Jagapathi Babu Jayammu Nischyammura Show Sreeleela Latest Promo: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఓవైపు విలన్‌గా మరోవైపు టీవీ షోస్ ద్వారా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్న ఆయన తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' షో ద్వారా ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు. ఈ షోలో స్టార్ హీరోస్, టాప్ సెలబ్రిటీలు వాళ్ల సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటున్నారు. 

Continues below advertisement


ఇటీవల ఈ షో ప్రారంభం కాగా ఫస్ట్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున సందడి చేశారు. తన కెరీర్, పిల్లలు, మూవీస్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ షోలో సందడి చేశారు. 


అల్లరే అల్లరి


ఒకరు సీనియర్ టాప్ హీరో... మరొకరు టాలీవుడ్ యంగ్ బ్యూటీ. ఈ ఇద్దరూ టాక్ షో చేస్తే ఇక అల్లరే అల్లరి అన్నట్లుగా సాగింది రెండో ఎపిసోడ్. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. 'అచ్చ తెలుగు ఆడపిల్ల... మన శ్రీలీల' అంటూ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూనే... మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావ్.' అని హైప్ ఇవ్వగా... 'సార్ తిట్టారా పొగిడారా' అంటూ అల్లరి చేశారు శ్రీలీల.


''గుంటూరు కారం' చేసేటప్పుడు లెఫ్ట్‌లోనో రైట్‌లోనో కొంచెం తేడా ఉండేది ఫేస్' అంటూ ఆట పట్టించారు జగపతిబాబు. 'ఆ టాపిక్ తీసుకొస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా సార్' అంటూ శ్రీలీల చెప్పగా... ఏ టాపిక్ అంటూ జగపతిబాబు ప్రశ్నిస్తారు. 'మీ హీరోయిన్ గారు.. మీరు...' అంటూ వేలు చూపించడంతో నవ్వులు పూయించారు.



Also Read: సూర్య మూవీలో బాలీవుడ్ యాక్టర్ - డైరెక్టర్ వెంకీ అట్లూరి ఏం చెప్పారంటే?


దూల తీరిపోతుంది సార్


'ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్' అంటూ జగపతిబాబు అప్రిషియేట్ చేయగా... 'దూల తీరిపోతుంది సార్' అంటూ నవ్వులు పంచారు శ్రీలీల. 'నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా' అంటూ జగ్గూ భాయ్ అనగా... శ్రీలీల తల్లి షోలో మెరిశారు. 'మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సార్' అంటూ శ్రీలీల చెప్పగా... 'నువ్వెందుకు అంతగా సిగ్గు పడుతున్నావ్' అని జగపతిబాబు అనడం సందడి పెంచింది. ఇద్దరూ కలిసి షోలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. 






తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, జీ తెలుగులో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.