Karthika Deepam 2 Serial Today Twist : మహిళలు మెడలో తాళి బొట్టుని ఎంత పవిత్రంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆ సూత్రంలోనే భర్త ఆయుష్షు.. ఐశ్వరం.. సిరి సంపదలు అన్నీ ఉంటాయని ప్రతి మహిళ తాళిని తన ప్రాణంగా చూసుకుంటుంది. ప్రస్తుతం అయితే అన్నింట్లో ట్రెండ్ నడుస్తున్నట్లు ఈ తాళి విషయంలోనూ ట్రెండ్ మారిపోయింది.

 ఒకప్పుడు తాళిని బయటకు చూపించడానికి ఇష్టపడని వారు సైతం ఇప్పుడు తాళికి రకరకాల హంగులు అద్ది ఆర్భాటాలకు పోతున్నారు. రీల్స్ ట్రెండ్ అవుతున్న ఈ టైంలో సెలబ్రెటీలు హోం టూర్, శారీస్, నగలు, బట్టలు ఇలా ప్రతీది తమ దగ్గర ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నారు. ఈ మధ్య ఓ బీబీ సెలబ్రిటీ తన తాళి డిజైన్ చూపించి ఇది పాతది.. కొత్తది కొన్నా ఇలా చేయించుకున్నా వెంకన్న డిజైన్ పెట్టుకున్నా అని చూపించింది..

ఇక సీరియల్స్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాళిలో మోడల్స్ చూపించడం అయితే ఓకే కానీ ప్రస్తుతం కొన్ని ఎపిసోడ్స్‌లో తాళి తెంపే సీన్స్  సాధారణంగా మారిపోతున్నాయి. ఈ సీన్స్‌లో నటులు ఎంత ఏడుస్తున్నారో దానికి డబుల్ టీవీ ముందు కూర్చొనే ప్రతీ మహిళ ఏడుస్తుంది. తాళిని తెంపే విలన్స్‌ని తెగ తిట్టుకుంటూ ఉంటారు. ఈ రోజు కార్తీక దీపం ఇది నవవసంతం సీరియల్‌లో కూడా ఇదే సీన్ జరిగింది. దీప మెడలో జ్యోత్స్న తాళి తెంపేస్తుంది. దీప ఏడుస్తూ తనని నటనతో అందర్ని ఏడిపించేసింది. ఇంతకీ ఏం కార్తీకదీపం 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సీరియల్స్‌లో ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవడానికి మెయిన్ కారణం తాళే. అదేనండి ఆ తాళిని కట్టే అబ్బాయి కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవడం కామన్ అయిపోయింది. ఇక కార్తీక దీపంలో అయితే చిన్నప్పటి నుంచి బావ కార్తీక్‌నే ప్రాణం అని పెరిగిన జ్యోత్స్న మెడలో తాళి కట్టాల్సిన కార్తీక్ అనూహ్యరీతిలో దీప మెడలో కట్టేస్తాడు. అప్పటి నుంచి జ్యోత్స్నకు దీప అంటే పడదు.. బావని తిరిగి దక్కించుకునేందుకు రకరకాల కుట్రలు చేస్తుంది. అయితే ఇవాళ జ్యోత్స్నకు ఏ పెళ్లి సెట్ అవ్వడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పంతుల్ని పిలిపించి జాతకం చూపిస్తారు. 

జ్యోత్స్న జాతకం చూసిన పంతులు ఈ జాతకం ప్రకారం అమ్మాయికి అప్పుడే పెళ్లి అయిపోవాలని చెప్తారు. దీప, జ్యోత్స్న చిన్నప్పుడు మారిపోవడం వల్ల పంతులు చెప్పిన ప్రకారం ఆ ఇంటి వారసురాలు అయిన దీపకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఇక జ్యోత్స్న చేయి చూసి ఆమెకు పెళ్లి కావడం కష్టం అని పంతులు చెప్తారు. పంతులు చెప్పిన మాటలకు జ్యోత్స్న ఫ్యామిలీ చాలా బాధ పడతారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత దీప జ్యోత్స్నకు మీ అమ్మానాన్నల బాధ పొగొట్టాలి అంటే పెళ్లి చేసుకో అని చెప్తుంది. నీది నాది ఒక స్థాయి కాదు పని మనిషి అయిన నువ్వు నాకు సలహా ఇస్తావా.. ఇదంతా నా బావ నీ మెడలో తాళి కట్టడం వల్లే నీకు నాతో మాట్లాడే స్థాయి వచ్చింది.. నీ మెడలో నా బావ కట్టిన తాళి ఉండకూడదు అని జ్యోత్స్న దీప తాళి పట్టుకుంటుంది. 

దీప తన తాళిని ఏం చేయొద్దుని వేడుకుంటుంది.    ఇంట్లో అందరూ వచ్చి జ్యోత్స్నకి ఎంత చెప్పినా వినదు. ఈ తాళి మెడలో ఉండటం వల్లే ఇది ఇలా రెచ్చిపోతుందని తాళి తెంపేస్తుంది. దీప కుప్పకూలి ఏడుస్తుంది. అందరూ  షాక్ అయిపోతారు. కార్తీక్ ఆవేశంతో జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తడం గమనించిన సుమిత్ర జ్యోత్స్నని కొడుతుంది. ఏది ఏమైనా జ్యోత్స్న దీప మెడలో తాళి తెంపడం చూసి మహిళలు జ్యోత్స్నని గట్టిగా తిట్టుకుంటారు. 

రెండు రోజుల క్రితం ఎపిసోడ్‌లో జ్యోత్స్న తాత తన మొదటి భార్య తాళి పట్టుకొని బాధ పడతాడు. అది తన మనవరాలికి దక్కాలని కానీ నీకు పెళ్లి కావడం లేదని జ్యోత్స్న దగ్గర బాధ పడతాడు. ఎప్పటికైనా అది నీ మనవరాలికే దక్కుతుందని దీప, దశరథ్‌లు పెద్దాయనకు చెప్తారు. ఇప్పుడు జ్యోత్స్న దీప మెడలో తాళి తెంపేయడంతో పెద్దాయన జ్యోత్స్న వల్ల జరిగిన ఈ పెద్ద తప్పుని సరిదిద్దుకోవడానికి ఆయన భార్య తాళి కార్తీక చేత దీప మెడలో కట్టించవచ్చు. ఈ విధంగా పెద్దాయన కోరిక మేరకు ఆ తాళి అసలైన మనవరాలికే దక్కొచ్చు. 

ఈ తాళి తెంపే సీన్ కలవారి కోడలు కనక మహాలక్ష్మీ సీరియల్‌లోనూ జరిగింది. కొన్ని రోజుల కిందటి ఎపిసోడ్‌లో సహస్ర ఓ గుడిలో కనకమహాలక్ష్మీ మెడలోని తాళి తెంపేస్తుంది. దాంతో మళ్లీ విహారి కనకం మెడలో తాళి కట్టడం, యమున అది చూసి తన కొడుకుకు లక్ష్మీకి పెళ్లి అయిందని తెలుసుకోవడంతో ఆ సీరియల్ కూడా ఆసక్తికరంగా మారింది. కథలను మలపు తిప్పడానికి ఇలా తాళి తెంపే సీన్స్ ప్రస్తుతం సీరియల్స్‌లో ఓ ట్రెండ్‌గా మారిపోతున్నాయి.