Seethe Ramudi Katnam Serial Today Episode సీతతో మహాలక్ష్మీ మాట్లాడి ప్రీతి పెళ్లి రాకేశ్‌తోనే చేస్తానని చెప్తుంది. చూస్తూ చూస్తూ ప్రీతి గొంతు కోసేస్తారా అని సీత మహాలక్ష్మీని ప్రశ్నిస్తుంది. దానికి మహాలక్ష్మీ మీరు తీసుకొచ్చిన సంబంధానికి ఆస్తి పాస్తులు లేవు అలా అని ప్రీతికి వాళ్లకి ఇవ్వలేం కదా నేను చూసిన సంబంధంలో రాకేశ్ కోటీశ్వరుడు అని మహాలక్ష్మీ చెప్తుంది. 


సీత: ప్రీతి పెళ్లి రాకేశతో జరుగుతుందని కలలు కంటున్నారా.
మహాలక్ష్మీ: ప్రీతి పెళ్లి రాకేశ్‌తోనే జరిపిస్తాను. పెళ్లి తర్వాత రాకేశ్ మారొచ్చేమో.
సీత: ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి అత్తయ్య ప్రీతికి హేమంత్‌నే కరెక్ట్ హేమంత్‌తోనే ప్రీతి పెళ్లి జరగాలి.
మహాలక్ష్మీ: జరగదు. మీరందరూ కట్ట కట్టుకొని వెతికినా సుమతిని తీసుకురాలేరు. అది మీ వల్ల కాదు. మీరు తన్నుకు చచ్చినా సుమతి రాదు. ఎలా ఉంది నా దెబ్బ మీ అందరి గూబ గుయ్ మందా. అట్లుంటుంది మన దెబ్బ.
విద్యాదేవి: ఆవిడ నన్ను ఇరికించడానికే మహాలక్ష్మీ అలా ప్లాన్ చేసింది. ప్రీతి పెళ్లి ఆపడం తన టార్గెట్ కాదు అజ్ఞాతంలో ఉన్న నన్ను బయటకు రప్పించడానికే ఇలా ప్లాన్ చేసింది అన్నయ్య. 
శివకృష్ణ: ఇప్పుడు నీ రూపం మారిపోయింది కదమ్మా నీ గురించి తనకు ఎందుకు.
విద్యాదేవి: నన్ను బయటకు రప్పించి మరోసారి నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది. 


విద్యాదేవి, శివకృష్ణ, లలితలు మాట్లాడుకుంటుంటే సీత అటుగా వస్తుంటుంది. సీత విషయం వినకుండా ప్రీతి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారేమో అనుకొని వాళ్లకి ధైర్యం చెప్తుంది. సుమతి అత్తయ్యని మహాలక్ష్మీ అత్తయ్య తక్కువ అంచనా వేసిందని మహాలక్ష్మీ అత్తయ్య ఆట కట్టించడానికి సుమతి అత్తయ్య వస్తుందని చెప్పి వెళ్లిపోతుంది. సీత మాటలు వింటుంటే తన మాట నిజం చేయాలి అనిపిస్తుందని సీత కోసం మనం ఒకటి చేయాలని అన్నావదినలతో తన ప్లాన్ చెప్తుంది. ఇక జనార్థన్, మహాలక్ష్మీలు వెళ్లిపోతుంటే శివకృష్ణ, లలితలు వాళ్లని ఆపి సీత, రామ్‌ల తొలిరేయి చేద్దామని చెప్తారు. మహాలక్ష్మీ షాక్ అయి మేం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ కార్యం జరిపించాలని అంటున్నారని అంటుంది. ఇక విద్యాదేవి, శివకృష్ణలు నీ ముద్దుల కొడుకు ముచ్చట తీర్చాలని మీకు ఉందని పరిస్థితి అనుకూలించక లేట్ చేశారని మహాలక్ష్మీ ఇరికించేస్తారు. రామ్ కోసం మహాలక్ష్మీ ఏమైనా చేస్తుందని జనార్థన్ అంటాడు. మొత్తానికి అందరూ మహాలక్ష్మీతో ఫస్ట్‌నైట్‌కి ఓకే చెప్పిస్తారు. రామ్, సీతలు మహాలక్ష్మీని పొగిడేస్తారు. అందరూ మహాలక్ష్మీని ఆకాశానికి ఎత్తేస్తారు. 


మహాలక్ష్మీ అర్చనకు ఫోన్ చేసి ప్రీతి పెళ్లి కండీషన్‌ గురించి చెప్తుంది. తర్వాత అర్చనతో రామ్, సీతల ఫస్ట్ నైట్ గురించి చెప్తుంది. మహాలక్ష్మీ తనకు పిచ్చి ఎక్కిపోతుందని ఎలాంటి పరిస్థితుల్లోనూ అది జరగకూడదని అంటుంది. ఇక అర్చన రామ్, సీతల ఫస్ట్‌నైట్ ఆపే ఛాన్స్ తనకు వచ్చిందని మహాలక్ష్మీతో అంటుంది. ఫస్ట్ నైట్ గదిని అందంగా అలంకరిస్తారు. రామ్ గదిలో వెయిట్ చేస్తుంటాడు. సీత రెడీ అయి మహాలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. ఇలాంటి రోజు రాదని చెప్పిన మీరు ఇప్పుడు షాక్ అయిపోయారా అని అంటుంది. నీ ఆనందాన్ని కాసేపట్లో మంట కలిపేస్తానని మహాలక్ష్మీ మనసులో అనుకుంటుంది. మహాలక్ష్మీ తన చేతిలో సీతకు పాల గ్లాస్ ఇస్తుంది. సీత మహాలక్ష్మీతో మీకు త్వరలోనే వారసుడిని ఇవ్వాలని దీవించి గదిలోకి పంపమని అంటుంది. మహాలక్ష్మీ కోపంతో సీతని తీసుకొని బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: Diwali 2024 : దీపావళి రోజు నువ్వులతో దీపం వెలిగిస్తే చాలు.. ఇదీ విధానం!