Director Venky Atluri Reacts On Bollywood Actor Anil Kapoor In Suriya Movie: కోలీవుడ్ స్టార్ సూర్య, వెంకీ అట్లూరి మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఓ కీలక పాత్ర కోసం ఆయన్ను టీం సంప్రదించారనే ప్రచారం సాగింది. తాజాగా దీనిపై డైరెక్టర్ వెంకీ అట్లూరి రియాక్ట్ అయ్యారు. 

అలాంటివి షేర్ చెయ్యొద్దు

ఈ మూవీలో అనిల్ కపూర్ నటించడం లేదని డైరెక్టర్ వెంకీ స్పష్టం చేశారు. ఆయన్ను తాము సంప్రదించామన్న వార్తలను ఆయన ఖండించారు. 'మేము అనిల్ కపూర్‌ను కలవలేదు. కనీసం ఫోన్ కాల్‌లో కూడా మాట్లాడలేదు. అయినా కూడా ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయండి.' అంటూ క్లారిటీ ఇచ్చారు. 

అయితే, 45 ఏళ్ల క్రితం 1980లో బాపు తీసిన 'వంశవృక్షం' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్. ఆ మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్‌వైపు మళ్లారు. మళ్లీ ఇప్పుడు ఈ మూవీతో ఆయన టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అటు, సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారగా తాజాగా ఆయన నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.

Also Read: బిగ్ బాస్ అగ్నిపరీక్ష... హౌస్‌లో ఎంటరైన 15 మంది వీళ్ళే - ప్రోమోలో ఫేస్‌లతో సహా రివీల్

సూర్య కెరీర్‌లో ఇది 46వ సినిమా కాగా... మూవీలో ఆయన సరసన ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... సూర్యపై ఓ సోలో సాంగ్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేశారనే ప్రచారం సాగుతోంది. మూవీని భారీ బడ్జెట్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

టైటిల్ అదేనా?

ఈ మూవీకి 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలని టీం అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో ఆసక్తికర స్టోరీతో సూర్య ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఇది డైరెక్ట్‌గా తెలుగులో ఫస్ట్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సార్, లక్కీ భాస్కర్ మూవీస్‌ హిట్స్‌తో మంచి క్రేజ్‌లో ఉన్న డైరెక్టర్ ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. సూర్య రీసెంట్ మూవీ 'రెట్రో' తమిళంలో మంచి రెప్సాన్స్ అందుకున్నా తెలుగులో అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ విత్ స్టార్ హీరో... సూపర్ హిట్ కాంబోతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.