Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode రాత్రి సుమిత్ర అందరికీ భోజనం వడ్డిస్తుంది. పారిజాతం సుమిత్రకు ఈ వంటలన్నీ మన వంటలేనా వేరే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చావని అని అంటుంది. దీప గురించి పారిజాతం మాట్లాడుతుంటే శివన్నారాయణ కోప్పడతాడు. తినేటప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు అని అంటాడు. 


జ్యోత్స్న కంపెనీలో తాను తీసుకున్న నిర్ణయం చెప్పబోతే తాత వద్దని అంటాడు. నీ మీద నమ్మకం ఉందని మంచి నిర్ణయాలే తీసుకుంటావని అంటాడు. దశరథ్ జ్యోత్స్నతో నాన్న నీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారని జాగ్రత్తగా స్టెప్ వేయ్ అని అంటాడు. మరోవైపు కార్తీక్, దీపలు జ్యోత్స్న కంపెనీలో చేసిన పని గురించి మాట్లాడుకుంటారు. 50 ఏళ్లు దాటిన వారిని తీయడం తప్పని అలా అయితే ముందు మా తాతనే తీయాలి అని రేపే అడుగుతానని కార్తీక్ అంటాడు. 


కార్తీక్: ఎవరికి ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు. వాళ్ల సంతకాలు వాళ్లు పెడతామన్నారు ఇలా ఉంటాయి వాళ్ల నిర్ణయాలు.
దీప: నాకు తెలిసి ఇది జ్యోత్స్న నిర్ణయం తాతగారికి తెలీదు అనుకుంటా. మీరు ఒకసారి తాతగారితో మాట్లాడండి. మీరు మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది.
కార్తీక్: వాళ్లకి తెలిసే అంతా జరిగుంటుంది. ఆయనతో మాట్లాడితే నన్నే అవమానిస్తారు
దీప: వాళ్లతో మాట్లాడకుండా గొడవ చేయొద్దు మీ అమ్మగారి గురించి ఆలోచించండి మీ అమ్మగారు మీతో చెప్పుకోలేక నాతో చెప్పారు. సాధారణ మనిషిగా ఆ ఉద్యోగుల తరుఫున మీ తాతయ్యతో మాట్లాడండి అర్థం చేసుకుంటారు. వాళ్లు సరిచేసుకోకపోతే అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం వెనక నేను ఉంటా.
కార్తీక్: ఈ దారిలో న్యాయం జరగదు దీప.


రాత్రి జ్యోత్స్న బయట కూర్చొని వర్క్ చేసుకుంటుంటే పారిజాతం వచ్చి మంచిగా ఫోన్ చూసుకునే అమ్మాయికి ఇలా చేసేశారేంటి అని అంటుంది. నిన్ను చూస్తే కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లిపోయేలా ఉన్నావని అంటుంది. కంపెనీకి సీఈఓ అయినప్పటి నుంచి తనని పట్టించుకోవడం లేదని అంటుంది. ఏంటి నీ నస పని చేసుకోనివ్వవా అని అంటుంది. 50 ఏళ్లు దాటిన వాళ్లని జాబ్ నుంచి తీసేశాను అని జ్యోత్స్న చెప్తే పారిజాతం ఉలిక్కి పడుతుంది. జోక్ చేయడం లేదు కదా అంటుంది. ఎవరిని అడిగి అలా చేశావని తిడుతుంది. కొట్టడానికి జ్యోత్స్నని చేయి ఎత్తి మొత్తం పోయిందని నెత్తి బాదుకుంటుంది. ఈ విషయం మీ తాతకి తెలిస్తే అయిపోతుందని అంటుంది. తాతకి విషయం తెలిసేలోపు వాళ్లని తీసుకో అని చెప్తుంది. ఇప్పుడే జాగ్రత్త పడు అని అంటే జ్యోత్స్న ఒప్పుకోదు ఏం జరిగినా ఫేస్ చేస్తా అంటుంది. 


ఉదయం అందరూ కాఫీ తాగుతారు. పారు జ్యోత్స్నతో ఇంత తాపీగా ఎలా ఉన్నావ్ అంటుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి వచ్చి శివన్నారాయణ గారు అని బయట నుంచి అరుస్తాడు. అందరూ బయటకు వెళ్తారు. నా ఇంటికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని తిడతాడు. విషయం ఏంటి అని అంటే కార్తీక్ తాను మనవడిగా రాలేదు అంటాడు. సుమిత్ర వాళ్లు లోపలికి రమ్మని చెప్తాడు. తాత పిలిస్తే వస్తా అంటాడు.


కార్తీక్: నేను ఛైర్మన్‌ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీరు కంపెనీ గురించి తీసుకున్న నిర్ణయం గురించి కంపెనీ గురించి జరుగుతున్న అరాచకాలు గురించి.
శివన్నారాయణ: నీలాంటి వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీ గురించి నిర్ణయాలు తీసుకోవడానికి సీఈఓ ఉంది తనని అడుగు.
కార్తీక్: తన వల్ల అన్యాయం జరిగితే ఎవరికి చెప్పాలి. 
శివన్నారాయణ: రేయ్ కార్తీక్ జ్యోత్స్న నా మనవరాలు నా కంపెనీ సీఈవో తన నిర్ణయం తీసుకుంది.
కార్తీక్: అదేంటో మీకు తెలుసా.
శివన్నారాయణ:  చెప్పాను తాతయ్య అంది నేను వినను అన్నా అది నాకు తన మీద ఉన్న నమ్మకం. అది ఏదైనా నేను సమర్దిస్తా. నా మనవరాలి మాటే నా మాట.
కార్తీక్: ఇదే మీ ఆఖరి మాటా అయితే ఆల్ ది బెస్ట్. మీరు చేయాల్సింది మీరు చేశారు కదా నేను చేయాల్సింది నేను చేస్తా.  శాంతి కోసం నేను వచ్చాను యుద్ధం మీరు కోరుకున్నారు. యుద్దం కోసం సిద్ధంగా ఉండండి.
జ్యోత్స్న: బావ ఏం చేయబోతున్నాడు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఇంట్లో దీప వంటలు.. కాళ్లు మొక్కతా అన్న పారు.. రెస్టారెంట్ పెట్టిస్తానన్న జ్యోత్స్న.. నిజమేనా?