Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర దీపపుకుందెలు తీసుకురావడానికి వెళ్తాడు. ఇక మిత్రకు కరెంట్ షాక్ కొట్టకుండా చేయాలని మనీషా అంటే సరయు ఫ్యూజ్ తీసేయాలి అని కరెంట్ బోర్డ్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇక దేవాని దీపం కోసం ఆయిల్ తీసుకురమ్మని జయదేవ్ చెప్తే దేవా వెళ్లనని అంటాడు. ఇక శివ తన బావ కోసం వెళ్తుంది. జయదేవ్ అందరికీ గుడి ప్రత్యేకతలు చెప్తాడు. మనీషా, సరయు ఎంత వెతికినా మెయిన్ దొరకదు. మొత్తం వెతుకుతూ ఉంటారు. మిత్ర గదిలోకి వెళ్లి దీపపు కుందెలు చూస్తాడు. 


మనీషా వాళ్లు పక్కనే ఉన్న స్విఛ్ బోర్డు చూసుకోరు. ఇక మిత్ర దీపపు కుందెలు తీసుకునే టైంకి శివ అది చూస్తుంది. అన్నయ్యా కరెంట్ అని మిత్రని ఆపుతుంది. మిత్ర కూడా చూసి షాక్ అయిపోతాడు. మనీషా, సరయులు అక్కడికి వస్తారు. మనీషా చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ ప్రాణాలు తీయాలి అనుకుంటే నీ ప్రియుడు కాపాడాడని సరయు అనుకుంటుంది. ఇక లక్ష్మీ దేవుడి దగ్గర దీపాలు పెట్టి అమ్మవారిని అలంకరిస్తుంది. అమ్మవారికి నగలు వేయమని జానుకి లక్ష్మీ నగలు  అందిస్తే అందులో ఒకటి చూసి జానుకి అనుమానం వస్తుంది. ఇవి అమ్మవారి నగలా అని అడుగుతుంది. అవన్నీ గిల్ట్‌ నగలు  అని చెప్తుంది. అందరూ  షాక్ అయిపోతారు. దేవా, తన తండ్రి వరదరాజులు వాళ్ల బండారం బయట పడిపోతుందని టెన్షన్ పడతారు.


వరదరాజులకు ఏంటి ఇది అని జయదేవ్ అడిగితే నాకు తెలీదని అంటాడు. లక్ష్మీ కూడా చూసి గిల్ట్ నగలని చెప్తుంది. ఆలయ ధర్మ కర్తగా వరదరాజులు గారే సమాధానం చెప్పాలని గంగాధర్ అంటే మా నాన్న కొట్టేశారా అని అంటున్నారా అని దేవా అంటే జాను మరి బంగారం నగలు ఏవి అని అడుగుతుంది. మా మీదే నింద వేస్తున్నారా అని వరదరాజులు అడుగుతాడు. శివ కంప్లైంట్ చేయమని చెప్పి పోలీస్ అయిన తాను చూసుకుంటానని అంటుంది. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒక సారి లెక్కలు తేల్చాలని మిత్ర అంటాడు. నగలతో పాటు ఫైల్స్‌లో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నాయా చూడాలని లక్ష్మీ అంటుంది. చూసుకోండని వరదరాజులు అంటాడు. 


ఇక అమ్మవారికి నకిలీ నగలతో ఎలా పూజ చేస్తాం అని లక్ష్మీ అడిగితే దానికి గంగాధర్ ఇక్కడికి బంగారు నగలు వేసుకొని వచ్చిన ఆడవాళ్లు పూజ చేస్తే అదే అమ్మకు తుప్తి అని అంటాడు. ఆడవాళ్లు అందరూ పూజ చేస్తారు. ఇక లక్ష్మీని చంపడానికి ఏం చేద్దామని సరయు, మనీషా అనుకుంటారు. ఇక సరయు విషం బాటిల్ చూపించి  విషం కలిపి చంపేద్దామని అంటుంది. మరోవైపు వరదరాజులు కూడా విషం తీసుకొచ్చి జయదేవ్‌ని ఏదో ఒకటి చేయాలని అంటాడు. ప్రసాదంతో మనీషా వాళ్లు విషం కలుపుతారు. అందరికీ భహినీహస్త భోజనం చేయించమని పంతులు చెప్తారు. ప్రత్యేకమైన రోజు సోదరి సోదరుడికి తన చేయి వంట తినిపిస్తే ఆ అన్నయ్యకు అకాల మృత్యు దోషం పోతుందని అంటారు.


గంగా ప్రసాదాన్ని లక్ష్మీ, జానులతో పాటు తన అక్కకి తినిపిస్తాడు. ఇక శివపార్వతి దేవరాజు అన్నయ్యని పిలుస్తుంది. దేవరాజు కూడా వస్తాడు. ఇక సరయు, మనీషాలను గంగాధర్‌ పిలిస్తే చంపేసేలా ఉన్నారే అని సరయు అంటే ఒక ముద్ద పట్టుకొని పక్కకు వెళ్లి ఉమ్మేద్దాం అనుకుంటారు. ఇక లక్ష్మీ గంగాధర్‌కి తినిపిస్తుంది. జున్ను లక్కీకి తినిపిస్తాడు. దేవయానితో వరదరాజులకు తినిపించమని జయదేవ్ చెప్తాడు. దేవయాని తీసుకొని వచ్చి బలవంతంగా వరదరాజులకు తినిపించాలని చూస్తే అందులో విషం ఉందని వరదరాజులు చెప్పేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మనీషా, సరయు తమ నోట్లో ఉన్న ప్రసాదం బయట ఊసేస్తారు. అందులో విషం ఉందని మీకు తెలిసే ఉంటుందని వరదరాజులు అంటాడు.


నువ్వు కలిపావా అని వరదరాజులకు శివ అడిగితే లేదని చెప్తాడు. ఇక విషం కలిసిందని తెలిస్తే చంపేస్తా అని గంగాధర్, మిత్ర అనుకుంటారు. ఇంతలో పంతులు వచ్చి అది మంచి ప్రసాదమే విషం లేదు. ఇందాక అమ్మవారి ప్రసాదం చుట్టూ పాము తిరిగితే నేను ఎందుకైనా మంచిదని వేరే కుండ తీసుకొచ్చానని చెప్తారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రిని కాటేయడానికి వచ్చిన పాము.. నయనికి పిచ్చి అంటోన్న ఫ్యామిలీ!