Krishna Mukunda Murari Serial October 6th: ముకుంద కనిపించడం లేదేంటి? ఏసీపీ సర్ కనిపించకపోవడానికి తనకి ఏమైనా సంబంధం ఉందా అని కృష్ణ మధుకర్ ని పిలిచి అడుగుతుంది. అదేం లేదులే అంటాడు. భవానీ మురారీ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మేజర్ ఆదర్శ్ గురించి ఏం చెప్తాడోనని ఆందోళనగా ఉందని భవానీ రేవతితో అంటుంది. ఆదర్శ్ వచ్చిన కూడా ముకుంద మారదని, ఇవాళ కాకపోతే మరొక రోజు అయినా తను ఎలాంటిదో పెద్దత్తయ్యకి తెలిసేలా చేయాలని కృష్ణ అనుకుంటుంది. మురారీ అప్పుడే ఇంటికి వస్తే భవానీ ఆత్రంగా కొడుకు గురించి ఆలోచిస్తుంది.


మురారీ; మొన్న కల్నల్, మేజర్ ఆదర్శ్ ని కలిశారంట. నచ్చజెప్పడానికి చూశారు తనకి కొంచెం టైమ్ కావాలని అడిగాడంట. కానీ తనకి ఎలాగైనా నచ్చజెప్పి ఇంటికి పంపించే బాధ్యత తనదని కల్నల్ ప్రామిస్ చేశాడు అని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు


భవానీ: మంచి మాట చెప్పావ్ ముకుంద విన్నావ్ కదా ఇక హ్యాపీగా పండుగ చేసుకోవచ్చు


Also Read: రాజ్ కి ముద్దు పెట్టిన కావ్య- ప్రెగ్నెంట్ నాటకానికి చెక్ పెట్టబోతున్న స్వప్న!


కృష్ణని ఎలాగైనా కన్వీన్స్ చేయాలని మురారీ అనుకుంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ముకుందతో కలిసి వెళ్ళావా అని మధుకర్ అడుగుతాడు. కలిసి వెళ్లలేదు కల్పించుకుని వచ్చిందని చిరాకుగా చెప్తాడు. ఇక గణేషుడి విగ్రహం తీసుకుని పెద్దపల్లి ప్రభాకర్ డప్పుల మోత పుట్టిస్తూ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంట్లో అందరూ బయటకి వస్తారు. కృష్ణ కూడ తన చిన్నాన్నతో కలిసి గంతులు వేస్తుంది. మురారీ కృష్ణని పక్కకి పిలిచి మాట్లాడాలని అంటాడు. కానీ కృష్ణ మాత్రం పట్టించుకోదు. వాళ్ళని గమనించిన ప్రభాకర్ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మరి ముకుంద ఏంటి అలా ఉందని అనుకుంటాడు. గణేషుడి విగ్రహానికి హారతి ఇస్తారు. పండుగ ఏర్పాట్లు అన్నీ చేస్తానని హడావుడి చేస్తాడు. భవానీ వెళ్ళిపోయిన తర్వాత ముకుందని పిలుస్తాడు.  


ప్రభాకర్: మీ నాన్నకి ఫోన్ చేసి పండగకి ఇంటికి రమ్మని పిలువు


ముకుంద: అవసరం లేదు నేను రమ్మని చెప్పను అనేసరికి అందరూ షాక్ అవుతారు


ప్రభాకర్: పండగ అంటే అందరూ ఉంటే బాగుంటుంది


ముకుంద: అయినా మా నాన్నతో ఏం పని వచ్చారు పండగ చేసుకుని వెళ్ళవచ్చు కదా


కృష్ణ: ముకుంద వాళ్ళకి ఎప్పుడు వెళ్లాలో బాగా తెలుసు నువ్వు అనవసరంగా కలుగ చేసుకోవద్దు


ముకుంద: నా విషయంలో కూడా కలుగజేసుకోవద్దని చెప్పు


కృష్ణ: మీ నాన్న ఇవాళ వస్తాడు


ముకుంద; నేను పిలిస్తేనే కదా వచ్చేది అది జరిగే పని కాదు


Also Read: రిషి విశ్వరూపం - వసు వార్నింగ్ - వణికిపోయిన దేవయాని , శైలేంద్ర!


కృష్ణ: నాన్న ఇంటికి రా అని నీ నోటితో పిలిచేలా చేస్తాను


ముకుంద: నేను నా ప్రాణం పోయినా పిలవను


కృష్ణ: ఈరోజు నీ నోటితోనే మీ నాన్నని పిలిచేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది


వినాయక పూజకి సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేస్తారు. కృష్ణ పూజ చేయడం కోసం పంతులు అవతారం ఎత్తుతుంది. కృష్ణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ముకుంద మనసులో అనుకుంటుంది. పూజ దగ్గర కృష్ణ మురారీ మీద రుసరుసలాడుతుంది. వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం చూసి ముకుంద రగిలిపోతుంది. వినాయకుడి కథ చదువుతుంది కృష్ణ. అయిపోయిన తర్వాత అందరినీ అక్షింతలు తల మీద వేసుకోమని చెప్తారు. పూజ తర్వాత చీటీలు బౌల్ లో వేయమని చెప్తుంది. అందరూ తమ మనసులో కోరిక రాసి బౌల్ లో వేస్తే ఒక్కొక్క చీటీ చూసి భవానీని చదవమని చెప్తుంది.


తరువాయి భాగంలో..


అందరి చీటీలు భవానీ చదువుతుంది. మురారీ కృష్ణతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాస్తాడు. ముకుంద మురారీ భర్తగా రావాలని కోరుకుంటున్నట్టు రాస్తుంది. అది భవానీ దేవి చదివేస్తుంది. బాంబ్ పేలబోతుందని ముకుంద సంతోషపడుతుంది.