయని కనిపిస్తున్నా చనిపోయిందని అనడంతో తిడుతున్నాను అని అంటుంది. విషయం తెలిసి ఏడుపు వచ్చిందని అంటుంది బామ్మ. ఇంతలో తిలోత్తమ వచ్చి పూర్తి విషయం తెలిస్తే అప్పుడు మీరు ఇలా అనరు అంటుంది. అఖండ స్వామి చెప్తే నమ్ముతారా అని అఖండ స్వామిని పిలుస్తారు. స్వామి ఇంట్లోకి వస్తారు. త్రినేత్రి గురించి ఎందుకు అని నయని అంటే దానికి అఖండ స్వామి ఆ త్రినేత్రి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు. త్రినేత్రి బయటకు వెళ్లిపోయిందని సుమన చెప్తే త్రినేత్రి వెళ్లలేదని వెళ్లింది నయని అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.