Nindu Manasulu Serial Today Episode ప్రేరణ వాళ్లని ఇంటి ఓనర్ వెళ్లిపోమని చెప్తాడు. మీ బాగోతం బయట పెట్టారు అని మిమల్ని తీసుకొచ్చిన వాడిని చెప్పుతో కొట్టాలి.. ఏం బిల్డప్ ఇచ్చారే.. నీ భర్త దుబాయ్‌లో ఉన్నాడని చెప్తావా.. కూతుళ్లతో నువ్వు చేసే ఘనకార్యం ఇదా అని నువ్వు అది ఇది అని ఓనర్ దారుణంగా మాట్లాడుతాడు.

ఇందిర ఆయనతో వాళ్లు కక్ష కట్టి అలా మాట్లాడారండీ మీరు అలా అనడం సరి కాదు అని చేతులు జోడించి దండం పెట్టి తన కూతుళ్ల గురించి తప్పుగా మాట్లాడొద్దని వేడుకుంటుంది. మిమల్ని చూస్తే చిరాకుగా ఉంది మర్యాదగా వెళ్లిపోండి అని ఓనర్ అంటాడు. ప్రేరణ ఆయనతో మేం అలాంటి వాళ్లం కాదు అంకుల్ కలలో కూడా అలాంటి పని చేయమని అంటుంది. దానికి ఓనర్ అవునా మీరు అంత మంచోళ్లు అయితే నీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడించు అప్పుడు నమ్ముతా అని అంటాడు.. అందరూ సైలెంట్ అయిపోతారు. దాంతో మీరు చేయలేరు ఎందుకంటే ఆయన ఎక్కడున్నారో మీకు తెలీదు అందుకే మీ అమ్మ ఇంత పాడు పని ఎందుకు చేస్తుంది అని ఓనర్ అనడంతో ప్రేరణ కొట్టడానికి చేయి ఎత్తుతుంది. దాంతో ఓనర్ వాళ్ల బ్యాగ్‌లు విసిరేసి మీ తల్లీకూతుళ్లకు సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఏమైనా ఉంటే పది నిమిషాల్లో వెళ్లిపోండి అని బ్యాగ్‌లు విసిరేస్తాడు. వాటిని తీసుకొని ప్రేరణ వాళ్లు వెళ్లిపోతారు. 

మంజుల సిద్ధూ మాటలు తలచుకొని విజయానంద్ తనకు చెప్పకుండా ఆశ్రమం కూల్చేయాలి అనుకున్న విషయం తలచుకొని బాధ పడుతుంది. విజయానంద్ మంజులతో చెప్పుకుండా చేసినందుకు సారీ మంజు కానీ మన పిల్లల భవిష్యత్ కోసమే ఇలా చేశానని అంటాడు. ఇక మంజుల విజయానంద్‌తో అది మా నాన్న ఆశయం.. సిద్ధూకి ఆ ఆశ్రమంతో విడదీయలేని బంధం ఉంది.. అది వాడు బాధ్యతగా ఫీలవుతున్నాడు.. ఇప్పటికే మీకు వాడు ఎలా దగ్గరవుతాడా అని ఆలోచిస్తున్నా.. వాడు ప్రతి చిన్న దానికి మీతో గొడవ పడుతున్నాడు.. ఇప్పుడు ఇలాంటివి జరిగితే మీ మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది. వాడిని బాధ పెట్టడానికే మీరు ఇలాంటివి చేస్తున్నారని వాడు అనుకుంటాడు. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయొద్దని మంజుల అంటే.. నిన్ను పిల్లల్ని కష్టపెట్టే పని ఇంకెప్పుడూ చేయను ప్రామిస్ అని విజయానంద్ అంటాడు. మరోవైపు ప్రేరణ గణ ఇంటికి వస్తుంది. 

గణ: మీరు ఇంకా సిటీలోనే ఉన్నారా ఈ పాటికి ఊరు వదిలేసి వెళ్లిపోయింటారు అనుకున్నానే.

ఈశ్వరి: మీరు ఎందుకు వచ్చారే.

