Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్రకు మత్తు ఇంజెక్షన్ వేసిన సరయు మనీషాకి తాళి వచ్చి కట్టించుకోమని అంటుంది. మిత్ర దగ్గరకు మనీషా, సరయు వెళ్తారు. అందరి మెడలో పసుపు రంగు దండలు వేసి మత్తులో ఉన్న మిత్రకు తాళి ఇచ్చి అది దండ అని తన మెడలో వేయమని అంటుంది. మిత్ర మనీషా మెడ మీద తాళి పెట్ట మత్తుకి తాళి కింద పడేస్తాడు.
మిత్రకు డోస్ ఎక్కువైందని సరయు చెప్తుంది. తాళి కట్టడం కష్టమని అంటుంది. ఎలా అయినా తాళి కట్టించుకోవాలని మనీషా అంటుంది. జయదేవ్ ముఖం కడుక్కుంటూ ఉంటాడు. ఇక హాస్పిటల్‌లో డాక్టర్ లక్ష్మీ, వివేక్ వాళ్లతో జాను గర్భసంచి తీసేయాలి అంటారు. అలా చేస్తే పిల్లలు పుట్టరు కదా అని లక్ష్మీ అంటుంది.
దేవయాని: పనికి రాని గర్భాశయం ఉంటే ఎంత లేకపోతే ఎంత తీసేయండి డాక్టర్.
వివేక్: అమ్మ ఏం మాట్లాతున్నావ్.
దేవయాని: ఆపరా నీ నాటకాలు. కన్న తల్లినే మోసం చేస్తావా. లోపం దానిలో ఉంటే నీలో ఉందని నింద వేసుకుంటావా. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పవు అని చిన్న ఆశ ఉండేది. బిడ్డలు పుట్టని దాన్ని తీసుకొచ్చి నన్ను మోసం చేస్తావా.
లక్ష్మీ: అత్తయ్య గారు అదేం అంత ప్రమాదం కాదు 3 నెలలు మందులు వాడితే తగ్గిపోతుంది.
దేవయాని: అది ఇప్పుడు చెప్తావా లక్ష్మీ. పెద్ద దానివి అయిన నువ్వు కూడా ఇంత మోసం చేస్తావా ఆ మనీషా చెప్పినట్లు నువ్వు అడినప్పుడే నాకు అర్థమైంది నా అనుమానం వచ్చింది. ఇప్పుడు గర్భసంచి తీసేయమంటున్నారు అంటే ఈ జన్మలో పిల్లలు పుట్టరు.
లక్ష్మీ: డాక్టర్ ఇంకోసారి టెస్ట్ చేయండి ప్లీజ్.
డాక్టర్: అన్నీ పరీక్షలు చేశాం వెంటనే తనకి గర్భసంచి తీయకపోతే చనిపోతుంది.
దేవయాని విడాకులు ఇవ్వాలి మరో పెళ్లి చేసుకోవాలని కొడుకుతో అంటుంది. లక్ష్మీ అదేంటి అత్తయ్య అంటే నువ్వు వారసుడిని ఇచ్చావ్ నా కోడలు నాకు ఇవ్వకూడదా.. న్యాయం నా వైపే ఉంది పిల్లలు పుట్టని దాయి నాకు కోడలిగా వద్దు అని అంటుంది. వివేక్ సంతకం పెడతాడు విడాకులు ఇస్తాడు ఏం చేస్తావో చేసుకో అని దేవయాని అంటుంది. ఇక వివేక్ జాను గర్బసంచి తీసేయడానికి సంతకం పెట్టమని లక్ష్మీ వివేక్‌కి చెప్తుంది. వివేక్ షాక్ అయిపోతాడు. మీకు పిల్లలు పుట్టడమే కావాలి కదా అత్తయ్య గారు నా చెల్లికి నా గర్భ సంచి ఇస్తానని లక్ష్మీ అంటుంది. వివేక్, దేవయాని షాక్ అయిపోతారు.
మనీషా మిత్రతో తాళి కట్టించుకున్నట్లు నాటకం ఆడుతానని అందుకు సాక్ష్యంగా ఫొటోలు వీడియోలు తీయమని సరయుకి చెప్తుంది. రాజు గారి సాయంతో తన మెడలో తాళి కట్టించుకునే ప్రయత్నం చేస్తుంది. వివేక్ లక్ష్మీతో వద్దు వదినా అలా చేస్తే మీకు ఇంకెప్పటికీ పిల్లలు ఉండరు అంటే మాకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు నువ్వు, జాను నాకు పిల్లలే అని ఇంకేం మాట్లాడొద్దని లక్ష్మీ చెప్తుంది. లక్ష్మీ తన గర్భసంచిని జానుకి పెట్టే ఏర్పాటు చేయమని అంటుంది. దాంతో డాక్టర్ మీ భర్త పర్మిషన్ కావాలి అంటుంది. లక్ష్మీ మిత్రకు కాల్ చేస్తుంది. మత్తులో ఉన్న మిత్ర ఫోన్ తీయగానే మనీషా ఫోన్ పక్కన పెట్టేస్తుంది. జయదేవ్ రావడం చూసి ఇక తనకు తానే తాళి కట్టుకుంటుంది. మిత్ర తాళి కట్టినట్లు తన తాళి పట్టిస్తుంది. అది చూసిన జయదేవ్ మిత్ర, మనీషాని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటాడు. జయదేవ్ రాగానే మనీషా నాటకం మొదలు పెడుతుంది. ఆరోజు మత్తులో నాతో తప్పు చేశావ్ ఈ రోజు నాతో తాళి కట్టించుకున్నావ్ అని అంటుంది. జయదేవ్ నాటకాలు ఆపమని మిత్రకు ఏం తెలీకుండా అంతా నువ్వే చేశావని అంటాడు. అందరూ చూడటంతో సరయు వాళ్లు మిత్ర, మనీషా, జయదేవ్‌ని పంపుతుంది.
లక్ష్మీ డాక్టర్‌ని బతిమాలా నో అబ్జక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టి తన గర్భసంచిని తన చెల్లికి ఇస్తుంది. మనీషా వాళ్లు ఇంటికి వెళ్తారు. మిత్ర నా భర్త అయిపోయాడని మనీషా అంటుంది. ఇది పెళ్లి కాదని ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కాదు అని జయదేవ్ అంటే ఆల్రెడీ కోడలు అయిపోయానని ఫొటోలు, వీడియోలు ఉన్నాయని అంటుంది. లక్ష్మీ ఇంటికి వస్తే నీ సంగతి చెప్తుందని జయదేవ్ వెళ్లిపోతాడు. మనీషా మిత్ర చేయి పట్టుకొని ఇక మిత్ర నీ వాడే అని అనుకుంటుంది. మరోవైపు డాక్టర్ వచ్చి లక్ష్మీ బ్యాగ్ జానుకి ఏర్పాటు చేశామని ఇక జానుకి పిల్లలు పుడతారని డాక్టర్ చెప్తుంది. వివేక్ మిత్రకు కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేయకోవడంతో జయదేవ్‌కి కాల్ చేస్తాడు. మనీషా మిత్రని దొంగ దెబ్బ తీసిందని లక్ష్మీకి చావు దెబ్బ తీసిందని పెళ్లి గురించి చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!