Prema entha madhuram October 6th: జలంధర్ ఆ ఐదుగురు మనుషులలో ఆర్య ఎవరో అని వెతుకుతూ ఉంటాడు. ఓడిపోయిన ప్రతిసారి జెండే జలంధర్ చేత గుంజీలు తీయిస్తూ ఉంటాడు. అందరి మాస్కులు తీసి చూడగా అక్కడ ఎక్కడా ఆర్య ఉండడు.


జలంధర్: ఇక్కడ ఆర్య లేడు నన్ను మోసం చేస్తున్నారు అనగానే అప్పుడే ఆర్య జలంధర్ తో పాటు అక్కడికి వస్తాడు.


జెండే: ఆర్య నీలా పిరికిపంద కాదు జలంధర్, పారిపోవడానికి. ఏదైనా ధైర్యంగా ఎదురుకుంటాడు.


ఆర్య: లేనిపోని అనుమానాలతో నా మనసు బాధ పెట్టావు అందుకే బావ బావమరిదిలం కదా చిన్న ఆటాడు అంతే.


జలంధర్: లేదు ఇంక నాకు అనుమానాలు అన్ని తీరిపోయాయి మనశ్శాంతిగా ఉంది రండి వెళ్దాము అని అంటాడు.


మరోవైపు రోహిత్ తన గదిలో టెన్షన్ గా ఉంటాడు. ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు.


ఆర్య: టెన్షన్ గా ఉందా?


రోహిత్: కొంచెం సార్


Also Read: వేడుకగా వినాయక చవితి సంబరాలు- ముకుంద మనసులో కోరిక భవానీకి తెలిసిపోతుందా!


ఆర్య: ఏం పర్వాలేదు మనం అనుకున్నదే అవుతుంది అని అంటాడు. ఇంతలో రోహిత్ ఆ అమ్మాయి గురించి చెబుదాం అనుకునే లోగా అక్కడికి జెండే వస్తాడు.


జెండే: కింద టైం అవుతుంది ఆర్య. నిన్ను పిలుస్తున్నారు పదా అని అక్కడి నుంచి ఆర్య ని తీసుకొని వెళ్ళిపోతాడు.


ఆర్య తన మొఖాన్ని పూలదండలతో కప్పుకుంటూ కిందకి వస్తాడు.


జలంధర్: అదేంటి బావ మీరు ధైర్యంగా అందరి ముందు రావాలి కానీ ఇలాగ పూల వెనకాతల మొఖాన్ని దాచుకోవడం ఏంటి? కొంపతీసి మమ్మల్ని ఫూల్స్ చేసే ప్లాన్ లో ఏమైనా ఉన్నారా? మీ ముఖం చూపించే వరకు నేను మీరు అని నమ్మను మా అందరిని మోసం చేద్దామనుకుంటున్నారా అని ఆ పూల దండం తీసి చూసేసరికి అక్కడ ఆర్య ముఖమే ఉంటుంది.


ఆర్య: నువ్వు లేనిపోని అనుమానాలతో వస్తే నాకు చిరాకుగా పుట్టి డెసిషన్ మార్చుకుంటే మీకు ఎంత నష్టమో గుర్తుంది కదా?


జెండే: ఇప్పటికైనా నీ భయం వదిలితే బయలుదేరుదాము అని జలంధర్ తో చెప్పి ఆర్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.


ఈ దృశ్యం అంతటినీ ఒక మూల నుంచి చూస్తున్న అను గుండె పగిలినంత పని అవుతుంది.


Also Read: రాజ్ కి ముద్దు పెట్టిన కావ్య- ప్రెగ్నెంట్ నాటకానికి చెక్ పెట్టబోతున్న స్వప్న!


ఆర్యని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పూజలు చేపిస్తారు పూజారి గారు. మరోవైపు ఛాయాదేవిని కూడా ముస్తాబు చేసి పెళ్లి పీటలు వరకు తీసుకుని వస్తారు.


మాన్సి: మన టార్గెట్ ఇంకొన్ని అడుగులు మాత్రమే అని అనగా దానికి ఛాయాదేవి నవ్వి ఆర్య పక్కన కూర్చుంటుంది.


ఆర్య: మనిద్దరం ఇంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఈ పూల వెనకతలు దాచుకోవడం ఏంటి నాకు నచ్చలేదు. ఇంతకీ అది నువ్వే కదా అని పూలను పక్కకు జరిపి ఆర్య ని చూసి అప్పుడు మనశ్శాంతిగా పూజ మళ్ళీ కొనసాగిస్తుంది.


మరోవైపు సుబ్బు ,పద్దులు ఆటో దిగి లోపలికి రావడానికి చూస్తారు.


జలంధర్: ఏంటి మీ అల్లుడు పెళ్లి అయితే మాత్రం వచ్చేస్తారా? మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా?


సుబ్బు: నేను గెస్ట్ల లాగ రాలేదు మా అల్లుడు మోసగాళ్ల దగ్గర మోసపోతుంటే కాపాడుకోవడానికి వచ్చాము ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్లి ఆపిద్దామని వచ్చాము.


జలంధర్: మేము మిమ్మల్ని లోపలికి పంపిస్తాం అనుకుంటున్నారా?


పద్దు: మేమే లోపలికి వెళ్తాము మేమిద్దరమే మాకు ధైర్యం అని లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న బాడీగార్డ్లు వాళ్ళని ఆపుతారు. 


జలంధర్: ఆగండి రా వాళ్లని వెళ్ళనివ్వండి వాళ్లేం చేస్తారో మనము చూద్దాం అని ఇద్దరినీ లోపలికి పంపుతాడు జలంధర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Join Us On Telegram: https://t.me/abpdesamofficial