Ammayi garu Serial Today Episode సూర్య ప్రతాప్ సీఎం అవ్వాలి అంటే స్వతంత్ర అభ్యర్థి విరూపాక్షిని తమ పార్టీలో చేర్చుకోవాలని కార్యకర్తలు, మిగతా నేతలు అందరూ సూర్యతోనే ఆ పని సాధ్యమని అంటారు. సూర్యప్రతాప్‌ దానికి రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ విరూపాక్షి సాయం తీసుకోనని చెప్తాడు. 

రూప: ఈ కారణం వల్ల అయినా అమ్మానాన్నలు కలుస్తారు అనుకున్నా కానీ ఇప్పుడేం చేయాలి.సూర్యప్రతాప్‌: ఆ విరూపాక్షికి నా ఫ్యామిలీలోకి రానివ్వను అలాగే నా ఫ్యామిలీ లాంటి పార్టీలోకి రానివ్వను.విరూపాక్షి: ప్రాణం పోయినా సూర్య నన్ను పార్టీలోకి తీసుకోడు దాని కంటే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడు. కానీ నా సపోర్ట్ నుంచి వచ్చే సీఎం పదవి తీసుకోడు.రాజు: మనమే వెళ్లి సపోర్ట్ చేద్దామని చెప్దాం అమ్మగారు.విరూపాక్షి: నాకే నేను వెళ్తే తన కోసమే పార్టీలోకి వెళ్లానని అపార్థం చేసుకుంటాడు.రాజు: అమ్మాయి గారు పెద్దయ్య గారు ఏం అంటున్నారు.రూప: ప్రాణం పోయినా అమ్మకి సపోర్ట్ అడగను అంటున్నారు. రాజు: పెద్దయ్య గారు ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఏమైనా చేస్తారు అంత గొప్ప నాయకుడు పెద్దయ్యగారు ఆ రకంగా వస్తే కచ్చితంగా సపోర్ట్ అడుగుతారు. మీరే ఒప్పించండి అమ్మాయిగారు.రూప: నేనా అమ్మ పేరు పెడితే అంతే సంగతులు.రాజు: అమ్మగారి పేరు పెట్టుకుండా ప్రయత్నించండి అమ్మాయి గారు.సూర్యప్రతాప్‌: ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను ఆ విరూపాక్షి సపోర్ట్ తప్ప. రూప: నాన్న ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అని తప్పుగా అనుకోకండి.సూర్యప్రతాప్‌: ఏంటి నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావారూప: కాదు నాన్న మీరు గెలిస్తే చూడాలి అని ఉంది. మీరు గెలవాలి అని రాష్ట్రంలో చాలా కుటుంబాలు అనుకుంటున్నాయి. మీరు ఓడిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి నాన్న. పది మందికి మంచి చేయాలి అంటే నాలుగు అడుగులు దిగినా పర్లేదు  అని మీరే చెప్తారు కదా నాన్న మరి ఇప్పుడు ఎందుకు నాన్న ప్రజలు అంటే కూడా అసహ్యం అన్నట్లు ఇలా మాట్లాడుతున్నారు. చంద్ర: అన్నయ్య ఈ అవకాశం పోతే మరో 5 ఏళ్లు రాష్ట్రం పరిస్థితి ఆలోచించండి.రూప: నాన్న అమ్మ ప్లేస్‌లో ఇంకెవరు ఉన్నా ఇలాగే చేసేవాళ్లా.విజయాంబిక: వదిలేయండి నా తమ్ముడికి ఇష్టం లేదు కదా ఆ విరూపాక్షి మనకు ఎంత మోసం చేసిందో.

ముత్యాలు వాళ్లు విరూపాక్షితో పెద్దయ్య గారిని మిమల్ని కలపడానికి దేవుడు ఇలా చేసినట్లున్నారని మనమే ఒక మెట్టు దిగి వెళ్దామని విరూపాక్షి వాళ్లు బయల్దేరే టైంకి సూర్యప్రతాప్‌ అక్కడికి వస్తారు. విరూపాక్షి చాలా సంతోషిస్తుంది. అందరూ సూర్యప్రతాప్‌కి జేజేలు చెప్పి సూర్యప్రతాప్‌ని ఆహ్వానిస్తారు. రూప రాజు వైపు చూస్తే దానికి రూప తన తండ్రితో అత్తయ్య చెప్పింది వంద శాతం నిజమే నాన్న మన మీద కోపంతో అమ్మ వేరే పార్టీతో చేతులు కలిపి మన కుటుంబంతో పాటు వందల కుటుంబాలు నాశనం చేస్తుందని రూప అంటుంది. రూప తెలివికి విజయాంబిక నోరెళ్ల బెడుతుంది. సూర్యప్రతాప్‌ విరూపాక్షికి ఆ ఛాన్స్ ఇవ్వను అని తానే సపోర్ట్ అడుగుతాను అని వస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. రూప విజయాంబికను చూసి కన్నెగరేస్తుంది. అత్తయ్య బొమ్మ అదుర్స్ కదా అని రూప విజయాంబికను ఉడికిస్తుంది. 

మరోపార్టీ నేతలు విరూపాక్షి సూర్యప్రతాప్‌కే సపోర్ట్ చేస్తుందని ఇన్నేళ్లు భార్యని వదిలేసిన వారు ఇప్పుడు పదవి కోసం వచ్చారని అంటారు. రాజు వాళ్లని ఆపుతారు. విరూపాక్షి సూర్యప్రతాప్‌ తన సాయం కోరరు అని అలా కోరితే ఎక్కడ నేను దగ్గర అవుతానో అని భయపడుతున్నారని అంటుంది. దానికి సూర్యప్రతాప్‌ నేను సంబంధం కలుపుకోవడానికి రాలేదు సాయం కోసం వచ్చానని అంటారు. మన కోసం ఈయన ఇంతకు మించి ఆలోచించలేరని విరూపాక్షి అంటుంది. నువ్వు నా సపోర్ట్ కోసం వస్తావు అనుకోలేదు అని థ్యాంక్స్ చెప్తుంది. విజయాంబిక విరూపాక్షి మీద నోరు పారేసుకుంటే దానికి విరూపాక్షి విజయాంబికతో నువ్వు ఓడిపోయినందుకు నా సానుభూతి తెలుపుతున్నా అని చెప్పి నోరు మూయిస్తుంది.

ఇక సూర్యప్రతాప్‌తో ఇన్నేళ్లు నా గురించి ఆలోచించని నువ్వు అందరిలా రాజకీయం కోసం వచ్చి నీ రాజకీయ బుద్ధి చూపించావ్ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. నేనేం పదవి మీద వ్యామోహం కోసం రాలేదని ప్రజలు కోసం వచ్చానని అర్థం చేసుకోకపోయినా పర్లేదు అపార్థం మాత్రం చేసుకోవద్దని చెప్పి వెళ్లిపోతాడు. రూప తల్లిని బతిమాలుతుంది. సూర్య వెళ్లిపోతుంటే విరూపాక్షి ఆపుతుంది. నేను నీకు సపోర్ట్‌ చేస్తే నీతో పాటు నీ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొవాల్సి వస్తుంది.. అసెంబ్లీలో  నీ పక్కన కూర్చొవాళ్సి వస్తుంది.. సమయం సందర్భం లేకుండా నా సపోర్ట్‌తో గెలిచావని ప్రతిపక్షాలు అనే మాటలు వినాలి.. ఇవన్నీ నీకు కష్టం అవుతాయి కదా సూర్య నీ మనసుకి కష్టం కలిగించే పని చేయకూడదు అని ఆలోచిస్తున్నా అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!