Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి గురించి తప్పుగా మాట్లాడిందని అర్చనను అందరూ తిడతారు. అర్చనకు సపోర్ట్ చేసిన మహాలక్ష్మీని రామ్, జనార్థన్ కోప్పడతారు. నాకు సుమతి అంటే గౌరవమే కానీ సుమతి రాకపోతే ఇలాంటి మాటలు అంటారు అని మహాలక్ష్మీ అంటుంది. దానికి రామ్ అలాంటి మాటలు అన్నవాళ్లు ప్రీతి పెళ్లికి రావాల్సిన అవసరం లేదని రామ్ అంటాడు.
సీత: ముందు ఇంటి వారు గౌరవం ఇస్తే తర్వాత బయట వాళ్లు ఇస్తారు. ఎవరి ఇంట్లో అన్నం తింటున్నారు ఎవర్ని అవమానిస్తున్నారు.
జనార్థన్: ఇది కచ్చితంగా సుమతికి అవమానమే మహా.
మహాలక్ష్మీ: అర్చన చేసిన పని తప్పు అని నేను ఒప్పుకుంటున్నా జనా తను అలా మాట్లాడకూడదు.
గిరిధర్: అర్చన తరఫున నేను సారీ చెప్తున్నా అన్నయ్య ఈ ఒక్క సారికి క్షమించు.
మహాలక్ష్మీ: అయినా నువ్వేంటి అర్చన నోటికి ఎంత వస్తే అంత అనేయటమేనా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్.
తర్వాత అర్చన ఎందుకు అలా తిట్టావ్ మహా అని అర్చన అడిగితే నేను అలా అనకపోతే రామ్, జనా నిన్ను ఇంట్లో నుంచి పంపేస్తారని అంటుంది మహాలక్ష్మీ. సుమతికి ఓ గౌరవం ఉందని తాను చనిపోయే వరకు అయినా మనం ఏం అనకూడదని మహాలక్ష్మీ అంటుంది. దానికి అర్చన సుమతి అక్క ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చస్తుందో అని అంటుంది. ప్రీతి పెళ్లికి సుమతి వస్తే అప్పుడు చంపేస్తా అని లేదంటే సుమతి క్యారెక్టర్ బ్యాడ్ చేసేస్తానని మహాలక్ష్మీ అంటుంది. శివకృష్ణ, లలితలు మహాలక్ష్మీ పెళ్లి కోసం పెట్టిన కండీషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని లలిత అంటుంది.
శివకృష్ణ: అదే నాకు అర్థం కావడం లేదు లలిత. సుమతి వస్తే మహాలక్ష్మీ చంపేస్తుంది బతకనివ్వదు. రాకపోతే ప్రీతి పెళ్లి జరగదు.
లలిత: ఎన్ని గొడవలు జరుగుతాయా అని భయంగా ఉందండి.
శివకృష్ణ: ప్రీతి పెళ్లి సీత ఎలా అయినా జరిపిస్తుంది. అందులో అనుమానం లేదు కానీ సుమతి గురించే ఆలోచనగా ఉంది.
రాకేశ్ తండ్రి మహాలక్ష్మీకి ఫోన్ చేసి పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయని అంటే మహాలక్ష్మీ దానికి పెళ్లి ఆఖరి నిమిషంలో అయినా ఆపుతానని ప్రీతి పెళ్లి రాకేశ్‌తోనే జరుగుతుందని అంటుంది. పదే పదే ఫోన్ చేయొద్దని మహాలక్ష్మీ అంటుంది. ఇక అర్చన వచ్చి ప్రీతి, రాకేశ్‌లకు పెళ్లి జరిగితేనే మనకు సేఫ్ అని అంటుంది. రాత్రి అందరూ భోజనాలకు కూర్చొంటారు. మహాలక్ష్మీ తనకు ఆకలి లేదని మనసు బాలేదని అంటుంది. సుమతి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. వారంలో ప్రీతి పెళ్లి ఉందని ఈలోపు సుమతి రాకపోతే ప్రీతి పెళ్లి జరగదు అని మహాలక్ష్మీ అంటుంది. అది మీరు పెట్టిన కండీషన్ అని సీత అంటుంది. మహాలక్ష్మీ కోరిక మంచిదే అని జనార్థన్ కూడా అంటాడు. సుమతి రాకపోతే పెళ్లి ఆగిపోయి అవమాన పాలవుతామని అంటుంది. సుమతి రాదని అందరి ముందు అవమానపడే కంటే ముందే పెళ్లి ఆపేస్తే బెటర్ అని జనార్థన్ అడుగుతాడు. అలా ఎలా క్యాన్సిల్ చేస్తారని సీత అంటుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి సుమతి వస్తుందని అంటుంది.
విద్యాదేవి: సుమతి వస్తుంది ప్రీతి పెళ్లి జరుగుతుంది.
మహాలక్ష్మీ: సుమతి వస్తుందని అంతలా చెప్తున్నారు మీకు ఆ విషయం ఎలా తెలుసు అసలు నువ్వు ఎవరు.
విద్యాదేవి: సుమతిని.
మహాలక్ష్మీ: నువ్వు సుమతివా.
విద్యాదేవి: నేను సుమతిని రూపం మారిపోయిన సుమతిని. జనార్థన్ గారి భార్యని రామ్ ప్రీతిల తల్లిని. నువ్వు నన్ను చంపాలి అని చూసినా బతికి తిరిగి వచ్చిన సుమతిని. ఆ రోజు నన్ను చంపాలి అని చూశావు. ఈ రోజు నా కూతురి పేరు ఆపాలని చూస్తున్నావ్ నిన్ను చంపి పెళ్లి చేస్తా మహాలక్ష్మీ అని గొంతు పట్టేస్తుంది విద్యాదేవి.
అందరూ వదలమని వేడుకుంటారు. చూస్తే అదంతా మహాలక్ష్మీ కల. నో అని పెద్దగా అరిచి లేస్తుంది. ఇలాంటి కల వచ్చిందేంటి అని మహాలక్ష్మీ కంగారు పడుతుంది. విద్యాదేవి సుమతి అని ఎందుకు పదే పదే అనిపిస్తుందని కంగారు పడుతుంది. ఉదయం మహాలక్ష్మీ అందరినీ పిలిచి సుమతి గురించి తెలిసిపోతుందని అంటుంది. ఓ వ్యక్తి వచ్చి సుమతి గురించి సాక్ష్యాలతో సహా చెప్తాడని అంటుంది. ఎవరు అని అందరూ అడిగితే అంజనం వేసే వాడని చెప్తుంది మహాలక్ష్మీ దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.