గణ: అమ్మ అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. గణ సార్ గణ సార్ మీ మనుషులు నలుగురు మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసుకున్నారో తెలీదు కానీ మా ఇంటికి వచ్చి మేం బజారు మనుషులు అని డబ్బు కోసం ఏమైనా చేస్తామని నానా మాటలు అని అవమానించి మా సామాను మొత్తం చెదరగొట్టి మమల్ని ఇబ్బంది పెట్టారు. మా ఓనర్ మమల్ని గెంటేశాడు. దీని అంతటికి నా పొగరే కారణం ఊరు వదిలి వెళ్లిపోతాను నన్ను క్షమించండి అని చెప్పడానికి వచ్చింది.ప్రేరణ: ఇప్పుడే కాఫీ తాగినట్లు ఉన్నావ్ ఇంకోటి తాగు నిద్ర మత్తు వదులుతుంది. రాత్రి కల పట్టపగలు కూడా కంటిన్యూ చేస్తున్నావ్ కదా అందుకే చెప్పా.గణ: కలేంటే కల. నేను తలచుకోగానే మీ పరిస్థితి తారుమారు అయ్యింది. అది ఈ గణ అంటే. ప్రేరణ: ఆడవాళ్లకి నీడ లేకుండా చేయడం గొప్పతనం అనుకుంటున్నావా.. మాకు ఎవరూ లేకపోయినా మా తోడు నీడ అన్నీ మా నాన్నే.ఈశ్వరి: ఎవరే నీకు నాన్న ఆ మాట చెప్పే అర్హత కూడా నీకు లేదు పో బయటకి.ప్రేరణ: నేను వచ్చింది మీకు మీ కొడుకుకి హాయ్ చెప్పి వెళ్లిపోవడానికి కాదు. నా తండ్రిని చూసి పలకరించడానికి. గణ: ఎవరు పడితే వాళ్లు పలకరించడానికి మా నాన్న మీలా అడ్రస్ లేని వాడు కాదు. పంతం రాజశేఖరం హజ్బెండ్ ఆఫ్ ఈశ్వరీ. ఫాదర్ ఆఫ్ గణ.ప్రేరణ: నీకు ఫాదర్ ఆఫ్ గణ అయితే డాటర్ ఆఫ్ రాజశేఖరం ఇక్కడ. నీ తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నీ ఎదురుగా నిలబడినా నీకు అర్థం కావడం లేదా నీకు భయపడను అని. మానాన్న మాకు చేయి అందించే వరకు ఎక్కడ నుంచి వెళ్లం.గణ: మీకు చేయి అందించాలి అంటే ఇంకో ఏడు జన్మలు ఎత్తాలి. మా నాన్న పేరు మీ నోట రాకుండా చేయడమే నా గెలుపు.ప్రేరణ: అది గెలుపు కాదు బలుపు. మినిస్టర్‌గారితో నా గురించి తప్పుగా చెప్పించావే అప్పుడే నువ్వు ఓడిపోయావ్. నాకు భయపడి నన్ను ఇంటి నుంచి గెంటేయాలని ప్రయత్నించావే అప్పుడే ఓడిపోయావ్. నీకు తెలీడం లేదు నువ్వు ఓడిపోయావ్.

ఏం చూసుకొనిరా దీనికి ఇంత పొగరు అని ఈశ్వరి అంటే మా నాన్నని చూసుకొని నేను ఇప్పుడు మా నాన్న దగ్గరకు వెళ్తున్నా దమ్ముంటే నన్ను ఆపు అని వెళ్తుంది. గణ చూస్తూ ఉండిపోతాడు. ఎంట్రా ఇది అని ఈశ్వరి అడిగితే నా యూనిఫాం మళ్లీ నాకు వస్తే అప్పుడే నా దమ్ము చూపిస్తా అని అంటాడు.  ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి వీధిన పడిపోయాం కానీ నీ కోసం భరిస్తున్నాం నాన్న. నేను వచ్చి నిన్ను చూస్తున్నా కానీ అమ్మకి ఆ భాగ్యం కూడా లేదు లోపల చాలా బాధ పడుతుంది కానీ పైకి మాత్రం మాతో ఏదో అలా ఉంది.. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు నాన్న అని నుదిటిన బొట్టు పెట్టి జాగ్రత్తగా ఉండు నాన్న అని ఏడుస్తుంది. ప్రేరణ ఏడుస్తూ తండ్రిని హగ్ చేసుకుంటే రాజశేఖరం కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి.

ఇక ప్రేరణ కుంకుమ తీసుకొచ్చి పెద్దమ్మ చేతిలో పెట్టి బొట్టు పెట్టి దేవుడి కుంకుమ రోజు మా నాన్నకి పెట్టండి అలాగే కొంచెం మీ కొడుకుకి పెట్టండి మనిషిలా మారుతాడు అంటుంది. నా ఇంటికే వచ్చి నా కొడుకునే అంటావా అని ఈశ్వరి అంటే ఇప్పుడే కాదు ఇక నుంచి ప్రతి శనివారం, ఆదివారం మా నాన్న దగ్గరకి వస్తూనే ఉంటాను. షాక్ అవ్వకండి మా నాన్న శనివారం, ఆదివారం మాతోనే ఉండేవారు.. ఇప్పుడు నేను వస్తాను. ఇంకో విషయం కొన్నాళ్లు ఒంటరిగా వస్తాను తర్వాత కలెక్టర్‌ అవుతాను కదా బందోబస్తుగా వస్తాను. ఆ బందోబస్తు కూడా మీ అబ్బాయే ఇవ్వాలండీ. మీ అబ్బాయి సెల్యూట్ కొట్టి మా నాన్న దగ్గరకు తీసుకెళ్లాలి.. తీసుకెళ్తాడు అని ప్రేరణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.