Chinni Serial Today Episode మహి డల్‌గా కూర్చొవడం నాగవల్లి చూసి ఏమైందని వసంత వాళ్లని అడుగుతుంది. శ్రేయ వచ్చి చాలా సేపటి నుంచి అలాగే కూర్చొన్నాడని అంటుంది. వసంత నాగవల్లితో ఇంట్లో అందరి పరిస్థితి బాలేదు వరలక్ష్మీ వ్రతం చేసుకుందామని అంటుంది. వల్లి సరే అంటుంది. శ్రేయ తన ఫ్రెండ్స్‌ని పిలుస్తానని అంటుంది. వల్లి సరే అంటుంది. 

నాగవల్లి మహి దగ్గరకు వెళ్లి ఏం ఆలోచిస్తున్నావ్ చిన్ని గురించేనా అని అడుగుతుంది. అంతకు మించి ఏం ఉంటుంది అని అడుగుతాడు మహి. దానికి వల్లి చిన్ని గురించి ఆలోచించడానికి కూడా ఏం ఉంది నీకు 3 నెలల టైం ఇచ్చాను కదా ఆ గడువులో చిన్ని కనిపిస్తే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తా లేదంటే నువ్వు శ్రేయని పెళ్లి చేసుకోవాలి అంతే అని అంటుంది. అంతే అని నువ్వు చాలా ఈజీగా చెప్పావు కానీ నేను అంత ఈజీగా తీసుకోలేను మమ్మీ.. 3 నెలల్లో చిన్నిని వెతికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అని అంటాడు. రాత్రి లోహిత ముందు పుస్తకాలు వేసుకొని ఫోన్ చూస్తుంటుంది. ఇంతలో శ్రేయ కాల్ చేసి వరలక్ష్మీ వ్రతం ఉంది కుదురుతుందా అని అడుగుతుంది. దాంతో కుదురుతుందా.. ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో కాలు పెడతానా అని వెయిట్ చేస్తున్నాఅంటుంది. అదేంటి అని అడిగితే లోహిత కవర్ చేస్తుంది. ఇక శ్రేయ మీ అమ్మ, అన్నని తీసుకురా అని అంటే వాళ్లు చెన్నై వెళ్లారని అంటుంది. లోహిత ఎగిరి గంతేసి ఆ ఇంటి వాళ్లని ఇంప్రెస్ చేసి ఆ ఇంటికి కోడలు అయిపోవాలి అని అనుకుంటుంది. 

మధు కూడా పూజ చేసి అందరికీ వాయినాలు ఇస్తుంటుంది. ఇంటి ఇంటికి వెళ్తూ వాయినాలు ఇస్తుంటుంది. పంతులు బయటకు వెళ్లాలని టైం అయిపోతుందని కంగారు పడుతుంటారు. మధు చూసి ఏమైంది అని అడిగితే ద్రాక్షారామంలో మినిస్టర్ ఇంట్లో పూజకి ఇవ్వాలి లేట్ అయిపోతుంది అని అంటుంది. మధు డ్రాప్ చేస్తానని అంటుంది. మధు పంతుల్ని మహి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. నాగవల్లి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. మహి కిందకి వస్తాయి. మహిని చూసి శ్రేయ కన్నార్పకుండా అలా చూస్తూ ఉంటుంది. నాగవల్లి చూసి శ్రేయ చెవి మెలేసి ఏంటి నా కొడుకుని అలా చూస్తున్నావ్ అంటుంది. ఇంకా 3 నెలల్లో బావ నా మొగుడు అయపోతాడు కదా అత్త అని నా బావ బంగారం అని అంటుంది. 

లోహిత అందంగా రెడీ అయి బిల్డప్‌ కోసం కారులో వస్తుంది. మా అత్తారిల్లు చాలా పెద్దదే అని తన ఫ్రెండ్‌తో చెప్తుంది. శ్రేయ వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది. లోహిత ఇళ్లు చూసి లోపలికి వెళ్తూ వరుణ్‌తో తనకు పెళ్లి అయినట్లు కల కంటుంది. తరువాతే తేరుకొని అందరికీ విష్ చేస్తుంది. లోహితకు శ్రేయ తన ఫ్యామిలీని పరిచయం చేస్తుంది. లోహిత అందర్ని విష్ చేసి నాగవల్లిని చూసి మిమల్ని ఎక్కడో చూసినట్లు ఉందని అంటుంది. శ్రేయ లోహితతో మా అత్తయ్య ఆఫ్ మినిస్టర్ టీవీలో చూసుంటావులే అని అంటుంది. లోహిత నాగవల్లి, వసంతల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. శ్రేయ లోహిత వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ అని చెప్తుంది. నాగవల్లి డిటైల్స్ అడిగితే లోహిత వాళ్లది ఫారెన్ బిజినెస్ అని కవర్ చేస్తుంది. ఇంతలో మ్యాడీ ఫోన్ వచ్చి బయటకు వెళ్తాడు.

లోహిత శ్రేయతో మాట్లాడి మన శత్రువుని పిలిచావా అని అడుగుతుంది. చచ్చినా దాన్ని పిలవను అని అంటుంది. బయట మహి కాల్ మాట్లాడుతుంటాడు. అప్పుడే మధు పంతుల్నిఅక్కడ డ్రాప్ చేస్తుంది. అక్కడే దేవా ఫొటో ఉన్నా చూడదు. ఇంతలో మహి మధుని చూసి పిలుస్తాడు. మధు మహిని చూస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. నువ్వేంటి ఇలా అని మహి అడిగితే మీ ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన పంతులుకి డ్రాప్ చేయడానికి వచ్చానని అంటుంది. అందరికీ సాయం చేయడమే నీ పనా ఇప్పుడు నాకు ఇంకోసాయం చేయు అని అంటాడు. ఏంటని మధు అడుగుతుంది. మా ఇంటి పూజకి రమ్మని అంటాడు. మరీ పిలవలేదు కదా వద్దు అని మధు అంటే సరే ఆగు కుంకుమ తీసుకొస్తా అంటాడు. అవసరం లేదని మధు లోపలికి వెళ్తుంది. మధు కూడా దేవా ఫొటో చూడదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.