Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున లక్ష్మీని తన భర్త గురించి అడిగి లక్ష్మీ ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో నీ మెడలో తాళి కట్టింది ఎవరో కాదు నా కొడుకు విష్ణు విహారి అని యమున చెప్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. ఈ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా రెండో సారి విహారి గుడిలో నీకు తాళి కట్టడం నేను చూశాను.. అప్పటి నుంచి నువ్వు చేసిన మోసానికి నాలో నేను తల్లడిల్లిపోతున్నాను. ఈ విషయం నాకు తెలిసినట్లే ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఏమైపోతుందా అని సతమతమైపోతున్నాను. నువ్వు నాకు చేసిన మేలు ఇదేనా అని యమున అడిగే సరికి లక్ష్మీ ఏడుస్తుంది. 

Continues below advertisement


లక్ష్మీ యమున కాళ్లు పట్టుకొని విహారి గారి పెళ్లి నాకు ఓ మోసం వల్ల జరిగింది. తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో విహారి గారు నా మెడలో తాళి కట్టారు. అంతే కానీ ఇందులో ఎవరి ఇష్టాఇష్టాలు లేవు. ఇందులో విహారి గారి తప్పు లేదు అని ఏడుస్తుంది. దాంతో యమున లక్ష్మీని పైకి లేపి ఒక్కటి గుర్తించుకో లక్ష్మీ నీ మెడలో విహారి ఎందుకు తాళి కట్టినా నా కోడలు మాత్రం సహస్రనే. విహారి భార్య సహస్రనే ఈ విషయం నువ్వు గుర్తుంచుకొని జాగ్రత్తగా నడుచుకో.. విహారి మంచి కోసం మా కుటుంబం కోసం ఏం చేయాలి అన్నా సహస్రనే చేయాలి.. నువ్వు చేయాలి అనుకున్నా నీకు ఏ అర్హత లేదు.. నువ్వు ఏ కార్యక్రమం చేసినా అది మాకు అశుభం. నా మాట కాదని నువ్వేం చేసినా ఈ సారి నా నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో అని వార్నింగ్ ఇచ్చి యమున వెళ్లిపోతుంది. 


లక్ష్మీ ఏడుస్తూ నేను దైవంగా కొలుచుకునే యమునమ్మకి నిజం తెలిసిపోయింది. యమునమ్మ నేను మోసం చేశాను ద్రోహం చేశాను అంటున్నారు. ఇక నేను బతికి ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు సిద్ధార్థ్‌ అంబికను అదే ఏరియాలో కలుస్తాడు. 20 లక్షలు ఇవ్వమని అంబికను అడుగుతాడు. అంబిక కావాలనే సిద్ధార్థ్‌ని మాటల్లో పెడుతుంది. ఇంతలో సుభాష్ వచ్చి సిద్ధార్థ్‌ తల మీద కర్రతో కొట్టేస్తాడు. ఒక్క దెబ్బకే  సిద్ధార్థ్‌  పడిపోతాడు. ఒక్కదెబ్బకే పడిపోయాడని ఇద్దరూ అనుకుంటుండగా సిద్ధార్థ్‌ లేచి సుభాష్‌ని కొడతాడు. సుభాష్ సిద్ధార్థ్‌ని చితక్కొట్టి ఒక్కటి తంతాడు దాంతో సిద్ధార్థ్‌ ఎగిరి చెరువులో పడిపోతాడు. ఇద్దరూ చూసి సిద్ధార్థ్‌ మునిగి చనిపోయాడని ఇక వీడి శవం ఎక్కడ తేలుతుందో కానీ మనకు ఏం ఇబ్బంది లేదు అని వెళ్లిపోతారు. 


సిద్ధార్థ్‌ ఆత్మహత్య చేసుకోవడానికి అదే చెరువుపై ఉన్న బ్రిడ్జ్ ఎక్కి దూకేయాలని అనుకుంటుంది. ఇంతలో సిద్ధార్థ్‌  బాడీ అటుగా రావడం చూసి ఎవరో అని అనుకొని పరుగున వెళ్తుంది. తీరా చూసి అది సిద్ధార్థ్‌ అని గుర్తు పడుతుంది. సిద్ధార్థ్‌ తలకి రక్తం రావడం చూస్తుంది. సిద్ధార్థ్‌ని లేపడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేయడంతో సిద్ధార్థ్‌కి మెలకువ రావడంతో అంబిక అంబిక.. నీ రహస్యం తెలిసిందని ఇలా చేస్తావా అంటాడు. అంబిక, రహస్యం అంటున్నాడు అంటే అంబికమ్మే ఇలా చేసింది సిద్ధార్థ్‌ని ఎలా అయినా కాపాడి ఆ రహస్యం తెలుసుకోవాలని అనుకుంటుంది. సిద్ధార్థ్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ వచ్చి ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడని చెప్తారు. లక్ష్మీ డాక్టర్‌తో అతను ఎలా అయినా బతకాలి డాక్టర్.. అతని గురించి ఎవరు వచ్చి అడిగినా ఏం చెప్పొద్దు.. చెప్తే అతనికి ప్రమాదం అని చెప్పి తన బంగారం గాజులు ఇస్తుంది. 


అంబిక ఏదో పెద్ద కుట్రే చేసిందని ఇప్పుడు తను చావడం కంటే సిద్ధార్థ్‌ ద్వారా నిజం తెలుసుకొని విహారిని కాపాడుకోవాలని అనుకుంటుంది. యమున లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటే విహారి ఏమైందని అడుగుతాడు. నా ఆలోచనలు అన్నీ నీ గురించే విహారి అని యమున అంటుంది. నా గురించి ఎందుకు అని విహారి అడిగితే నువ్వు సహస్రని చక్కగా చూసుకుంటున్నావా అని అడుగుతుంది. బాధ్యత నిర్వర్తిస్తున్నా మనసు చెప్పింది చేస్తున్నా రెండింటిలో ఏ వైపు వెళ్లాలో అర్థంకావడం లేదు అమ్మ.. కుటుంబం సంతోషం కోసం ఏమైనా చేస్తా.. కానీ ఒక్కసారి మనసు మాట వినమని అంటుంది. ఏం చేయాలో తెలీదు కానీ ఏదో ఒక రోజు ఒకనిర్ణయం తీసుకోవాలి అని విహారి అంటే యమున మొత్తం విని నా కొడుకు ఆ లక్ష్మీతో జరిగిన దొంగ పెళ్లి గురించి నలిగిపోతున్నాడని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.