Aamir Khan Introduces New Girl Friend: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేశారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా గురువారం మీడియా సమక్షంలో ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్ల్ ఎదుట కేక్ కట్ చేశారు. అనంతరం వారితో సరదాగా కాసేపు మాట్లాడారు.
మాట్లాడుతూనే సర్‌ఫ్రైజ్..
మీడియాతో చిట్ చాట్ సందర్భంగానే ఆమిర్ ఖాన్ వారికి సడెన్ సర్ ఫ్రైజ్ ఇచ్చారు. తన స్నేహితురాలు గౌరి స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మీడియా కెమెరాలు అన్నీ ఆఫ్ అయిన తర్వాత గౌరీని వారికి చూపించినట్లు తెలుస్తోంది. '25 ఏళ్ల కిందట మేమిద్దరం తొలిసారి కలుసుకున్నాం. అనంతరం మధ్యలో ఈమె టచ్‌లో లేకుండా పోయారు. రెండేళ్ల కిందట మళ్లీ కలుసుకున్నాం. మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ మాత్రం 18 నెలల కిందట మొదలైంది.' అంటూ ఆమిర్ చెప్పారు.
Also Read: ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
'మీకు తెలియలేదు చూశారా..?'
ఈ సందర్భంగా మీడియాతో ఆమిర్ ఖాన్ సరదాగా చమత్కరించారు. 'నేను ఆమెతో డేటింగ్ చేస్తున్నా ఇన్నాళ్లుగా మీకు తెలియలేదు చూశారా..?' అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఆమెను తన ప్రపంచానికి తగినట్లుగా సిద్ధం చేయడానికి ప్రయత్నించానని.. ఆమెకు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గౌరీ
లగాన్ మూవీ డైలాగ్ గుర్తు చేస్తూ..
గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తుండగా.. ఆమెకు పెళ్లై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తన పిల్లలు సైతం గౌరిని కలిశారని.. వాళ్లు సంతోషంగా ఉన్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. ఈ సందర్భంగా తన 'లగాన్' మూవీ డైలాగ్‌ను గుర్తు చేశారు. భువన్‌కు తన గౌరీ దక్కింది అంటూ చెప్పారు. కాగా.. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఆమిర్ ఖాన్ డేటింగ్‌పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. 2021లో ఆమిర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావ్‌తో వివాహ బంధానికి స్వస్తి పలికారు.
'మహాభారత్ నా డ్రీమ్ ప్రాజెక్ట్'
ఈ సందర్భంగా తన తదుపరి సినిమాలు, చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్' అని దానిని భారీ స్థాయిలో సిద్ధం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే మొదలుపెడుతున్నామని.. దీని కోసం ఓ టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామని.. ఏం జరుగుతుందో చూడాలి అంటూ కామెంట్ చేశారు.
అయితే, గతంలోనూ 'మహాభారత్' ప్రాజెక్ట్ గురించి ఆమిర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చేయడం ఓ యజ్ఞంతో సమానమని.. దాని విశిష్టతకు భంగం కలగకుండా సినిమా రూపొందించేందుకు శ్రమిస్తున్నానన్నారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో తాను ఎంతో భయంతో ఉన్నట్లు చెప్పారు.
షారుఖ్, సల్మాన్‌లతో కాంబో మూవీపై..
అలాగే, బుధవారం సాయంత్రం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలవడంపై ఆమిర్ ఖాన్ స్పందించారు. వారితో తనకు మంచి అనుబంధం ఉందని.. వారిద్దరినీ కలవడం ఆనందంగా ఉందని అన్నారు. 'మేము మా పుట్టినరోజుల గురించి మాట్లాడుకోలేదు. ఎందుకంటే వాటి గురించి మాకు పెద్దగా గుర్తుండదు. మీరు ఎప్పుడూ మాపై గాసిప్స్ రాస్తుంటారు. అందుకే ఈసారి మేము మీ గురించే గాసిప్స్ మాట్లాడుకున్నాం. మా ముగ్గురి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాం.' అని తెలిపారు.