Telugu TV Serials TRP Ratings This Week: ప్రజెంట్ బుల్లితెర మెగాస్టార్ ఎవరంటే డాక్టర్ బాబు రోల్ చేసిన నిరుపమ్ పరిటాల అని చెప్పాలి. లేడీ సూపర్ స్టార్ ఎవరంటే వంటలక్క రోల్ చేసిన ప్రేమీ విశ్వనాథ్ అని చెప్పాలి. వాళ్లిద్దరూ జంటగా నటించిన 'కార్తీక దీపం' బ్లాక్ బస్టర్ హిట్టు. ఇక, ఆ సీరియల్ తర్వాత 'కార్తీక దీపం 2 నవ వసంతం'తో మరోసారి జంటగా వచ్చారు. ఈ సీరియల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా లాస్ట్ వీక్ 10 కంటే కిందకు పడిన ఈ సీరియల్ మళ్ళీ 10 కంటే పైకి వచ్చింది. మరి, మిగతా 9 స్థానాల్లో ఏయే సీరియళ్లు ఉన్నాయి? అనేది ఒక లుక్ వేయండి. 


టాప్ లేపిన 'కార్తీక దీపం 2 నవ వసంతం'...
ప్రభాకర్ సీరియల్ దగ్గరకు వచ్చింది కానీ!?
టీఆర్పీ రేటింగ్స్ పరంగా డాక్టర్ బాబు మరోసారి తన పవర్ ఏంటనేది చూపించాడు. 'స్టార్ మా' ఛానల్ వరకు మాత్రమే కాదు... తెలుగు సీరియళ్లలో 'కార్తీక దీపం 2 నవ వసంతం' ఎప్పటిలా టాప్ ప్లేస్ లో నిలిచింది. లాస్ట్ వీక్ 0.01% తేడాతో 10 కంటే కిందకు పడిన ఈ సీరియల్... ఈ వారం మళ్లీ పైకి లేచింది. 


జనవరి మూడో వారం‌ టీఆర్పీ రేటింగుల్లో 'కార్తీక దీపం 2: నవ వసంతం' సీరియల్ ‌10.30 రేటింగ్ సాధించింది.‌ ఆ తర్వాత స్థానంలో ప్రభాకర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నిలిచింది. దానికి 9.46 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత 'గుండె నిండా గుడి గంటలు' (9.04), 'చిన్ని' (8.25), 'ఇంటింటి రామాయణం' (8.14) టీఆర్పీ సాధించాయి. ఈ వారం టాప్ 10 లిస్టులో టాప్ 5 సీరియల్స్ ఇవే.


'స్టార్ మా' సీరియళ్లలో మిగతా సీరియల్స్ టీఆర్పీ విషయానికి వస్తే... 'నువ్వుంటే నా జతగా' (7.40), 'మగువా ఓ మగువా' (7.13), 'బ్రహ్మముడి' (5.51), 'పలుకే బంగారమాయెనా' (5.14) టీఆర్పీ సాధించాయి. 


మేఘ సందేశాన్ని వెనక్కి నెట్టిన 'చామంతి'
జీ తెలుగు సీరియళ్లలో గత కొన్ని వారాలుగా 'మేఘ సందేశం' టాప్ ప్లేస్ నిలబెట్టుకుంటూ వస్తోంది. అయితే, కొత్తగా మొదలైన 'చామంతి' సీరియల్ ఈ వారం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.


Also Read'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?


జనవరి మూడో వారంలో 'చామంతి' సీరియల్ (7.99) టీఆర్పీ రేటింగ్ సాధించగా... 'మేఘ సందేశం' సీరియల్ 7.46 టీఆర్పీ మాత్రమే సాధించింది. దాని కంటే ముందు, 'చామంతి' కంటే కిందకు... 'పడమటి సంధ్యారాగం' (7.75), 'జగద్ధాత్రి' 7.50 టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి. 
'జీ తెలుగు'లో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'నిండు నూరేళ్ళ సావాసం' (6.56), 'అమ్మాయిగారు' (6.02), 'మా అన్నయ్య' (4.91), 'ప్రేమ ఎంత మధురం' (4.77) టీఆర్పీ సాధించాయి. ఇక 'త్రినయిని' (3.08), 'ఉమ్మడి కుటుంబం' (2.97) టీఆర్పీ సాధించాయి. 


జెమినీ టీవీలో ఈ వారం ఒక్క పాయింట్ టీఆర్పీ రేటింగ్ సాధించిన సీరియల్ ఒకటి కూడా లేదు. ప్రతి వారం ఒకటి కంటే కాస్త ఎక్కువ టీఆర్పీ సాధించే 'భైరవి' ఈ వారం 0.98 టీఆర్పీ మాత్రమే సాధించింది. ఈటీవీలో 'రంగులరాట్నం' (2.39), 'మనసంతా నువ్వే' (2.28), 'ఝాన్సీ' (1.87), 'బొమ్మరిల్లు' (1.60), 'కలిసుందాం రా' (1.09) టీఆర్పీ సాధించాయి.


Also Readస్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?x