Diwali 2024 : దీపావళి రోజు నువ్వులతో దీపం వెలిగిస్తే చాలు.. ఇదీ విధానం!

ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు..కానీ ఆప్రభావం నుంచి ఉపశమనం కోసం రెమిడీస్ సూచించారు పండితులు. అందులో ఒకటి దీపావళి రోజు వెలిగించే నువ్వుల దీపం..
Download ABP Live App and Watch All Latest Videos
View In App
దీపావళి రోజు వేకువజామునే స్నానమాచరించి...భగవంతుడికి నమస్కరించి మూడు గుప్పెడల నువ్వులు తీసుకుని తెల్లటి వస్త్రంలో మూట కట్టాలి

మూటకట్టిన నువ్వుల మూటను పైకి ఒత్తి వచ్చేలా కట్టాలి...అనంతరం నువ్వుల నూనెలో ఆ చిన్న మూటను నానపెట్టాలి...
సాయంత్రం సూర్యాస్తమయం అయినవెంటనే లక్ష్మీపూజ చేసి..ఆ తర్వాత ఇంటి బయట దీపాలు వెలిగించేముందుగా... నువ్వుల నూనెలో నానబెట్టిన నల్ల నువ్వులను తీసుకెళ్లి వెలిగించాలి
ఆ దీపం వెలిగించిన తర్వాత వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసి ..కాళ్లు కడుక్కుని లోపలకు వచ్చి లక్ష్మీదేవికి నమస్కరించి ప్రసాదం స్వీకరించాలి..అనంతరం దీపాలు వెలిగించాలి...
కొందరు దీపాలు వెలిగించే ముందు నువ్వుల దీపం వెలిగిస్తే..మరికొందరు మొత్తం దీపావళి సంబరం, బాణాసంచా కాల్చడం పూర్తైన తర్వాత వెలిగించి లోపలకు వచ్చేస్తారు...
ఇంటి ఆవరణలో ఈ నువ్వుల దీపం వెలిగించవద్దు..ఇంటి ప్రహారీ గోడ దాటిన తర్వాతే వెలిగించండి. నూనెలో నానిన నువ్వుల మూట పూర్తిగా మసైపోవాలి...అంటే దీపం వెలిగించే ముందు ఆది పూర్తిగా వెలిగేందుకు కర్పూరం కూడా జోడించవచ్చు..
నువ్వుల దీపం వెలిగించేందుకు వినియోగించిన ప్రమిదను బయట అలాగే వదిలేయండి..దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టొద్దు...