Telugu TV Serials TRP Ratings This Week - Check Top 10 List: స్టార్ మా, జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ ఈ వారం రేటింగ్స్ వచ్చేశాయ్. ప్రతీ వారం రెండో స్థానం కోసం హోరాహోరీ పోటీ నెలకొంటుండగా.. ఈ వారం కూడా మార్పులు జరిగాయి. మార్చి మూడో వారంలో స్టార్ మా సీరియల్స్ సత్తా చాటగా.. జీ తెలుగు సీరియల్స్ సైతం గట్టి పోటీ ఇచ్చాయి.
మరోసారి ఆ సీరియల్ హవా
'స్టార్ మా' సీరియల్స్ విషయానికొస్తే వరుసగా ఈ వారం కూడా కార్తీక దీపం 2 (Karthika Deepam 2) సీరియల్ ఫస్ట్ ప్లేస్ కొనసాగిస్తోంది. ఈ ఏడాది వరుసగా 9వ వారం కూడా ఆ సీరియల్ హవా కొనసాగించింది. ఈ సీరియల్‌కు రూరల్, అర్బన్ కలిపి 13.29 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో 'గుండె నిండా గుడి గంటలు' నిలవగా.. తాజా రేటింగ్స్‌లో 12.21 రేటింగ్ నమోదైంది. 12.19 రేటింగ్‌తో బుల్లితెర స్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' మూడో స్థానంలో నిలిచింది.
ఇక 11.84 రేటింగ్‌తో నాలుగో స్థానంలో 'ఇంటింటి రామాయణం' సీరియల్ నిలిచింది. ఐదో స్థానంలో 'చిన్ని' సీరియల్ 9.31 రేటింగ్‌తో ఉంది. ఆరో స్థానంలో 8.26 రేటింగ్‌తో 'నువ్వుంటే నా జతగా' సీరియల్ కొనసాగుతోంది.
Also Read: 'ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా' - తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, ఎవరో తెలుసా.?
జీ తెలుగు సీరియల్స్ హవా..
ఇక 'జీ తెలుగు'లో ప్రసారమయ్యే సీరియల్స్ విషయానికొస్తే టాప్‌లో కొత్త సీరియల్ నిలిచింది. 6.90 రేటింగ్‌తో టాప్‌లో.. ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 6.83 రేటింగ్‌తో 'మేఘ సందేశం', 6.52 రేటింగ్స్‌తో పడమటి సంధ్యారాగం, 6.32 రేటింగ్స్‌తో జగద్ధాత్రి ఉన్నాయి. కాగా.. ఇటీవలే ఈ ఛానెల్‌లో కొన్ని సీరియల్స్ టైమ్ స్లాట్స్ మార్చేయడంతో తాజా రేటింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త సీరియల్ 'లక్ష్మీ నివాసం'కు 5.22 రేటింగ్ రాగా.. కొన్నాళ్లుగా టాప్ సీరియల్స్‌లో ఒకటిగా ఉన్న 'నిండు నూరేళ్ల సావాసం'కు తాజా రేటింగ్స్‌లో కేవలం 3.83 రేటింగ్ వచ్చింది.
అర్బన్‌లో టాప్ సీరియల్స్ లిస్ట్
మరోవైపు, కేవలం అర్బన్ రేటింగ్స్ చూస్తే టాప్ 3 సీరియల్స్ స్థానాల్లో కాస్త మార్పులు జరిగాయి. అర్బన్, రూరల్ కలిపి కొన్నాళ్లుగా స్టార్ మా 'కార్తీక దీపం' సీరియల్ టాప్‌లో నిలుస్తూ వస్తోంది. అయితే, కేవలం అర్బన్, రూరల్‌లో ఈ స్థానాల్లో సీరియల్స్ ముందు వెనుక అయ్యాయి. కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే.. 10.32 రేటింగ్‌తో 'గుండెనిండా గుడి గంటలు' సీరియల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 9.92 రేటింగ్‌తో రెండో స్థానంలో 'కార్తీక దీపం 2' సీరియల్ నిలిచింది.
9.09 రేటింగ్‌తో మూడో స్థానంలో 'ఇంటింటి రామాయణం' నిలిచింది. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌కు అర్బన్ కంటే రూరల్‌లో ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ సీరియల్ అర్బన్ కంటే రూరల్‌లో ఎక్కువ ఆదరణ ఉండడంతో ఇందులో టాప్ ప్లేస్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది.