Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర సమక్షంలో లక్ష్మీ చైర్మన్ కుర్చీలో కూర్చొంటుంది. తర్వాత లక్ష్మీ మిత్రని పిలిచి ఏవండీ నేను ఈ ఛైర్‌కి సూట్ అయ్యాను కదండీ అంటే వివేక్ కరెక్ట్‌గా సూటయ్యావ్ వదిన అంటాడు. దాంతో మిత్ర ఉడికిపోయి రారా నువ్వు బయటకు అని చెప్పి బయటకు తీసుకెళ్తాడు. ఇక లక్ష్మీ మనీషాతో ఏంటి మనీషా ఎసిడిటీ వచ్చిందా ముఖం అలా పెట్టావని అంటుంది. దానికి మనీషా నిన్ను త్వరలోనే ఈ ముళ్ల కుర్చీ నుంచి దింపుతానని ఛాలెంజ్ చేస్తుంది. 
 
లక్ష్మీ: సమస్యలు సవాళ్లు నాకు కొత్త కాదు.
మనీషా: కానీ ఇది నీకు చావు తెస్తుంది.
లక్ష్మీ: సరయు వస్తుందో సమస్య వస్తుందో ఏదో రానీ ఐ యామ్ వెయిటింగ్.


అరవింద, జయదేవ్‌లు దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్తారు. లక్ష్మీకి చైర్మన్ చేసి మంచి పని చేశావని జయదేవ్ అంటాడు. దానికి అరవింద మిత్ర లక్ష్మీని ప్రేమించడం మొదలు పెట్టాడని అందుకే ఇద్దరూ ఒక చోట  ఉండేలా ప్లాన్ చేశానని అంటుంది. తాము సంతోషంగా ఉన్నామని గురువుగారికి చెప్పాలని వచ్చామని అంటుంది. దీక్షితులు గారు లేరని తర్వాత వస్తారని చెప్తారు అక్కడున్న మరో వ్యక్తి. అరవింద దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆయన జయదేవ్ గారితో మీ ఇంట్లో ఒకరికి ఆపద ఉందని గురువుగారు మీకు అది చెప్పమన్నారని అందరినీ జాగ్రత్తగా ఉండమన్నారని చెప్తాడు. జయదేవ్ కంగారు పడతాడు. 


మరోవైపు మనీషా సరయుని కలుస్తుంది. లక్ష్మీ ఏం చేయలేకపోతున్నానని లక్ష్మీకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలని అంటుంది. దానికి సరయు ఆ లక్ష్మీని లేపేద్దామని అంటుంది. దానికి మనీషా అది బతికే ఉండాలి కానీ చావు కోసం ఎదురు చూడాలని చావా లేక బతకలేక నరకం చూడాలని జీవితాంతం నన్ను చూస్తూ అది కుళ్లి కుళ్లి చావాలని అంటుంది. దానికి సరయు లక్ష్మీకి కాళ్లు చేతులు పడిపోయేలా మంచానికి పరిమితం అయ్యేలా చేయాలి అనుకుంటారు. ఇక దానికి సరయు ప్లాన్ చెప్తుంది. లక్ష్మీ చైర్మన్ కాబట్టి తనని సైట్‌కి తీసుకొస్తే నా వాళ్లతో పని పూర్తి చేయిస్తానని అంటుంది. ఇక సరయు మనీషాతో నువ్వు రావొద్దు మిత్ర, లక్ష్మీలను పంపమని అంటుంది. 


వివేక్ లక్ష్మీ దగ్గరకు వెళ్లి మేడమ్ అంటే మీ అన్నతో కలిసి నువ్వు కూడా నన్ను మీ అన్నయ్యతో కలిసి వెక్కిరిస్తున్నావా అని అంటుంది. ఇక వివేక్ సైట్‌కి వెళ్లాలని చెప్తాడు. లక్ష్మీ ఒకే అంటుంది. మిత్రకు కూడా చెప్తాడు. ఇంత మంది ఉంటే నేనే వెళ్లాలా ఆవిడ గారికి నన్ను పీఏగా చేసేశారా అని అంటాడు. లక్ష్మీ వివేక్ అని పిలిస్తే మిత్ర లక్ష్మీతో అన్నయ్య రెడీ వదిన అని అంటాడు. మిత్ర వివేక్ నేనేం చెప్పాను నువ్వు ఏం చెప్పావని అంటాడు. మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి నేను రాను అంటే లక్ష్మీ మీరు వస్తున్నారు రావాలి అంటుంది. దానికి మిత్ర చైర్మన్ అని అధికారం చెలయిస్తున్నావా అని అంటాడు. దానికి లక్ష్మీ మీకు సైట్ గురించి మొత్తం తెలుసు మీరు రండి అని అంటుంది. ఇంతలో మనీషా వచ్చి ఎక్కడికి అని అడిగితే కనెస్ట్రెక్షన్ సైట్‌కి అని చెప్తాడు. ఇక మిత్ర లక్ష్మీతో మనం కలిసి వెళ్లడం మనీషాకి ఇష్టం లేదు అంటే మనీషా వెళ్లండి అని అంటుంది.


మనీషాని రమ్మని లక్ష్మీ పిలిస్తే వద్దులే అని అంటుంది. మిత్రతో  లక్ష్మీకి తొలి రోజు ముచ్చట తీర్చు మిత్ర అంటుంది. దాంతో మిత్ర వెళ్లడానికి రెడీ అవుతాడు. మనీషాకి వెళ్లొస్తాను అని చెప్పి మిస్‌యూ అని చెప్తాడు. ఇక లక్ష్మీ పడిపోబోతుంటే మిత్ర పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక తర్వాత ఇద్దరూ సైట్‌కి వెళ్తారు. సరయు పీఏతో లక్ష్మీని చంపేయ్మని క్రేన్ ఆపరేటర్‌తో చెప్పమని అంటుంది. తర్వాత మనీషా అలా చేయమని చెప్పిందని చెప్పింది మనీషాని జైలుకి పంపించి మళ్లీ చైర్మన్ సీట్‌ దక్కించుకోవాలని అంటుంది. కారులో వెళ్తుంటే లక్ష్మీ మిత్రని అదే పనిగా చూస్తుంటుంది. అలా చూడకు ఏదోలా ఉందని మిత్ర అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గన్‌తో మహాలక్ష్మీకి ఎదురెళ్లిన రాకేశ్ కొత్త డీల్.. శివకృష్ణ ఇంట్లో పెళ్లి చూపుల సందడి, మహా ప్లాన్!