Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆనంద్‌ స్కూల్‌ ఎలక్షన్స్‌ లో పోటీ చేస్తున్నాడని అమర్‌ తెలుసుకుని అప్రిసియేట్‌ చేస్తాడు. ఆనంద్‌కు మంచి విషయాలు చెప్తాడు.

అమర్: గెలిస్తే అదొక ఎచీవ్‌మెంట్‌గా తీసుకుని స్కూల్‌కు, స్టూడెంట్స్‌కు నీ వల్ల ఎంత హెల్ప్‌ అవుతుందో అంత హెల్ప్‌ చేయాలి. ఓడిపోతే స్పోర్టీవ్‌గా తీసుకుని ఎందుకు ఓడిపోయావో అనాలసిస్‌ చేసుకుని నెక్ట్‌ టైం అది రిపీట్‌ అవ్వకుండా చూసుకోవాలి.

ఆనంద్‌:  ఓకే డాడ్‌

గుప్త: ఎన్నడూ లేనిది ఇతగాడేంటి ఇంత ప్రేమగా పిల్లలతో సంభాషిస్తున్నాడు. ఒకవేళ ఆ బాలిక ఇతగాడిలో ప్రవేశించలేదు కదా..?

అంజు: డాడ్‌ అన్నయ్య పోటీలో ఓడిపోడు డాడ్. అమ్ము పోటీలో నిల్చోను అంటే నేను అన్నయ్యను నిలబెట్టాను. అన్నయ్య కోసం స్కూల్‌లో క్యాంపెయినింగ్‌ కూడా చేశాను.  ఎలాగైనా సరే అన్నయ్యన గెలిపిస్తాను డాడ్‌. అన్నయ్యను లీడర్‌ను చేస్తాను.

గుప్త: ఈ పిల్ల పిచ్చుక ఆ పిల్ల పిచ్చుకను నమ్మకంగా గెలిపిస్తానని చెప్పుచున్నదనిన..ఆ బాలిక కచ్చితంగా ఈ పిల్ల పిచ్చుకందే ప్రవేశించినట్టు ఉన్నది.

అమర్‌:  వెరీగుడ్‌ నీ యాక్టివిటీస్‌ అంతా బాగానే ఉన్నాయి. వాట్‌ అబౌట్‌ యువర్‌ స్టడీస్‌

అంజు: లేదు డాడ్‌ స్టడీస్‌ లో డోకానే లేదు డాడ్‌. ఈసారి బాగా చదివి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంటాను

గుప్త:  ఆ పిల్ల పిచ్చుక నందు కూడా లేదు

భాగీ: క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తే చాలు అనుకుంటున్నావా..? అంజు..

అంజు: లేదు మిస్సమ్మ ఈ సారి ఎంతైనా కష్టపడి చదివి కచ్చితంగా స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంటాను.

రాథోడ్‌ తుమ్ముతాడు.

ఆనంద్‌:  నువ్వు ఓవరాక్షన్‌ చేయకే డాడీకి దొరికిపోతావు.

అమర్‌:  అమ్ము, ఆకాష్‌ మీరు కూడా ఆనంద్‌కు సపోర్టుగా ఉండండి

రాథోడ్‌: అవును సార్‌ ఆనంద్‌ బాబుకు ముఖ్యంగా వాళ్ల సపోర్టే కావాలి

అమర్‌: ఎందుకు అలా చెప్తున్నావు రాథోడ్‌

భాగీ: ఆంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా..? అందుకే అలా చెప్తున్నాడు… ఏవండి మీరు కూడా స్కూల్‌ కు వస్తే బాగుంటుందేమో

అమర్‌:  నాకు ఆఫీసులో చిన్న వర్క్‌ ఉంది భాగీ కుదరదు

భాగీ: అంటే మీరొస్తారని పిల్లలతో చెప్పాను

అమర్‌:  ఒక పని చేయ్‌ భాగీ పిల్లలతో నువ్వు వెళ్లు.. 

రాథోడ్‌: సార్‌ మీరు వస్తే పిల్లలకు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది. వీళ్లను స్కూల్‌ లో డ్రాప్‌ చేసి అటు నుంచి  అటే ఆఫీసుకు వెళ్దాం సార్‌

అమర్‌: సరే పదండి పిల్లలు

అనగానే అందరూ కలిసి స్కూల్‌కు వెళ్తారు. స్కూల్‌కు వచ్చిన మనోహరి బయటకు వెళ్ళి. తన మనిషికి ఫోన్‌ చేస్తుంది.  

మనోహరి: నేను చెప్పిన పని ఏమైంది..?

మను రౌడీ: మీరు చెప్పినట్టే నేను షాపింగ్‌ మాల్‌లో మేనేజర్‌గా జాయిన్‌ అయ్యాను మేడం

మనోహరి: గుడ్‌ నెల రోజుల్లోపు ఆ షాపు దివాలా తీయాలి. వాళ్లు రోడ్డు మీద పడాలి. షాపింగ్‌ మాల్‌ నష్టాల్లో కూరుకుపోవాలి. కస్టమర్స్‌ ఎవ్వరూ మాల్‌ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నెల తిరగే లోపు షాపులో ఈగలు దోమలు తప్పా షాప్‌లో కస్టమర్స్‌ ఎవ్వరూ కనబడకూడదు.

మను రౌడీ: నెల కాదు పది రోజుల్లో షాపును దివాలా తీయిస్తాను. వాళ్లను రోడ్డు మీద పడేస్తా..!

అని చెప్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. వెనక నుంచి అమర్‌ వచ్చి మనోహరి అని పిలవగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!