Ammayi garu Serial Today Episode హారతి, దీపక్‌లకు బాబు పుడతాడు. దీపక్‌ని పెళ్లి చేసుకోమని హారతి అంటే తర్వాత చేసుకుందామని అంటాడు. ఇక దీపక్ అలసిపోయాను ఇంటికి వెళ్తానని హారతి నుంచి విడిపించుకొని మరీ వెళ్లిపోతాడు. బిడ్డతో నేనే మీ ఇంటికి వస్తానని హారతి అనుకుంటుంది. ఇక రూప రాజు కోసం ఇళ్లంతా వెతుకుతుంది. రూప ముఖంలో ఆనందం చూస్తుంటే పిచ్చి ఎక్కుతుందని జీవన్ విజయాంబిక, దీపక్‌లతో చెప్తాడు. 


విజయాంబిక: వాళ్లకి మనస్శాంతి లేకుండా చేయడానికి నాకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. 
రూప: రాజు ఇక్కడున్నావా నీ కోసం మొత్తం వెతుకుతున్నా చాలా రోజుల తర్వాత నాన్న అంగీకారంతో కలిశాం కదా అందరం కలిసి భోజనం చేద్దాం. అత్తయ్య మామయ్యల కోసం ఆలోచిస్తున్నావా రాజు వాళ్ల కోపం కరిగిపోతుంది. రేపు వెళ్లి మాట్లాడుదాం. 
విజయాంబిక: తమ్ముడు మన పింకీ భర్త నీతో మాట్లాడటానికి భయపడుతున్నాడు. అది నీతో చెప్పడానికి భయపడి నాతో చెప్పాడు.
సూర్యప్రతాప్: ఏంటి అక్కా.
విజయాంబిక: అదే తమ్ముడు పింకీ జీవన్‌లకు పెళ్లి అయిపోయింది కదా. పింకీని వాళ్ల ఇంటికి తీసుకెళ్లుంటే ఈ రోజు వాళ్లకి మొదటి రాత్రి ఏర్పాటు చేసుండే వాళ్లంట. ఇక్కడ మాత్రం ఎవ్వరూ ఏం పట్టించుకోవడం లేదని బాధ పడుతున్నాడు. అతని బాధలోనూ అర్థముంది అనిపించింది అందుకే నీకు ఓ మాట చెప్పాను.
సూర్యప్రతాప్: అక్కా అసలు వాళ్లు ఇద్దరి మధ్య ఏం జరిగిందో మన ఎవ్వరికీ తెలీదు. ఎవడో దారిన పోయిన దానయ్య నీ కూతురికి నాకు పెళ్లి అయింది అంటే అన్ని తంతులు చేయిస్తామా అడగడానికి వాడికి అయినా బుద్ధి లేదు అంటే చెప్పడానికి నీకు ఉండాలి.
జీవన్: నా పెళ్లాంతో నేను చేసుకోవాల్సిన తంతుల గురించి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలియకుండా నాలుగు గోడల మధ్య ఏం చేసినా మీకు ఎలా తెలుస్తుంది. అది నాకు ఇష్టం లేక మీ పర్మిషన్ అడిగాను. మీ విలువ మీరు కాపాడుకోకపోతే మా దారిలో నేను వెళ్తాను. మీ ఇష్టాల గురించి మాకు అవసరం లేదు ఆ తర్వాత తంతు గురించి అడుగుతున్నా.
రాజు: రేయ్ పింకిని పెళ్లి చేసుకున్న ముఖమారా ఏదో మాయ చేసి పెళ్లి చేసుకున్నావ్.
జీవన్: నువ్వు రూపని చేసుకున్నట్లా. మీకు సాంప్రదాయంగా జరగకపోయినా మామూలు ఫస్ట్‌నైట్ అయ్యాయి కదా. నువ్వు నీ పెళ్లాం కలవకుండా ప్రెగ్నెంట్ అయిందా.
సూర్యప్రతాప్: రేయ్ నా కూతురి గురించి మాట్లాడితే చంపేస్తా.


జీవన్ ఈ తంతు చేయమని విజయాంబికకు చెప్తాడు. విజయాంబిక సరే అంటుంది. పింకి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇదే జరిగితే చనిపోతానని నా కుటుంబాన్ని చనిపోయి కాపాడుకుంటా అనుకుంటుంది. ఇక రాజు పంతుల్ని పిలిచి ముహూర్తం చూసిన తర్వాత చూద్దాం ఈ తంతు గురించి అని అంటాడు. మీరు ముహూర్తాలు చూసుకోలేదు కదా అని జీవన్ అంటే అలా అయినందుకే మాకు బిడ్డ దక్కలేదు. పింకీ విషయంలో అలా జరగడానికి వీళ్లేదని అంటాడు. జీవన్ వచ్చి రాజుతో నా చెల్లికి దక్కని ఆనందం మీ ఎవ్వరికీ దక్కనివ్వనని ఛాలెంజ్ చేస్తాడు. మీకు మనస్శాంతి లేకుండా చేస్తానని జీవన్ అంటే అంత వరకు నువ్వు ఉండవని రాజు అంటాడు. 


రేణుక తాళిని చూసి తిట్టుకుంటుంది. తెంపేయాలి అనుకుంటే సమాజం ఒప్పుకోదని అనుకుంటుంది. ఇక అక్కడికి గొర్రె వస్తుంది. ఆ గొర్రెను గతంలో రేణుక పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు గొర్రె వచ్చి నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశావు అని మళ్లీ గౌతమ్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అంటుంది. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోదాం రా రేణుక అని గొర్రె పిలుస్తుంది. గొర్రె మాటలకు రేణుక చిరాకు పడటం చాలా కామెడీగా ఉంటుంది. అందరూ భోజనానికి కూర్చొంటారు. విజయాంబిక కింద పెద్ద అరటి ఆకు వేసి అల్లుడికి భోజనం అని చాలా వంటలు చేస్తారు. ఇక రాజు కోసమే అనుకొని రూప వాళ్లు రాజుని కూర్చొపెడతారు. రూప వడ్డిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రిని కాటేయడానికి వచ్చిన పాము.. నయనికి పిచ్చి అంటోన్న ఫ్యామిలీ!