'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్‌లది ఎవర్‌గ్రీన్ జోడీ. వాళ్ళిద్దరికీ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్మాల్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరి లవ్ ట్రాక్స్ సూపర్ హిట్. అసలు, అవి చూస్తే వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అనుకుంటాం. అంతే తప్ప, షో కోసం చేసినట్టు ఎక్కడా అనిపించదు. సుధీర్, రష్మీ పెళ్లి పేరుతో ఒకసారి పెద్ద ఈవెంట్ చేశారు. 'జబర్దస్త్' స్కిట్స్‌లోనూ వాళ్లకు పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజ జీవితంలోనూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆశించారు. అయితే... రష్మీని పక్కన పెట్టేసిన సుధీర్, మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
Also Read: రావాలి సుధీర్... కావాలి రష్మీ! ఫ్యాన్స్ డిమాండ్
అవును... 'సుడిగాలి' సుధీర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అది కూడా రష్మీతో కాదు. మరో అమ్మాయితో! దాంతో ఆ అమ్మాయి ఎవరు? అనే చర్చ మొదలైంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమోలో ఆ ఎంగేజ్‌మెంట్ చూపించారు. అందువల్ల, షో కోసం ఇలా ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేశారేమో అనే సందేహం కొందరిలో కలుగుతోంది. ఈ ప్రోమో హైలైట్ ఏంటంటే... ఎంగేజ్‌మెంట్ మాత్రమే కాదు, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ విజువల్స్ కూడా చూపించారు. బెడ్డు మీద సుధీర్‌ను, ఆ అమ్మాయిని చూపించారు. ప్రస్తుతానికి ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read: వాళ్ళను 'సుడిగాలి' సుధీర్ అన్ని మాటలు అన్నాడా?