Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చేస్తారు. శ్రీవల్లి తన భర్తతో కలిసి వ్రతం చేస్తానని అంటుంది. నర్మద, ప్రేమలు వల్లి దగ్గరకు వెళ్లడం చూసి ఏం గొడవ చేస్తారో అని వేదవతి టెన్షన్ అయిపోతుంది. నేను మాట్లాడుతా మీరు ఆగండే అని ఇద్దరు కోడళ్లతో చెప్పినా ఇది మా తోటి కోడళ్ల విషయం మేం చూసుకుంటా అని అంటారు. దాంతో రామరాజు కూడా వేదవతిని ఆపేస్తాడు.

నర్మద, ప్రేమలు వల్లీ దగ్గరకు వెళ్లి నువ్వు వ్రతం చేస్తా అంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అక్క అసలే నువ్వు ఇంటికి పె...ద్ద కోడలివి కదా నువ్వే వ్రతం చేయ్ అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. భాగ్యం మనసులో నట్టింట్లో రణరంగం అవుతుంది అనుకుంటే వీళ్లేంటి ఇలా షాక్ ఇచ్చారు అనుకుంటుంది. నర్మద వల్లితో నువ్వు పూజ చేస్తే ఏంటి మేం పూజ చేస్తే ఏంటి అక్క నువ్వు ఈ ఇంటి  పెద్ద కోడలివి నువ్వే పూజ చేయ్‌ అక్క అని వల్లిని పట్టుకొని పద అక్క అని తీసుకెళ్తారు. పంతులు నగలు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టమని అంటారు. నర్మద వల్లితో విన్నావు కదా అక్క నగలు పెట్టాలంట వెల్లి మన నగలు తీసుకొద్దాం పద అని అంటుంది. వల్లి, భాగ్యం బిత్తరపోతారు. 

వల్లి మనసులో దేవుడా ఇదా వీళ్ల ప్లాన్ అందులో గిల్ట్ నగలతో పాటు ప్రేమ నగలు కూడా ఉన్నాయి దొరికిపోతే నన్ను గెంటేస్తారు ఇప్పుడెలారా దేవుడా అని వల్లి గదిలోకి వెళ్లి దొరికిపోయా అని అరుస్తుంది. భాగ్యం, ఆనంద్ రావు కూడా వెళ్తారు. నా జీవితం అయిపోయింది నా కు ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం లక్షలు లక్షలు విలువ చేసే నగలు అని చెప్పి నన్ను ముంచేశావ్ అని ఏడుస్తుంది. నగల విషయం బయట పెట్టాలని ఆ నర్మద, ప్రేమలు ఇలా ప్లాన్ చేశారు. ఇద్దరూ తెలివిగా ప్లాన్ చేసి నా దగ్గర తాళాలు ఇచ్చేలా చేశారు. ఇప్పుడు ఇలా నగలు అని ఇలా చేశారు. మీరు అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పి నా కాపురం నిప్పుల మీదకు  నెట్టేశారు అని తల బాదుకొని ఏడుస్తుంది. 

రామరాజు పూజారికి పూజ మొదలు పెట్టమని అంటారు. వేదవతి వల్లి నగలు తీసుకొస్తుందని అంటుంది. దాంతో కామాక్షి తల్లితో వీళ్లలా వదినవి రెండు మూడు నగలా చిన్న పాటి నగల దుకాణమే.. అన్నీ తీసురావొద్దా అంటుంది. దానికి నర్మద అవును చాలా నగలు ముట్టుకుంటే రంగు పోతాయేమో అన్నట్లుంటాయి అని అంటుంది. ఇక ప్రేమ అక్క నగలు తీసుకొని రా అని అంటుంది. అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక నాకు నా భర్త ఉండరు అని వల్లి ఏడుస్తుంది. అందరూ వల్లిని పిలుస్తారు. తిరుపతి వెళ్లి పిలుస్తూ వీళ్లేంటి తలుపు వేసుకున్నారు అని అనుకుంటాడు. నర్మద, ప్రేమలు ఈ దెబ్బతో వీళ్ల గిల్ట్ గుట్టు రట్టు చేయాలని అనుకుంటారు. 

నర్మద, ప్రేమలు వల్లి దొరికిపోతుందని అనుకునే టైంకి వల్లి నగలను హారతి ప్లేట్‌లో తీసుకొస్తూ వాటి మీద ఎర్రటి గుడ్డ కప్పి తీసుకొస్తుంది. ఏంటి నగల మీద క్లాత్ కప్పావని ప్రేమ, నర్మదలు తీయాలని చూస్తారు. దాంతో వల్లి నేను చూపిస్తా అని చెప్పి బంగారం పూట పోసిన ఓ కలశం చెంబు పట్టుకొని వస్తుంది. అందరూ వింతగా చూసి ఇందేంటి కలశం చెంబు తీసుకొచ్చావ్ అని అడుగుతారు. నర్మద కలశం వకం తొంగి తొంగి చూసి కలశం మూతకి చొట్ట పడింది ఏంటి అని అడుగుతుంది. దాంతో వల్లి షాక్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో భాగ్యం గిల్ట్ నగలను తెల్లని వస్త్రంలో కప్పి కలశంలో పెట్టేస్తుంది. ఎవరైనా చేయి పెట్టి నగలు తీస్తే ఎలా అని వల్లి తల్లిని అడుగుతుంది. దాంతో భాగ్యం ఎవరూ నగలు తీయకుండా ఇనుప రాడ్‌తో కలశంలోకి చేయి వెళ్లకుండా కలశం మూతి కొట్టేస్తుంది. ఇప్పుడు ఎవరూ నగలు బయటకు తీయలేరని అంటుంది. నర్మద మాత్రం వల్లిని వదలదు.. వల్లి అక్క అందులో నగలు తీసి అక్కడ పెట్టు అంటుంది. నర్మద చెంబు తీసుకొని అందులో నగలు తీయడానికి తెగ ప్రయత్నిస్తుంది కానీ రావు. ప్రేమ కూడా ప్రయత్నిస్తుంది కానీ రావు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.