Rangula Ratnam June 21th: ఇంటికొచ్చిన రఘు రేఖ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకుందని స్వయంగా నాన్న ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాడు అని చెప్పటంతో సీత, పూర్ణ షాక్ అవుతారు. దాంతో పూర్ణ అదంతా జరుగుతుంటే సిద్దు చూసి ఎలా ఊరుకుంటాడు అని అంటుంది. వెంటనే సీత కూడా మీరు ఆఫీసులో అడుగు పెడితేనే సిద్దు మండిపోతాడు అటువంటిది సిద్దు ఎలా ఒప్పుకున్నాడు అని అంటుంది.


ఇదంతా సిద్దుకు తెలిసే జరిగింది అని అనటంతో షాక్ అవుతారు. వెంటనే పూర్ణ.. ఆ రేఖ మీ నాన్నని ఎలా నమ్మించిందో సిద్దును కూడా అలా నమ్మించిందని అంటుంది. ఇక ఆ విషయం గురించి చర్చ చేస్తుండగా సీత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే నీరు చల్లి లేపగా తన పొద్దటి నుంచి వాంతులు అవుతున్నాయని, కళ్ళు తిరుగుతున్నాయని అంటుంది.


వెంటనే పూర్ణ వాళ్ళను హాస్పిటల్ కి పంపిస్తుంది. మరోవైపు రేఖ ఆఫీసులో ఉండగా సిద్దు కోపంతో వచ్చి రగిలిపోతాడు. నిన్ను నమ్మినందుకు పెద్ద నష్టం తెచ్చావు అని తనపై అరుస్తాడు. ఏం జరిగింది అని రేఖ అడగడంతో.. మనకు రావాల్సిన డీల్ ఆ సూర్యనారాయణ దక్కించుకున్నాడు అని చెప్పటంతో రేఖ షాక్ అవుతుంది. ఇక సిద్దు ఇకపై ఏది చేయాలన్న నన్ను అడిగి చేయాలని కోపంతో చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు.


ఇక రేఖ సూర్యనారాయణ తనను ఓడించడంతో కోపంతో రగిలిపోయి సూర్యనారాయణ ను వదిలి లేదు అని అనుకుంటుంది. ఇక అప్పుడే సూర్యనారాయణ డీల్ సొంతం చేసుకున్న విషయం తెలుసుకొని సంతోషపడతాడు. ఇక ఆ విషయం జానకికి చెబుతాడు. కానీ జానకి మళ్ళీ ఆ రేఖ మీతో గొడవకి వస్తుందేమో అని.. గొడవ కావాలి అని ఇలా చేస్తున్నాను అని.. పూర్ణ సంతోషంగా ఉండాలి అంటే రేఖా ఇంట్లోకించి వెళ్ళిపోవాలి అని.. రేఖ వెళ్లాలి అంటే శంకర్ ఓడిపోవాలి అని అంటాడు.


మరోవైపు హాస్పిటల్లో చెకప్ చేయించుకున్న తర్వాత డాక్టర్ సీత దంపతులకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతుంది. సీత ప్రెగ్నెంట్ అని చెప్పటంతో రఘు సంతోషంతో మునిగిపోతాడు. ఇక ఈ విషయాన్ని వెంటనే అత్తయ్యకు చెప్పాలి అని సీత అనడంతో ఇంటికి వెళ్ళాక చెబుదామని రఘు అంటాడు. ఇక రేఖ ఇంటికి వచ్చాక శంకర్ ముఖం చూసి డీల్ విషయం తనకు తెలియదు అనుకోని.. సిద్దు వచ్చి చెప్పేలోగా తనే మరోలా చెప్పి సింపతి పెంచుకోవాలని అనుకుంటుంది.


దాంతో శంకర్ దగ్గరికి వెళ్లి తన డ్రామా తో శంకర్ ను నమ్మిస్తుంది. ఇక ఆ సూర్యం తీసుకున్న డీల్ గురించి మీకు నాపై కోపం లేదు కదా అనడంతో.. లేదు అని చెప్పటంతో సంతోషపడుతుంది. ఇక శంకర్ సూర్య పై మరింత కోపాన్ని పెంచుకొని తన అంతు చూడాలి అని ఫిక్స్ అవుతాడు. తరువాయి భాగంలో శంకర్ సూర్యం తో కోపంగా మాట్లాడుతాడు. సూర్యం కూడా రేఖ ఆ సీట్లో ఉన్నంతకాలం తనకు ఏ డీల్ దక్కకుండా చేస్తాను అని సవాల్ విసురుతాడు.


Also Read: Rangula Ratnam June 20th: ఆఫీసులో అడుగుపెట్టిన రోజే చుక్కలు చూపిస్తున్న రేఖ.. రఘు చెప్పిన నిజానికి షాకైన పూర్ణ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial