గుప్పెడంత మనసు మార్చి3 గురువారం ఎపిసోడ్
కాలేజీలో షార్ట్ ఫిలిం పూర్తైన తర్వాత రిపోర్టర్ జగతి వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడటంతో కోపంతో ఊగిపోయిన మహేంద్ర...జగతి నా భార్య, రిషి మా కొడుకు అని స్టేజ్ పై చెబుతాడు. దాంతో అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయిన రిషిని వెతుక్కుంటూ వసుధార వెళుతుంది.. నిన్నటి ఎపిసోడ్ ఇక్కడ ముగిసి..ఈ రోజు ఎపిసోడ్ వాళ్లిద్దరి డైలాగ్స్ తో మొదలైంది.
రిషి:  షార్ట్ ఫిల్మ్ సందర్భాన్ని అవకాశం కోసం వాడుకున్నారు మీ మేడం 
వసుధార: మీరు చిన్నప్పటి నుంచీ తప్పుగానే ఆలోచిస్తున్నారు. మేడంలో స్వార్థ్యం లేదు..ఆవిడ అలా ఉండాలనుకుంటే ఇంత బాధపడేవారు కాదు. అందరి ముందు అన్ని ప్రశ్నలు వేస్తున్నా, గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నా ఒక్కమాట కూడా మేడం బ్యాలెన్స్ తప్పి మాట్లాడలేదు. మేడం అందరిలా స్వార్థపరురాలే అయితే ఇదే అవకాశంగా భావించి అందరకీ తనే చెప్పేవారు కదా సార్..కానీ మేడం అలా చెప్పలేదు, అవకాశం వచ్చినా మనసు,మాట కంట్రోల్ చేసుకున్నారు..అదీ మేడం అంటే..ఇందులో మీకు స్వార్థం-అవకాశవాదం ఎక్కడ కనిపించింది..తను మీ స్థాయిని గౌరవాన్ని కాపాడేందుకే ప్రయత్నించింది... ఇన్నాళ్లూ కాపాడుతూనే వస్తోంది సార్ 
రిషి: ఏం కాపాడారంటూ అరుస్తాడు. మా డాడ్ ఇలా అందరిముందూ చెప్పే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు
వసు: చెప్పింది మహేంద్ర సార్, మేడం కాదు... ఇందులో ఎవరి తప్పు లేదు
రిషి: మీ మేడం గొప్ప సహనశీలి, ఆవిడ దేవత...అది ఇదీ అంటూ గొప్పలు చెప్పడానికి వచ్చావా
వసు: చెరకు తీపి, గంధం పరిమళం గురించి చెప్పాల్సిన అవసరం లేదు
రిషి: అంత గొప్ప వ్యక్తే అయితే డాడ్ చెబుతుంటే ఆపొచ్చు కదా ఎందుకు ఆపలేదు, ఇలాంటివేవో జరుగుతాయన్న భయంతోనే ముందుగా నేను హెచ్చరించాను, కానీ ఆవిడ వినలేదు
వసు: ఎవరికి ఎవరు దూరంగా ఉండమన్నారో నేను అర్థం చేసుకోగలను..కానీ అదో గొప్పగా భావిస్తున్నారు కానీ అది ఎంత ఘోరమైన ఆలోచనో ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. 
