Brahmamudi Serial Today Episode: కావ్య కడుపుతో ఉందన్న విషయం స్వరాజ్‌ ద్వారా ఇంట్లో వాళ్లకు ముఖ్యంగా రాజ్‌కు తెలిసేలా చేయాలనుకుంటుంది రుద్రాణి. అందుకోసం గార్డెన్‌ లో చాక్లెట్‌ తింటున్న స్వరాజ్‌ దగ్గరకు వెళ్తుంది.

రుద్రాణి: హాయ్‌ స్వరాజ్‌.. చాక్లెట్‌ తింటున్నావా..?

స్వరాజ్‌: లేదు ఆంటీ బిస్కెట్‌ తింటున్నాను..

రుద్రాణి: అదేంటి అది చాక్లెట్‌ కదా.. బిస్కెట్‌ అంటున్నావేంటి..?

స్వరాజ్: మరి చాక్లెట్‌ అని మీకు తెలుసు కదా… మళ్లీ స్పెషల్ గా అడగడం దేనికి

రుద్రాణి: అది సరే నీకు చాక్లెట్‌ ఇచ్చిన కావ్యకు కంగ్రాట్స్‌ చెప్పవా మరి..

స్వరాజ్‌: చాక్లెట్‌ ఇస్తే ఎవరైనా థాంక్స్‌ చెప్తారు కానీ కంగ్రాట్స్‌ ఎందుకు చెప్తారు..?

రుద్రాణి: చాక్లెట్‌ ఇస్తే థాంక్స్‌ చెప్పాలి స్వరాజ్‌ కానీ నీకు చాక్లెట్‌ ఇచ్చిన ఆంటీ నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి స్వరాజ్‌ను ఇస్తుంది కదా..? అందుకని కంగ్రాట్స్‌ చెప్పమంటున్నాను.

స్వరాజ్: ఏంటి ఆంటీ నాకు ఫ్రెండ్‌ను ఇవ్వబోతుందా..? అయితే ఇప్పుడే కగ్రాట్స్‌ చెప్పి వస్తాను ఇప్పుడు తను ఎక్కడ ఉంది

రుద్రాణి: లోపల హాల్లో ఉంది వెళ్లు వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పు

స్వరాజ్: అలాగే

రుద్రాణి: కావ్య ఇక నువ్వు ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని బయట పడకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను.

అనుకుంటుంది రుద్రాణి. ఇక స్వరాజ్‌ లోపలికి వెళ్తాడు.

స్వరాజ్: కంగ్రాట్స్‌ ఆంటీ

కావ్య: నాకెందుకు చెప్తున్నావురా..?

స్వరాజ్‌: నువ్వు కడుపుతో ఉన్నావు కదా..? త్వరలోనే నువ్వు నాకు ఒక ఫ్రెండ్‌ను ఇస్తున్నావు కదా… అందుకే చెప్తున్నాను ఆంటీ. (అందరూ షాక్‌ అవుతారు.) ఏంటి ఆంటీ అలా చూస్తున్నావు.. నేను తెలుసుకుని వచ్చి కంగ్రాట్స్‌ చెబితే కనీసం థాంక్స్‌ కూడా చెప్పవా..?

రుద్రాణి:  ఇప్పుడు ఆ కావ్య ఏం చెప్తుందో నేను చూస్తాను..

రాహుల్: నేను కూడా చూస్తాను.

కనకం:  ఒరేయ్‌ నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు..?

స్వరాజ్‌: తెలుసుకున్నాను..

కనకం: అదేరా ఎలా తెలుసుకున్నావు..?

స్వరాజ్‌: అదిగో ఆ ఆంటీ చెప్పింది

అంటూ రుద్రాణిని చూపిస్తాడు.

ఇందిరాదేవి: నీకు అసలు బుద్ది ఉందా..? చిన్న పిల్లలకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా..?

రాజ్‌: ఇప్పుడు చిన్న పిల్లాడికి ఏ విషయం చెప్పాలా చెప్పకూడదా అనేది ఇంపార్టెంట్‌ కాదు నాన్నమ్మ. కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పింది..?

రుద్రాణి: (మనసులో) కావ్య నోరు తెరచి నిజం చెప్తుంది అనుకుంటే ఇది అటూ తిరిగి ఇటు తిరిగి నా మీదకు వచ్చిందే..? ఇప్పుడు ఎలా అని

రాజ్‌: ఏంటి రుద్రాణి గారు కళావతి కడుపుతో ఉందని చెప్పారా.?

రుద్రాణి: అవును కడుపుతో ఉందని చెప్పాను.. కానీ నేను వాడికి చూపించింది అప్పును వాడు వెళ్లి కళావతిని అడిగాడు దానికి నేనేం చేయను..

కనకం: విన్నారా..? బాబు రుద్రాణి గారు మా అప్పును చూపిస్తే.. వాడు కళావతిని అడిగాడంటా

రాజ్: ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైంది తెలుసా..?

కనకం:  నాకు కూడా..

రాజ్‌:  మీకు ఎందుకు టెన్షన్‌

కనకం: ముందు మీరు ఎందుకు టెన్షన్‌ పడ్డారు చెప్పండి.

రాజ్‌: పెళ్లి కాకుండానే కళావతి గారికి కడుపు వచ్చిందంటే టెన్షన్‌ పడరా..?

కనకం: నేను కూడా అందుకే పడ్డాను బాబు

రుద్రాణి: అసలు ఇదంతా ఆ బాబు వల్లే వచ్చింది.

ఇందిరాదేవి: కాదు నీ వల్ల వచ్చింది. ఆ దేవుడు నీకు నోరు ఇచ్చారు కదా..? అప్పు కడుపుతో ఉందని చెప్పాలా..? వేలు పెట్టి చూపించాలా..?

రుద్రాణి:  ఇది మరీ బాగుంది అమ్మా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని

రాజ్‌: అయినా మీరేంటి కళావతి గారు అలా షాక్‌లో ఉండిపోయారు. వాడు అడగ్గానే నిజం చెప్పొచ్చు కదా..?

కనకం: అంటే బాబు మనం అందరం ఎలా షాక్‌ అయ్యామో తను కూడా షాక్‌ అయ్యుండొచ్చు కదా..?

అంటూ కనకం చెప్పగానే అందరూ అవును అయ్యుండొచ్చు కదా అంటారు. ఇంతలో పంతులు వ్రతానికి టైం అవుతుందన పిలుస్తాడు. అందరూ వెళ్లి పూజలో కూర్చుంటారు. పూజ అయిపోయాక కనకం ప్లాన్ ప్రకార రాజ్‌ చేత కావ్య మీద అక్షింతలు వేయిస్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి, రాహుల్ షాక్‌ అవుతారు. తర్వాత రాజ్‌, కావ్యతో ఎమోషనల్ అవుతాడు. కావ్యను తప్పా తన మనసు వేరొకరిని యాక్సెప్ట్‌ చేయడం లేదని బాధపడతాడు. కావ్య కూడా బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!