Ammayi garu Serial Today Episode రాజుకి రూప కాల్ చేసి దీపక్‌కి మరో పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారని చెప్తుంది. ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారని ఇప్పుడే విజయాంబిక, దీపక్‌లు తన తండ్రితో మాట్లాడారని రూప చెప్తుంది. దాంతో రాజు సడెన్‌గా పెళ్లి ప్లాన్ ఏంటి? మందారం బతికే ఉందని వాళ్లకి తెలిసిపోయిందా? మందారం వాళ్ల దగ్గరే ఉందా అని రాజు రూపని అడుగుతాడు.
రూప: రాజు మందారం వాళ్ల దగ్గర ఉండదు. ఒకవేళ మందారం ఉండి ఉంటే ఈ పెళ్లి ప్లాన్ వేసేవాళ్లు కాదు. దీని బట్టి కచ్చితంగా వీళ్ల దగ్గర లేదు. దీపక్ వాళ్లు ఏదో సంబంధం తీసుకొచ్చే లోపు మనం మందారాన్ని తీసుకురావాలి రాజు. లేదంటే మందారం అన్యాయం అయిపోతుంది.
రాజు: మందారం సంగతి నాకు వదిలేయండి అమ్మాయిగారు. వాళ్లు ఏం చేస్తారో వాళ్ల ప్లాన్ ఏంటో ఓ కన్నేసి ఉంచండి అమ్మాయిగారు.
రూప: అలాగే రాజు.
విరూపాక్షి: ఇంత కాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడు పెళ్లి అంటున్నారు అంటే మందారం బతికే ఉందన్న సంగతి వాళ్లకి తెలిసుంటుంది రాజు. వాళ్లు ఎక్కడైనా దాచుంటారేమో నాకు అనుమానంగా ఉంది రాజు.
రాజు: అది నేను చూసుకుంటాను అమ్మగారు మీరంతా లోపలికి వెళ్లండి. కనిపెట్టాలి మందారం ఎక్కడున్నా కనిపెట్టాలి.
రూప: దీపక్, విజయాంబిక నా కొడుకునే చంపాలి అని చూస్తారా. చెప్తా మీ సంగతి.
విజయాంబిక ఫోన్‌లో ఓ ఒకరితో సీఎం చెల్లి అని మీ కూతుర్ని మా కొడుకు చూశాడని రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని అంటుంది. అవతల వ్యక్తి ఓకే చెప్తారు. విజయాంబిక దీపక్‌తో పెళ్లి వీలైనంత త్వరగా చేసేసి అమెరికానో ఆస్ట్రేలియా చెక్కేయాలి అని అంటుంది. మందారం విషయంలో జాగ్రత్త పడాలని మందారం ఇంటికి వచ్చేలోపు మనం చెక్కేయాలి అని అంటుంది.
రూప: ఎందుకు చంపారు. నా బిడ్డని ఎందుకు చంపాలి అనుకున్నారు అత్తయ్య.
విజయాంబిక: ఏం మాట్లాడుతున్నావ్ రూప నీ బిడ్డని మేం ఎందుకు చంపాలి అనుకుంటాం. అయినా నీ బిడ్డ పుట్టగానే చనిపోయాడు కదా.
రూప: మీరు చంపాలని చూశారు. కానీ నా కొడుకు చనిపోలేదు. బంటీ నా కొడుకు అని మీకు తెలుసే కదా చంపాలని చూశారు కదా అత్తయ్య. మీకు విషయం తెలిసే కిడ్నాప్ ప్లాన్ చేశారు.
దీపక్: నీకు పిచ్చా రూప నీ కొడుకుని మేం చంపాలి అని చూడటం ఏంటి.
రూప: మరీ ఇంత అమాయకంగా నటిస్తున్నారేంటి. జీవన్ మన ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకున్నాడని మీకు తెలుసు. అలాంటి జీవన్తో మీరు కలిసిపోయారు. బంటీని జీవన్ కిడ్నాప్ చేసిన టైంలో దీపక్ ఉన్నాడని నాకు తెలుసు. కానీ ఆ దీపక్ వేరు ఈ దీపక్ వేరు అనేశారు. మీరు చెప్పినదంతా నమ్మడానికి నేను మీ తమ్ముడిని కాదు. తమ్ముడి కూతుర్ని.
విజయాంబిక: ఈ సంగతి మీ నాన్నకి చెప్తాం పద.
రూప: నాన్నకి ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు అత్తయ్యా దానికో లిటికేషన్ ఉంది అది అయిన తర్వాత చెప్తా.
పెళ్లి చూపులు నిశ్చితార్థం ఆపమని రూప విజయాంబిక వాళ్లతో చెప్తుంది. మందారానికి అన్యాయం చేసే పనులు చేస్తే బాగోదని తన కొడుకు జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. మందారం తిరిగి వస్తే మన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే అని ఈలోపే జాగ్రత్త పడాలని అనుకుంటారు. ఉదయం దీపక్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. సూర్య, చంద్ర, సుమ అందరూ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటారు. దీపక్ రెడీ అవుతూ అదృష్టవంతుడివిరా అని పొగుడుకుంటాడు. ఇంతలో దీపు తండ్రి దగ్గరకు వస్తాడు. నువ్వు చేస్తుంది నాకు నచ్చడం లేదు నాన్న అంటాడు. నాకు రూప మమ్మీనే కావాలి ఇంకెవరూ వద్దని అంటాడు. రూప ఏం చేయలేక బాధ పడుతుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వచ్చేస్తారు. చంద్ర, విజయాంబిక వెళ్లి వాళ్లని రిసీవ్ చేసుకుంటారు. రాజు కూడా వస్తాడు. అంతా పరిశీలించి బుర్కా వేసుకొని పెళ్లి వాళ్లలో కలిసిపోతాడు.
రూప టెన్షన్ పడటం చూసి అమ్మాయిగారు బాగా టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు కొంచెం సేపు ఆటపట్టించాలని అనుకుంటాడు. పెళ్లి కూతురు దీపుని పిలిచి నీకు నేను అమ్మని ఇలా రా అని అంటుంది. దానికి దీపు నువ్వు మా అమ్మ ఎందుకు అవుతావ్ రూపమ్మే మా అమ్మ అంటాడు. దాంతో రూప తప్పు అని దీపుని ఆమె దగ్గరకు పంపుతుంది. దీపక్‌ని తీసుకొచ్చి పీటల మీద కూర్చొపెడతారు. రూప టెన్షన్ పడుతూ రాజుకు కాల్ చేస్తే రాజు కాల్ లిఫ్ట్ చేయడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!