Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అడవి మనుషులు సహస్రని కూడా పట్టుకున్నారని తప్పించుకొని వచ్చామని విహారి చెప్తాడు. సహస్ర కూడా అవును అంటుంది. లక్ష్మీ మన ఇంట్లో ఉంది కాబట్టి తనకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని వెళ్లానని ఆ సమయంలో రాత్రంతా తనతో ఉండాల్సి వచ్చిందని అంటాడు. 


విహారి: చూడు సహస్ర నువ్వు లక్ష్మీని పార్టీకి తీసుకురాకుండా ఉండాల్సింది. నువ్వేం ఆశించి లక్ష్మీని తీసుకొచ్చావో కానీ మొత్తం అస్తవ్యస్తం అయింది. ఇకనైనా ఏ పని చేయాలి అన్నా కాస్త ఆలోచించి చేయు. 
యమున: నాన్న చేతికి రక్తం కూడా వస్తుంది. నొప్పిగా ఉందా.
విహారి: అడవి మనుషులు వల్ల తగిలిన గాయాల కంటే ఈ ఆధునిక మనుషుల అనుమానాల వల్ల తగిలిన గాయాలకే ఎక్కువ నొప్పి వస్తుంది. 
సహస్ర: బావ నన్ను క్షమించు బావ. నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. నువ్వు నాకు దూరం అయిపోతావానే భయం. నువ్వు వేరే వారికి సొంతం అయితే నేను బతకలేను బావ. అమ్మని కూడా క్షమించు. కూతురి జీవితం ఏమైపోతుందా అని అమ్మ బాధలో అలా అనేసింది. సారీ బావ.
విహారి: ఇట్స్ ఓకే కనీసం నువ్వు అయినా నీ తప్పు తెలుసుకుంటే అదే చాలు. 
పద్మాక్షి: ఒంటరిగా ఇక్కడేం ఆలోచిస్తున్నావ్ సహస్ర.
సహస్ర: బావకి ఆ లక్ష్మీకి పెళ్లి జరిగితే వాళ్ల మీద నేను అక్షింతలు చల్లే పరిస్థితి వస్తుందేమో అని ఆలోచిస్తున్నా. 
పద్మాక్షి: సహస్ర ఏంటి ఆ మాటలు పిచ్చి పట్టిందా. 
సహస్ర: నాలుగు రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందమ్మా. లక్ష్మీ ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. తన మీద బావ మీద నాకు అనుమానం ఎందుకు వస్తుందో తెలీడం లేదు. 
పద్మాక్షి: ఆ లక్ష్మీ ఎక్కడా విహారి ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావ్. 
అంబిక: సహస్ర అన్నదాంట్లో నిజం ఉంది అక్క. ఈ సప్త పది గురించి వదిలేయ్. కానీ లక్ష్మీని ఎవరైనా ఒక్క మాట అంటే విహారి మాట పడనివడం లేదు. ప్రతీదాంట్లో తననే వెనకేసుకొస్తున్నాడు.
పద్మాక్షి: విహారికి చిన్నా పెద్దా తేడా లేదు ఎవరినైనా వెనకేసుకొస్తాడు అంతే. విహారి సహస్ర పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసి కూడా ఆ లక్ష్మీ మధ్యలో దూరితే ఆ క్షణమే దాన్ని నరికి పోగులు పెడతా.
సహస్ర: ఈ లోపే లక్ష్మీని గెంటేయడమో లేక పెళ్లి చేసి పంపేయడో చేయాలి.


యమున: (లక్ష్మీ వంట చేస్తుంటే యమున వెళ్లి) నువ్వు సంతోషంగా ఉండాలి లక్ష్మీ ఈ ఇంట్లో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. ఇది నీకు అవసరమా.
లక్ష్మీ: అగ్ని పర్వతం నుంచి తప్పించుకొని ముళ్ల మీద పడ్డాను దాని కంటే ఇదే నయం కదా అమ్మ.
యమున: ఈ ముళ్ల పొద నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది. నీ మెడలోతాళి  ఉండటం వల్ల నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావ్ నిన్ను పట్టించుకోని వాడి కోసం ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్ లక్ష్మీ. ఆ తాళిని తీసి పడేయ్.


విహారి ఆ మాటలు వింటాడు. లక్ష్మీ భర్తని సపోర్ట్‌గా మాట్లాడి తాళి తీయను అని అంటుంది. దాంతో యమున నేనే నీ కోసం ఓ మంచి సంబంధం చూస్తాను. పెళ్లి చేస్తాను. అని అంటుంది. దాంతో లక్ష్మీ మీరు ఇచ్చే సంతోషం నాకు సంతోషంలా ఉండదు అమ్మ విషంలా ఉంటుందని చెప్తుంది. తన భర్త తనకు ఏం ద్రోహం చేయలేదు మోసం చేయలేదు అంటుంది. ఇక విహారి వెళ్లబోతు సౌండ్ చేస్తాడు. దాంతో యమున ఎవరు అంటే నేనే అని విహారి అంటాడు. ఫోన్ మాట్లాడుతూ వచ్చానని చెప్తాడు. ఇక యమున చిన్న పని ఉందని లక్ష్మీని తీసుకెళ్తుంది. లక్ష్మీ వెళ్తూ వెళ్తూ విహారిని చూస్తుంది. విహారి మనసులో లక్ష్మీని నడిరోడ్డు మీద వదిలేసిన మోసగాడిని నేను అనుకుంటాడు. లక్ష్మీకి ఓ మంచి జీవితం ఇచ్చే తీరుతానని అనుకుంటాడు. మరోవైపు ప్రకాశ్ కనక మహాలక్ష్మీని అమ్మే తీరుతానని తన ఫ్రెండ్‌తో అంటాడు. విహారి కూడా తనని ఏం చేయలేడని ఏమైనా అంటే వాళ్ల గుట్టు రట్టు చేస్తానని భయం వాడికుందని దాన్నే వాడుకుంటానని అంటాడు. 


ఇక ఉదయం విహారి వచ్చి హాల్‌లో కూర్చొంటాడు. విహారికి ఎక్కిళ్లు వస్తాయి. వసుధ నీళ్లు తీసుకురమ్మని లక్ష్మీతో చెప్తుంది. లక్ష్మీ నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. విహారి తాగబోతూ కంకణం ఉపవాసం గుర్తొచ్చి నీరు పక్కన పెట్టేస్తాడు. ఇక లక్ష్మీ విహారిని మంచి నీరు కూడా తాగకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. విహారి లక్ష్మీకి కూడా కారణం చెప్పడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!