రిషి: అవకాశం డాడీ ఆవేశం రూపంలో వచ్చింది వాడుకున్నారు, ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు, తనకి కావాల్సింది అదేగా, తను ఎదురుచూసింది ఇది జరగాలనే కదా
వసు: మీరు ఎందుకింత తగ్గిపోయి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ... మేడం నిజంగా కోరుకుని ఉంటే తను ఎప్పుడో తేల్చుకునేవారు, తన హక్కుని సాధించుకునేవారు కానీ స్వార్థంగా ఆలోచించించడం తనకి తెలియదు, ఎదుటివారిని నొప్పించడం తెలియదు, ఇరవై ఏళ్లకు పైగా అగ్నిపర్వతాన్ని మోస్తూ తిరిగారు, మీరన్న స్వార్థమే తనకు ఉండిఉంటే ఇన్నాళ్లూ ఎందుకు ఆగారు
రిషి: ఏమో ప్రయత్నించలేదేమో అవకాశం రాలేదేమో, డాడ్ మనసు తెలుసు కదా- కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతారని...ఊహించే ఇదంతా చేసి ఉండొచ్చు కదా 
వసు: చెప్పడానికి మీకెలా ఉందోకానీ వినడానికే ఏదోలా ఉంది ఇక ఆపండి సార్


ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్... ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు. నేను ఎక్కడున్నానో,ఏం చేస్తున్నానానో నీకు చెప్పాలా-నీ పర్మిషన్ తీసుకోవాలా అని ఫైర్ అవుతాడు రిషి. ఇక్కడున్న విషయం నువ్వైనా చెప్పొచ్చుకదా మనిద్దరం రిషి కోసం చూశాం కదా అనేసి..ఇప్పుడేమన్నా అందరికీ కోపాలొస్తాయి పద వెళ్లి కాఫీ తాగుదాం రా అని పిలుస్తాడు. నీకు వెళ్లాలనిపిస్తే వెళ్లు అని రిషి అంటే..జరిగిందేదో జరిగిపోయింది లైట్ తీసుకో అంటాడు. ఎలా తీసుకోమంటావ్ అని రిషి అంటే..జగతి మేడం మీ అమ్మ అని నాక్కూడా చెప్పలేదేంటిరా..చిన్నప్పటి ఫ్రెండ్ ని రా అని గౌతమ్ అంటే..తను మా అమ్మ కాదు కాదు కాదు అని అరుస్తాడు.  


Also Read: అడ్డంగా నరికేస్తానంటూ ఫ్యాక్షన్ డైలాగ్ పేల్చిన వంటలక్క, తమ్ముడి కోసం హిమ వీరంగం
ఫణీంద్ర-దేవయాని
ఛీఛీ ఇంటి పరువు తీసేశారు, భూషణ్ ఫ్యామిలీ అంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద, కాలేజీకి అంత గొప్ప పేరుంది..రిషిని తలెత్తుకోకుండా చేశారు, నేను మొత్తుకుంటూనే ఉన్నాను జగతిని కాలేజీకి తీసుకురావొద్దని...కాలేజీ విషయాలు వేరు ఇంటివిషయాలు వేరని నా నోరు మూయించారు, మహేంద్రకి చెప్పినా వినలేదు, జగతి వినలేదు, రిషి కూడా వినలేదంటుంది. నీకేదో అవకాశం దొరికింది కదా అని మాట్లాడకు అని దేవయానిపై ఫైర్ అవుతాడు. ఇంత జరిగాక కూడా మీరు కళ్లు తరెవలేదంటే నాకు అర్థమవుతోందన్న దేవయానితో..నువ్వు కామ్ గా కూర్చుంటే కారు పోనిస్తాను, ఈ విషయం రిషి-మహేంద్రతో మాట్లాడితే బావోదని హెచ్చరిస్తాడు. మావయ్యగారూ రిషి అని అన్న ధరణితో...మనసులో భారం తగ్గాక వాడే వస్తాడు మీరెవ్వరూ కాల్ చేయొద్దని చెబుతాడు.


జగతి ఇంటి దగ్గర
జగతి కారుని ఫాలో అవుతూ ఇంటికి వస్తాడు మహేంద్ర. లోపలకు అడుగుపెడుతుండగా ఆగు మహేంద్ర ఆ గుమ్మం దాటి లోపలకు రావొద్దంటుంది. నన్ను ఈ గుమ్మం దాటి లోపలకు రావొద్దంటున్నావా అంటే ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది..వెళ్లిపో..ఇంకెప్పుడూ రావొద్దంటుంది. 
మహేంద్ర: ఏం మాట్లాడుతున్నావ్..నన్ను రావొద్దంటున్నావ్ ఏంటి
జగతి: ఇరవై ఏళ్లుగా ఒంటరిగా ఏడుస్తున్నాను, ఇంకా ఏడిపించాలని ఉందా
మహేంద్ర: నేనేం చేశాను జగతి
జగతి: నువ్వే చేశావ్..ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది అది కూడా నీవల్లే..ఇన్నాళ్లూ రిషి మనసు బాధపెట్టొద్దనే కదా అన్ని బాధలూ ఓర్చుకున్నా, దేవయాని అక్కయ్య ఎన్ని మాటలన్నా పడ్డాను, ఎంత అవమానించినా పడ్డాను, రిషిని నేను సార్ అని నన్ను మేడం అంటున్నా భరించింది రిషి కోసమే కదా..ఎక్కడో నా బతుకు నేను బతుకుతుంటే తీసుకొచ్చి కాలేజీలో చేర్పించావు అదీ నువ్వు చేసిన పొరపాటు..దానికి ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు...ఇన్ని భరించింది రిషికి నావల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనే కదా అంటుంది.
మహేంద్ర: స్టాపిట్ జగతి..జస్ట్ స్టాపిట్... రిషి ఒక్కడే లోకమా... వాడు నీకు లోకం అవడం కాదు..నువ్వే వాడికి లోకం చూపించావ్...రిషి లేనప్పుడు కూడా జగతి ఉంది...జగతి లేకుండా రిషి లేడు..
జగతి: ఎందుకింత ఆవేశం..ఈ ఆవేశంతోనే ఆడిటోరియంలో తొందరపడ్డావ్
మహేంద్ర: ఆవేశం కాదు..ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను..అన్నన్ని ప్రశ్నలు వేస్తుంటే కశ్చీఫ్ తో కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడ్వాలా, జగతి ఈ మహేంద్ర భూషణ్ భార్య అని చెప్పాలా వద్దా, నువ్వే చెప్పు, మాట్లాడవేంటి. అక్కడ బాధపడి...ఇక్కడ మళ్లీ తలుచుకుని బాధపడి...కాఫీ తాగి ఇంటికెళ్లిపోతాను. నువ్వు బాధపడుతూ నిద్రపోతావ్...తెల్లారితే మళ్లీ మామూలే..ఏంటి జగతి ఇది.. ఇంతేనా .. కాదు కదా..అందరి ముందూ నీలా తలదించుకుని ఉంటే కనుక నేను భర్తగా కాదు జగతి మనిషిగా కూడా చచ్చిపోయేవాడిని. ఒకప్పుడు నువ్వు వెళుతుంటే కొన్ని కారణాల వల్ల నిన్ను ఆపలేకపోయాను, నీ వెంట రాలేకపోయాను, దానిమూల్యం మన ముగ్గురి జీవితాలు జగతి...ఈ రోజు కూడా నేను మాట్లాడకపోయిఉంటే నాపై నాకే అసహ్యం వేసేది...జగతి..రిషి బాధపడతాడు నిజమే అంతమాత్రాన నేను-నువ్వు కూడా బాధపడడం కరెక్ట్ కాదు కదా అందరి ముందూ నేను కూడా మాట్లాడకపోతే...అందరి ప్రశ్నలు, అందరి అనుమానాలు నిజమవుతాయ్ జగతి. అందరి ముందూ నిజం చెప్పి తప్పు చేయలేదు..ఇప్పటికే ఆలస్యం చేశాను అనుకుంటున్నాను... రిషి పెద్దవాడయ్యాడు, వాడు వాడి పిల్లలు ప్రపంచం వేరే ఉంటుంది...అప్పటికి కూడా నువ్వు నేను ఇలా బాధపడుతూ, భయపడుతూనే ఉందామా...రెక్కలొచ్చాక పక్షి పిల్లలు ఎగిరిపోతాయ్...ఒంటరిగా తల్లి పక్షి గూడులో మిగిలిపోతుంది, జీవితం అంతే జగతి..నా కళ్ల ముందు నా భార్యని అన్నారు జగతి... రిషి వాళ్ల అమ్మను కాదు అన్న మహేంద్ర మాటలు విని జగతి హగ్ చేసుకుని ఏడుస్తుంది.


Also Read: ఎనీ క్వశ్చన్స్ అంటూ మహేంద్ర ఆవేశం, జగతి మౌనం - బుధవారం ఎపిసోడ్ అదిరింది
రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
రిషి సార్ ది చాలా సున్నితమైన మనస్తత్వం...అన్ని విషయాల్లో బావుంటారు కానీ మేడం విషయానికి వచ్చేసరికి అంచనాలకు అందరు సార్ అని వసుధార..గౌతమ్ తో ఫోన్లో మాట్లాడుతుంది. ఇంట్లోకి ఎంటరైన మహేంద్రతో..ఏంటి మాట్లాడకుండా వెళుతున్నావ్ అని ఆపుతుంది దేవయాని. ఇక్కడ ఎవ్వరూ ఎవరికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు..నేను చేసిన దానికి నేనేం ఫీలవడం లేదు..జగతి నా భార్య అని చెప్పినందుకు నేను గర్వపడుతున్నాను అంటాడు మహేంద్ర.